జిల్లాలో రీచ్ లలో ఇసుక తవ్వకాలకు సంబంధించి అవసరమైన అనుమతులు,

 గుంటూరు, 03 ఏప్రిల్, 2025 (ప్రజా అమరావతి): జిల్లాలో రీచ్ లలో ఇసుక తవ్వకాలకు సంబంధించి అవసరమైన అనుమతులు,


ఇతర ప్రక్రియలు నిర్దేశిత సమయంలో పూర్తి చేసి ప్రజల అవసరాలకనుగుణంగా ఇసుక సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు.


గురువారం కలెక్టరేట్ లోని డి‌ఆర్‌సి సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తో కలసి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ సమావేశ ఎజెండా అంశాలకు సంబంధించి మాట్లాడుతూ ఇసుక తవ్వకాలకు బోట్స్ మెన్ సొసైటీ కి కేటాయించే రాయిపూడి డి-సిలిటేషన్ పాయింట్ పర్యవేక్షణ ఏ శాఖ పరిధిలోకి వస్తుందో రాష్ట్ర మైనింగ్ శాఖ అధికారులను సంప్రదించి తెలుసుకోవాలని అధికారులకు సూచించారు.  బొమ్మువారిపాలెం-16 ఓపెన్ శాండ్ రీచ్ మైనింగ్ ప్లాన్ ను రూపొందించి టెండర్ షెడ్యూల్ ను సిద్దం చేయాలన్నారు.  గుండెమెడ ఓపెన్ శాండ్ రీచ్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం బిడ్ లు ఆహ్వానించి ఏప్రిల్ 16 నాటికి అర్హత గల బిడ్డర్ కు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రకాశం బ్యారేజ్ వద్ద నదులు ఇసుక నిల్వల కోసం హైడ్రో గ్రాఫిక్ సర్వే కోసం ఈ‌ఈ, కే‌సి కెనాల్ డివిజన్ కు జిల్లా వాటా కింద రూ.24 లక్షలు మంజూరు కు చర్యలు తీసుకోవాలన్నారు.  ఇసుక సరఫరా చేసే కేంద్రాల వద్ద పర్యవేక్షణ కోసం సంబంధిత తహసీల్దార్ల ద్వారా రెవెన్యూ ఉద్యోగులను మైనింగ్ అధికారులు నియమించుకోవాలన్నారు.  


సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, జిల్లా మైన్స్ జియాలజీ అధికారి(ఇంచార్జ్)  నాగిని, గుంటూరు  ఆర్‌టి‌ఓ జి.ఎస్.ప్రసాద్, జిల్లా భూగర్భ జలవనరుల శాఖ డీడీ వందనం, జిల్లా పంచాయతీ అధికారి సాయి కుమార్, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ఈ కళ్యాణ చక్రవర్తి, ఇ.ఇ. కే‌సి డివిజన్ కన్జర్వేటీవ్ రవి కిరణ్, ఏ‌పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ‌ఈ ఎం‌డి.నజీమా బేగమ్, తహశీల్దార్లు సిద్ధార్ద, డి సీతారామయ్య, సునీత, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.   


Comments