అమరావతి (ప్రజా అమరావతి);
• *టీడీపీ కార్యాలయానికి వినతులతో పోటెత్తిన అర్జీదారులు*
• *అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన హోంమంత్రి అనిత, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాద్*
తన భర్త చనిపోయాక తన అత్తమామలు, మరదలు తాము కెనడాకు వెళ్తున్నామని.. వచ్చాక ఆస్తి ఇస్తామని చెప్పి తనను ఒట్టి చేతులతో పుట్టింటికి పంపి తనకు ఆస్తిని ఇవ్వకుండా వారు మోసం చేశారని.. గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన ముద్రబోయిన వెంకటేశ్వరమ్మ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ లకు అర్జీ ఇచ్చి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అర్జీలు స్వీకరించిన నేతలు విచారించి న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. అధికార్లతో ఫోన్లలో మాట్లాడి సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
• చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం కోనంగిపల్లి గ్రామానికి చెందిన పేసం మధు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. వైసీపీ పార్టీకి చెందిన పి. రామిరెడ్డి అనే వ్యక్తి పచ్చికాపల్లంగ్రామంలో ప్రభుత్వ పోరంబోకు భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా.. పక్కనే తన తల్లిగారి పేరుమీద ఉన్న పట్టా భూమిని కూడా కబ్జా చేసేందకు యత్నిస్తున్నాడని.. అతనిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
• నెల్లూరు జిల్లా బుచ్చి రెడ్డిపాళెం గ్రామానికి చెందిన షేక్ ముసీర్ బాషా గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. గ్రామంలోని ఖాజీనగర్ కాలనీ నందు గల mpup ఉర్థు ప్రైమరీ స్కూల్ నందు 8వ తరగతి వరకు కలదని ఇందులో 9,10వ తరగతి విద్యార్థులు కూడా చదువుకునేలా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
• ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మొర్సుమిల్లి గ్రామానికి చెందిన బోజర్ల వెంకట కోటేశ్వరరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞ్పప్తి చేస్తూ.. తమ గ్రామంలోని హిందూ స్మశానవాటికను, అలాగే చిన్నచెరువును కబ్జాదారులు ఆక్రమించుకున్నారని.. వాటిని కబ్జా నుండి విడిపించాలని కోరాడు.
• గుంటూరు జిల్లా తెనాలి మండలం సుల్తానాబాద్ గ్రామానికి చెందిన పావులూరి లక్ష్మి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. పూర్వం నుండి వెళ్తున్న దారిగుండా తమ భూమిలోకి వెళ్లకుండా నూతళ్ల విష్ణువర్ధన్ రావు అడ్డుకుంటున్నాడని.. దాంతో గత నాలుగు సంవత్సరాలుగా తమ పొలం బీడుగా ఉంచుకోవాల్సి వస్తుందని.. దయ చేసి అధికారులు చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు.
• నెల్లూరుకు చెందిన సవేంద్ర బాబు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తాము మెగా(మెయిల్) కంపెనీ తరఫున సబ్ కాంట్రాక్ట్ చేశామని.. దానికి సంబందించిన బిల్లు రూ. 19,37000 ఆరు సంవత్సరాల నుండి ఇవ్వడం లేదని దాంతో అప్పుల పాలై ఇంటి పోషణ కూడా కష్టంగా మారిందని.. దయ చేసి తనకు కంపెనీ నుండి డబ్బులు వచ్చేలా సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
• విజయనగరం జిల్లా డెంకాడ మండలానికి చెందిన ఆదినారాయణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తన పేరుమీద ఉన్న పొలాన్ని పైడమ్మ అనే మహిళ పేరుపైకి మార్చారని.. దాన్ని ఆమె అమ్మి అక్రమ రిజిస్ట్రేష్ చేశారని.. దాన్ని రద్దు చేసి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
• శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన పి. లక్ష్మీదేవమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమకు చెందిన భూమిని మరోకరు ఆక్రమించుకొని నాగిరెడ్డి అనే వ్యక్తికి అక్రమంగా అమ్మారని.. దీనిపై విచారించి తమకు న్యాయం చేయాలని కోరారు.
addComments
Post a Comment