కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు.



 *కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు*


 కొల్లిపర (ప్రజా అమరావతి);

 మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు కాలం చెల్లిని మందులు ఇవ్వడంతో ఆందోళన నెలకొన్నది. బుధవారం నాడు ఉదయం అనారోగ్యంతో వెళ్లిన ఒక మహిళకు మందులు ఇచ్చే క్రమంలో 2024వ సంవత్సరానికి చెందిన మందులను ఇవ్వడం జరిగినది. మందులు తీసుకున్న ఆ మహిళ దాని మీద ఉన్న తేదీని చూసి సూపర్నెంట్ భరత్ మౌఖికంగా ఫిర్యాదు చేయగా పొరపాటున ఒక సీటు వచ్చినది సర్దుకుపోండి అని అన్నారు, అని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూపర్నెంట్ భరత్ ని  వివరణ అడగ్గా అదేమీ లేదు కింద పడిపోయిన మందులు తీసి ఇచ్చినట్లు ఉన్నారు అని ఉద్యోగులపై సానుభూతి చూపిస్తూ వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్య కేంద్రం వారు విధులకు ఆలస్యంగా వస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి.

Comments