పాత బ్రిడ్జ్ వున్న సమయంలో వర్షాకాలం వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోటo జరిగింది.

 

గుంటూరు, 08 మార్చి, 2025 (ప్రజా అమరావతి):-  అరండల్ పేట, డొంక రోడ్ లోని ఆధునీకరించిన మూడు వంతెనల పునర్నిర్మాణం తరువాత ప్రజల రాకపోకలకు వీలుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు.   


శనివారం సాయంత్రం కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ నజీర్ అహమ్మద్, గళ్ళ మాధవి, నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులతో కలసి ఆధునీకరించిన మూడు వంతెనల బ్రిడ్జ్ ని ప్రారంభించారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ పనుల నిమిత్తం గుంటూరు  మూడు వంతెనల మీదుగా 25 నవంబర్ 2024 నుండి రాకపోకలు నిలిపివేయటం జరిగిందని, పునర్నిర్మాణం తరువాత ఈ రోజు నుండి రాకపోకలను లాంఛనంగా ప్రారంభించడం జరిగిందన్నారు.  గతంలో మూడు వంతెనలపై రెండు రైల్వే లైన్లు ఉండేవని రైళ్లు రాకపోకలకు, నాలుగు లైన్లు వేసేందుకు ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు.  పాత బ్రిడ్జ్ వున్న సమయంలో వర్షాకాలం వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోటo జరిగేదని


, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా కాలువల నిర్మాణం మున్సిపల్ అధికారులు చేపట్టినందున ఆ పరిస్థితి ఉండదని భావిస్తున్నానన్నారు. ఈ నిర్మాణానికి 5.5 కోట్లు ఖర్చు చేయటం జరిగిందన్నారు. నగరంలో ప్లాస్టిక్ వ్యర్ధాల వలన అనేక సమస్యలు తలెతుతున్నాయని నగర కమీషనర్ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. 

  

గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ నజీర్ అహమ్మద్ మాట్లాడుతూ వర్షం పడితే చెరువులా మారే పరిస్థితి గతంలో ఉండేదని 5.5 కోట్ల వ్యయంతో రైల్వే అధికారులు పనులు చేపట్టడం జరిగిందన్నారు.  50 అడుగుల రోడ్డు ఉన్నదే కాని, ఆక్రమణల  వలన ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. మాస్టర్ ప్లాన్ మేరకు 60 అడుగుల రోడ్డు విస్తరణకు స్థానిక ప్రార్ధన మందిరాల మత పెద్దలు, ప్రజలు సహకరించాలన్నారు.  అన్ని వర్గాల ప్రజలతో సమీక్షలు నిర్వహించి ఆక్రమణలను తొలగించడం జరుగుతుందన్నారు.  త్వరలో శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ పనులు మొదలు పెడతామన్నారు.  శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ పనుల నిర్మాణానికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేoదుకు మూడు వంతెనల బ్రిడ్జ్ ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు.   


గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గళ్ళ మాధవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కేంద్ర సహాయమంత్రి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పని వేగవంతంగా అవుతుందని పేర్కొన్నారు.  ప్రజా సమస్యల దృష్ట్యా మూడు వంతెనల నిర్మాణం చేపట్టడం జరిగిందని, దీని మూలంగా రాబోయే రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తొలుగుతాయన్నారు.  కేంద్ర సహాయ మంత్రి చొరవతో మూడు వంతెనల నిర్మాణం పూర్తి కావటం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు.  ట్రాఫిక్ కష్టాల నుండి నగర ప్రజలు బయటపడేందుకు ఆక్రమణలు తొలిగిస్తున్నామని అన్ని వర్గాల వారు సహకరించాలన్నారు. 


గుంటూరు నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ గుంటూరు నగర ప్రజలు రాబోయే రోజుల్లో అన్ని శుభవార్తలే వింటారని రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు మొదలగు వసతులు ప్రతి కుటుంబానికి అందిస్తామని, గుంటూరు నగరాన్ని ఒక కార్పొరేట్ నగరంగా  అభివృద్ధి చేస్తామన్నారు.  ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించేందుకు ప్రణాళికను సిద్దం చేస్తున్నామని త్వరలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.  ట్రాఫిక్ డైవర్షన్ కోసం ఆక్రమణలు తొలగిస్తున్నామని ప్రజలు సహకరించాలని కోరారు. 


ఈ కార్యక్రమంలో రైల్వే డిఆర్ఎం రామకృష్ణ, ఏపి టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మెన్ మన్నవ మోహన్ కృష్ణా, డెగల ప్రభాకర్, మద్దిరాల మ్యాని, డిప్యూటీ మేయర్ సజీల, తాళ్ల వెంకటేశ యాదవ్, జనసేన గుంటూరు నగర అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ సిబ్బంది, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.   


Comments