గుంటూరులో జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

 గుంటూరులో  జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..





గుంటూరు (ప్రజా అమరావతి):  ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో ఒకటైన జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ తమ తొలి శాఖను గుంటూరులో ప్రారంభించారు.

 కొత్త శాఖ డిపాజిట్లు, గృహ రుణాలు, బంగారు రుణాలు, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ వ్యాపార రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాలు, సరఫరా వైన్ ఫైనాన్స్, వ్యవసాయ రుణాలు వంటి విస్తృత శ్రేణి బ్యాంకింగ్ ఉత్పత్తులు  సేవలను అందిచనుంది.జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి, సీఈఓ శ అజయ్ కన్వాల్, ఇతర ప్రముఖులు, బ్యాంకు సీనియర్ అధికారుల సమక్షంలో  టుబాకో ప్రోడక్ట్స్ - డైరెక్టర్, పొలిశెట్టి సోమసుందరం,  శ్యామ్ సుందర్ పోలిశెట్టి ఈ శాఖను ప్రారంభించారు.ఈ సందర్భంగా జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజయ్ కన్వాల్ మాట్లాడుతూ, "అతి ముఖ్యమైన వాణిజ్య, వ్యవసాయ కేంద్రమైన గుంటూరులో మా మొదటి శాఖను ప్రారంభించటం చాలా సంతోషంగా ఉన్నామన్నారు. వ్యాపార సంస్థలు, వ్యక్తులకు అత్యుత్తమ ఆర్థిక సేవలను అందించడం ద్వారా రాష్ట్ర వృద్ధిలో పాల్గొనాలనే మా నిబద్ధత యొక్క ప్రారంభాన్ని ఈ విస్తరణ ప్రతిబింబిస్తుంది" అని అన్నారు. పోలిశెట్టి సోమసుందరం టుబాకో ప్రోడక్ట్స్ డైరెక్టర్ శ్రీ శ్యామ్ సుందర్ పోలిశెట్టి మాట్లాడుతూ, 'గుంటూరులో తమ మొదటి శాఖతో జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో తమ తొలి అడుగు వేసిన ఈ మహోన్నత కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.అభివృద్ధి చెందుతున్న వాణిజ్య,  వ్యవసాయ కేంద్రంగా, శక్తివంతమైన వ్యాపార సంస్థలు, వ్యాపారవేత్తలకు నిలయంగా గుంటూరు ఉందన్నారు. అందుబాటులో అత్యుత్తమ ఆర్థిక సేవల ద్వారా వారు మరింత ఎక్కువ ప్రయోజనం పొందుతారని అన్నారు. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇప్పుడు 25 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో 796 శాఖలను నిర్వహిస్తుందన్నారు. వీటిలో 32.33 శాతం  అన్ బ్యాంక్డ్  రూరల్ సెంటర్ (యుఆర్సీ) శాఖలు  దాదాపు 25000 మంది ఉద్యోగులు సంస్థకు వున్నారని తెలిపారు.

Comments