కొల్లిపర , 19 మార్చి 2025 (ప్రజా అమరావతి): కొల్లిపర 1 వ సచివాలయం పరిధిలోని గృహాలలో ఎన్ సి డి -3.0 నమోదు, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మరియు పి 4 సర్వే పై సేకరిస్తున్న ఫీడ్ బ్యాక్ విధానాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ, సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలసి పరిశీలించారు. తొలుత కొల్లిపర 1 వ సచివాలయం పరిధిలో నివాసం వుంటున్న జొన్నల శ్రీనివాస రెడ్డి ఆరోగ్య సమస్యలపై యాప్ లో నమోదు చేస్తున్న వివరాల తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వారి ఎత్తు , బరువు కొలతలను యాప్ లో నమోదు చేయడం , అలాగే రక్తపోటు , మధుమేహం టెస్ట్ లు నిర్వహించి వాటి వివరాలను యాప్ లో నమోదు చేయడాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి సూచనలు చేసారు. ఎన్ సి డి -3.0 కార్యక్రమం క్రింద కుటుంబంలోని సభ్యులందరి ఆరోగ్య పరీక్షలు చేసి కాన్సర్ , డయాబెటిక్ , బిపి వంటి జబ్బులను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ విధంగా నమోదు అయిన వివరాల ఆధారంగా వారికి చికిత్సను అందించి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యమన్నారు. కావున కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను యాప్ నందు నమోదు చేయడంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కాన్సర్, రక్తపోటు , మధుమేహం వంటి జబ్బులకు చికిత్స పొందుతూ వుంటే వాటి వివరాలను కూడా పొందుపరచాల్సి వుంటుందన్నారు. లక్ష్యం మేరకు ప్రతి ఇంటింటికి వెళ్ళి కుటుంబంలోని అందరి సభ్యుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. అనంతరం అదే సచివాలయం పరిధిలో నివాసం వుంటున్న శ్రీమతి శాంతి గారి ఇంటిలో చేపడుతున్న వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మరియు పి4 సర్వే పై ఫీడ్ బ్యాక్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు సర్వే పనులు పూర్తి చేయాల
ని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం ఇటీవల ప్రభుత్వం గృహ నిర్మాణాలకు ఎస్సీ, ఎస్టీ లకు అందిస్తున్న అదనపు సహాయాన్ని కొల్లిపర గ్రామంలో ఎంత మందికి అందించాల్సి వుందని హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఫీవుల్లా ఖాన్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ అదనపు ఆర్దిక సహాయాన్ని పొందేందుకు 65 మంది లబ్దిదారులను గుర్తించడం జరిగిందని , వారిలో ఇప్పటి వరకు 14 మంది వివరాలు నమోదు పూర్తి అయిందని , మిగిలిన 51 మందికి పధకం వివరాలు తెలియజేసి ఆన్లైన్ లో నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కు తెలిపారు. త్వరితగతిన వివరాలు నమోదు చేసి ఈ అదనపు ఆర్ధిక లబ్ది లబ్దిదారులకు చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో విజయలక్ష్మీ డియం అండ్ హెచ్ ఓ డా.విజయలక్ష్మీ, కొల్లిపర తహశీల్దార్ సిద్ధార్ధ , యంపీడిఓ విజయలక్ష్మీ, ఎన్ సి డి ప్రోగ్రాం ఆఫీసర్ డా. రోహిణి రత్నశ్రీ , అడిషనల్ డియం అండ్ హెచ్ ఓ డా. అన్నపూర్ణ , సిహెచ్ఓ కళ్యాణి , ఇంజనీరింగ్ అసిస్టెంట్ మధు సుధాన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment