తెనాలిలో జర్నలిస్టుల నిరసన.

 తెనాలిలో జర్నలిస్టుల నిరసన



తెనాలి (ప్రజా అమరావతి):

జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ సంయుక్తంగా సోమవారం నిరసన వ్యక్తంచేశారు. పార్వతిపురం మన్యం జిల్లా మక్కువ మండల ప్రజాశక్తి విలేఖరి ఎం రామారావు దాడిని ఖండిస్తూ తెనాలి కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన అధికారి శ్రీధర్ బాబు కు వినతి పత్రం సమర్పించారు. విలేకరిపై దాడి చేసిన టిడిపి మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాలనాయుడు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం శ్రద్ధ వహించాలని, రక్షణ చట్టాలను అమలు చేయాలని కోరారు. రాజకీయ పార్టీల నేతలు వారిపై వార్తాపరమైన అభియోగాలు ఏమైనా ఉంటే వార్త రాసిన విలేకరులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించాలి గాని భౌతిక దాడులు చేయటం హేయమైన చర్య అన్నారు.

ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి అంబటి శ్యామ్ సాగర్ మాట్లాడుతూ అధికార పార్టీ యొక్క తప్పులను ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత విలేకరులపై ఉంటుందని గుర్తు చేశారు. విలేకరిపై దాడిచేసిన వేణుగోపాల నాయుడు ను ఇప్పటివరకు పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడం, చట్టపరమైన చర్యలను అమలు చేయకపోవడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రజాశక్తి తెనాలి డివిజన్ ఇంచార్జి ప్రభకారావు మాట్లాడుతూ ఈ ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు ఖండించారని ఇప్పటికైనా ప్రభుత్వం దాసిచేసిన వేణుగోపాలనాయుడు పై చర్యలు తీసుకోవాలన్నారు. విలేకరులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆలోచించాలని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నాయకులు శేషం ప్రదీప్, నాగ మల్లేశ్వరరావు, మారిశెట్టి భాస్కర్, దుర్గాప్రసాద్, నరసింహ, తెనాలి ఫెడరేషన్ నాయకులు ఎస్ఎస్ జాహీర్, సిహెచ్ చంద్రశేఖర్, అచ్యుత సాంబశివరావు, దేవరపల్లి నాగరాజు, ఉన్నాం భూషణం,   దేవరపల్లి రవి కిరణ్, శ్రీరామ్ సుభాష్, కోడూరు నాగరాజు.

Comments