ప్రమాదంలో కరకట్ట నివాసులు...



 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*ప్రమాదంలో కరకట్ట నివాసులు...


*


*భారీ వాహనాలతో కరకట్ట ధ్వంసం...*


నిబంధనలు ఉల్లంఘించిన పట్టించుకోని అధికారులు...


*గాలిలో కలుస్తున్న ప్రాణాలు...*


*అనుమతులు లేని మార్గాలలో భారీ వాహనాలు యథేచ్చగా తిరుగుతూ ప్రమాదాల కారణం అవుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడు...*


*తాడేపల్లి విజయవాడ క్లబ్  కరకట్టపై నెలకొన్న పరిస్థితులు, కొనసాగుతున్న ప్రమాదాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి...*


*రివర్ కన్జర్వెన్సీ (ఆర్సీ) చట్టాన్ని పక్కాగా అమలు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో అనర్ధాలకు దారి తీస్తోంది.‌..*


*ఈ నిర్లక్ష్యం వల్ల రూ. కోట్లతో నిర్మించిన కరకట్ట నాశనమై పోతుంది...*


*తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో ఎన్నో నిండు జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయి...*


*తరచు మితిమీరిన అతివేగంతో వాహనాల రాకపోకలు. గతంలో ఎన్నో ప్రమాదాలు...*


*సంబంధిత అధికారులకు సమాచారం చేరేలోపే గుట్టుచప్పుడు కాకుండా వాహనాలు తరలింపు...*


*ఏ నిమిషానికి ఏ ప్రమాదం జరిగిందో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్న కరకట్టవాసులు...*



Comments