కొల్లిపర (ప్రజా అమరావతి);
*మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక భరోసా
*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్*
తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం, అత్తోట గ్రామంలో ఈరోజు ఉదయం నూతనంగా నిర్మించిన మినీ గోకులం షెడ్లనుమంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.
జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా తెనాలిలో ఏర్పాటు చేసిన మినీ గోకులం షెడ్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించి, అలాగే పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పశువులకు గ్రాసం వేసి కొంతసేపు వాటితో గడిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో గుంతలు పూడ్చే పనులు కూడా నిర్వహించలేని పరిస్థితి ఉండేది.
డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గత ఏడాది పల్లెల్లో రహదారుల నిర్మాణం జరిగిందన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
తెనాలి నియోజకవర్గం లో గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం మరో 25 కోట్ల రూపాయ లు కేటాయించిన విషయాన్ని మంత్రి తెలిపారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నేడు మినీ గోకులం షెడ్లను ప్రారంభించామని తెలిపారు.
మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక బాసట, ఉపాధి లభిస్తుంది.ఈ పథకంలో రైతులు 10% ఏర్పాటు చేసుకుంటే, ప్రభుత్వం 90% సబ్సిడీ అందిస్తోంది.ఆత్తోట గ్రామం నందు అంగన్వాడీ కేంద్రం లో చిన్నారులకు భోగి పండ్లు పోసి సంక్రాంతి సంబరాలను మంత్రి ప్రారంభించారు
జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 170 సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరు చేయగా, 60% రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు.అలాగే, మినీ గోకులం షెడ్ల కోసం 386 మందికి మంజూరు చేయగా, ఈరోజు 170 షెడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు..అత్తోట గ్రామంలో జిల్లాస్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ పథకం పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వంటి షెడ్ల నిర్మాణానికి వర్తిస్తుందని వివరించారు.
addComments
Post a Comment