వివిధ వర్గాలకు గుడ్ న్యూస్ ప్రకటించిన ఏపీ సర్కార్.

 అమరావతి (ప్రజా అమరావతి);


*వివిధ వర్గాలకు గుడ్ న్యూస్ ప్రకటించిన ఏపీ సర్కార్.


*


*విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు జరపాలని కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం.*


*మొత్తంగా రూ. 6700 కోట్ల విడుదలకు సీఎం చంద్రబాబు ఆదేశం.* 


ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు.


*యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీని అమలు చేస్తూ గత ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పెట్టిన ఫీజు రీ ఇంబర్సుమెంట్ బకాయిలు సహా.. నిధుల విడుదలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.*


సంక్రాంతి సందర్భంగా వివిధ వర్గాలకు గుడ్ న్యూస్ చెప్పేలా నిర్ణయం తీసుకునేందుకు అత్యవసరంగా ఆర్థిక శాఖ సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.


హుటాహుటిన అనంతపురం నుంచి విజయవాడకు చేరుకున్న ఆర్థిక మంత్రి పయ్యావుల.


నిధుల లభ్యత.. ఏయే వర్గాలకు బిల్లులు పెండింగులో ఉన్నాయన్న అంశంపై చంద్రబాబు  సమీక్ష.


*పెండింగ్ బిల్లుల స్టాటస్ వివరించిన మంత్రి పయ్యావుల.*


*ఉన్న నిధులను బిల్లుల రూపంలో చెల్లించేస్తే.. ఇబ్బందులు వస్తాయన్న అధికారులు.*


ఇటీవలే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకూ ఒకేసారి రూ. వేయి కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరిపామని గుర్తు చేసిన ఆర్థిక శాఖ అధికారులు.


*వివిధ వర్గాలకు ఇచ్చిన హామీ మేరకు చెల్లింపులు జరపడంలో ఇప్పటికే జాప్యమైందన్న సీఎం చంద్రబాబు.*


*ఇబ్బందులున్నా.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని.. తాము ఏదో రకంగా సర్దుబాటు చేసుకుంటామన్న మంత్రి పయ్యావుల*


వెంటనే ఆయా వర్గాలకు నిధులను విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశం.



*పయ్యావుల కేశవ్, ఆర్ధిక శాఖ మంత్రి*


వివిధ వర్గాలకు చెల్లించాల్సిన రూ. 6700కోట్ల రూపాయల నిధుల విడుదలకు సీఎం ఆమోదం తెలిపారు


సంక్రాoతి కానుకగా విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు ఈ మొత్తం బకాయిలు చెల్లిస్తున్నాం


ఉద్యోగులకు జీపీఎఫ్ కింద  రూ.519 కోట్లు, పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిల్లో ఒక ఇన్ష్టాల్మెంట్ రూ. 214 కోట్లు, సీపీఎస్ కు సంబంధించిన రూ. 300 కోట్లు, టీడీఎస్ కింద రూ. 265 కోట్లు చెల్లిస్తున్నాం.


ఉద్యోగులకు మొత్తంగా రూ. 1300 కోట్లు విడుదల చేస్తున్నాం.

ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు రూ.788 కోట్లు విడుదల చేస్తున్నాం.


చిరు కాంట్రాక్టర్లు రూ. 10 లక్షల లోపు బిల్లులు ఉన్న 26వేల మందికి లబ్ది చేకూరేలా రూ.586 కోట్లు విడుదల చేస్తున్నాం.


అమరావతి రైతులకు కౌలు బకాయిలు రూ. 241 కోట్లు చెల్లిస్తున్నాం.


చిరు వ్యాపారులు 6వేల మందికి లబ్ది చేకూరేలా రూ. 100 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు రూ. 500 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 500 కోట్లు విడుదల చేస్తున్నాం.

 

జగన్ చేసిన రూ. 10 లక్షల కోట్ల అప్పును తీర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా సీఎం ఆలోచనలు ఉన్నాయి


ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ నడవాల్సిన వ్యవస్థ ఎక్కడా ఆగకుండా జాగ్రత్త పడుతున్నాం.


పడిపోయిన రాష్ట్రాన్ని పరుగులు పెట్టించే దిశగా సీఎం పని చేస్తున్నారు.

Comments