ప్రతి ఒక్కరిని వారి వారి గమ్యస్థానాలకు సకాలంలో చేరేలా అన్ని చర్యలు.



డిజిపి కార్యాలయం,

మంగళగిరి (ప్రజా అమరావతి);


సంక్రాంతి పండగ కోసం సొంత ఊర్లకు ప్రయాణమవుతున్న ప్రయాణికులందరికి సరిపడా బస్సు సౌకర్యాలు లేక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బస్టాండ్లలో ప్రయాణికులు ఎక్కడివారు అక్కడ సరిపడా బస్సులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లుగా కొన్ని ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి & ఏపిఎస్ఆర్ టి సి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ద్వారక తిరుమల రావు  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోల మేనేజర్లతో, జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీ ద్వారకా తిరుమలరావు  మాట్లాడుతూ సంక్రాంతి పండగ కోసం సొంతూళ్లకు ప్రయాణమవుతున్న ఏ ఒక్క ప్రయాణికుడు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరిని వారి వారి గమ్యస్థానాలకు సకాలంలో చేరేలా అన్ని చర్యలు చేపట్టాలని డిపోల మేనేజర్లకు, జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు.

Comments