రబీ సీజన్ కు రాష్ట్రానికి సమృద్ధిగా యూరియా,ఇతర ఎరువులను కేటాయించిన కేంద్రం.


        


మంగళగిరి  (ప్రజా అమరావతి);


రబీ సీజన్ కు  రాష్ట్రానికి సమృద్ధిగా యూరియా,ఇతర ఎరువులను  కేటాయించిన కేంద్రం .


కేటాయింపులో పూర్తి సహకారం ,చొరవ చూపించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె.రామ్మోహన్ నాయుడు కి కృతజ్ఞతలు తెలిపిన 

 కింజరాపు అచ్చెన్నాయుడు ,వ్యవసాయ శాఖ మంత్రి,ఆంధ్రప్రదేశ్.

   రబీ సీజన్ కు 21.31 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు లక్ష్యం కాగా, లక్ష్యానికి మించి 22.30 లక్షల టన్నుల  ఎరువులు కేటాయించిన కేంద్రం.

యూరియా ఎరువు ప్రస్తుత జనవరి మాసానికి 2.29 లక్షల మెట్రిక్ టన్నుల అవసరము కాగా ,కేంద్రం 2.32 లక్షల మెట్రిక్ టన్నులను యూరియాను కేటాయించింది 


      కింజరాపు అచ్చెన్నాయుడు  ,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన లో రాష్ట్రానికి రబీ సీజన్ పంట కాలానికి అవసరం మేర అన్ని రకాల ఎరువులను లక్ష్యానికి మించి కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వమునకు కృతజ్ఞతలు తెలిపారు . ఈ కేటాయింపుల్లో ముఖ్యముగా దేశీయముగా తయారయ్యి సరఫరాకు అందుబాటులో వుండే స్వదేశీ యూరియా ను ఒక లక్ష టన్నుల మేర కేటాయింపు చేయడంలో పూర్తి స్థాయి సహకారం ,చొరవ చూపి కేంద్ర ప్రభుత్వం అధికారులతో సమన్వయం చేసుకుంటూ , పంటలకు యూరియా  అవసరం ఏర్పడిన సరైన సమయములో యూరియాను  కేటాయించినందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కి కృతజ్ఞతలు,అభినందనలను శ్రీ అచ్చెన్నాయుడు తెలిపారు .

   శ్రీ S డిల్లీరావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ వారికి తగిన సూచనలను తెలియజేస్తూ , ప్రస్తుత పంట పరిస్థితులకు వినియోగం ఎక్కువుగా వున్న యూరియా ను రాష్ట్రానికి సమృద్ధిగా కేటాయించిన దృష్ట్యా, రైతులకు యూరియా ఎరువును సకాలములో అందించటానికి పంపిణీ ఏర్పాట్లు చేయవలసినదిగా కోరారు .తద్వారా ఎరువులు అందుబాటులో వుండే దృష్ట్యా  వ్యాపారులు ఎక్కువ ధరలకు అమ్మటం కానీ ,నల్ల బజారుకు తరలించడం వంటి వాటిని నిరోధించవచ్చని తెలిపారు .



Comments