అమరావతి (ప్రజా అమరావతి);
కార్మిక రాజ్య బీమా సంస్థ ప్రాంతీయ (ESIC) కార్యాలయం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ యొక్క రీజనల్ డైరెక్టర్గా శ్రీ ఎం. రామారావు బాధ్యతలను స్వీకరించారు.
విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా శ్రీ ప్రణవ కుమార్ బాధ్యతలు స్వీకరించారు
ESIC రీజనల్ ఆఫీసు, విజయవాడ – కార్మికుల సామాజిక భద్రత అవసరాలను తీర్చడంలో, ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించడంలో, మెరుగైన ఆరోగ్య సేవల ప్రాతిపదికను పెంచడంపై దృష్టి పెట్టనుంది.
శ్రీ ఎం. రామరావుగారు, విజయవాడ లోని ESIC ప్రాంతీయ కార్యాలయంనందు రీజనల్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా, శ్రీ ప్రణవ కుమార్ విజయవాడ లోని రీజనల్ ఆఫీసులో జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోని ESIC ఆఫీసుల కార్యకలాపాలను నిర్వహించే అధికారుల బృందానికి రీజనల్ డైరెక్టర్ ఇంచార్జ్ నేతృత్వం వహిస్తారు. అలాగే, ESIC/ESI ఆసుపత్రులు మరియు ఔషధ కేంద్రాల ద్వారా అధిక నాణ్యతతో వైద్య సేవలను అందించడంలో సహాయం చేస్తారు.
ఈ ఇద్దరు అధికారులు, ESI లబ్దిదారుల కోసం ఆరోగ్య అవగాహన, ఆధార్ సీడింగ్ శిబిరాలను ఏర్పాటు చేసి అవగాహన పెంచే లక్ష్యంగా పనిచేస్తారు. వారి ప్రధాన లక్ష్యం, కార్మికుల సామాజిక భద్రత అవసరాలను తీర్చడం, మెరుగైన ఆరోగ్య సేవలను అందించడం, అలాగే ప్రాథమిక ఆరోగ్య సేవలను పెంచడంపై దృష్టి పెట్టడం.
ఆంధ్రప్రదేశ్ లో ESI పథకం అన్ని జిల్లాలను కవర్ చేస్తూ పూర్తిగా అమలులో ఉంది. రాష్ట్రంలో సుమారు 54 లక్షల ESI లాభదాయకులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. ESI పథకం విజయవాడలో 1 రీజనల్ ఆఫీసు మరియు విశాఖపట్నం మరియు తిరుపతిలో 2 సబ్-రీజనల్ ఆఫీసుల ద్వారా నిర్వహించబడుతోంది. రాష్ట్రంలో కాకినాడలో 1 ESIC ఆసుపత్రి మరియు విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతిలలో 4 ESI ఆసుపత్రులు మరియు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలలో 79 ఔషధ కేంద్రాలు ఉన్నాయి.
addComments
Post a Comment