వెంకటాద్రి ఆయిల్స్ రైస్ మిల్లులో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి.



*వెంకటాద్రి ఆయిల్స్ రైస్ మిల్లులో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి


*


గంగూరు ( పెనమలూరు): డిసెంబరు 20 (ప్రజా అమరావతి);


రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పెనమలూరు మండలం, గంగూరులోని 

వెంకటాద్రి ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రైస్ మిల్లును సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.


రైతుల ధాన్యం కళ్లెం దగ్గర నుంచి మిల్లుకు చేరే విధానాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన మిల్లులో దాన్యంలోని తేమశాతం లెక్కింపును పరికరం ద్వారా స్వయంగా పరిశీలించారు.  రైతు సేవా కేంద్రం నుండి మిల్లుకు చేరిన దాన్యంలో తేమ శాతాన్ని లెక్కించడంలో వ్యత్యాసాలు వస్తున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, దానిని లెక్కించడంలో కచ్చితత్వం ఉండాలని సూచించారు.


మిల్లుకు చేరిన వాహనాలలోని ధాన్యాన్ని కాటా (వే బ్రిడ్జి) వేసే విధానం, ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ (ఎఫ్ టి ఓ) జనరేషన్, ఇప్పటివరకు మిల్లుకు ఎంత ధాన్యం వచ్చింది, నగదు చెల్లింపు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.


మిల్లు లోపల ముఖ్యమంత్రి కలియ తిరిగి ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్యాకింగ్ చేసి వాహనాలకు లోడింగ్ చేస్తున్న ప్రక్రియను పరిశీలించారు.


రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, కృష్ణాజిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర కార్మిక కర్మాగారాలు బాయిలర్లు, వైద్య బీమా సేవలు శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, పెనమలూరు, పామర్రు, గుడివాడ, పెడన నియోజకవర్గాల శాసనసభ్యులు బోడె ప్రసాద్, వర్ల కుమార్ రాజా, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి వీర పాండ్యన్, కమిషనర్ జిలాని, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారిణి వి పార్వతి, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ డి షర్మిల, జిల్లా మేనేజర్ పద్మ దేవి, తదితర శాఖల అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీరయ్య పిన్నమనేని, రైస్ మిల్ యజమాని వి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.



Comments