శిశిరం ఆడియో సిడిని ఆవిష్కరించిన ఏపీ ఎఫ్ డి సి మేనేజర్ శ్రీనివాస్ నాయక్.

 శిశిరం ఆడియో సిడిని ఆవిష్కరించిన ఏపీ ఎఫ్ డి సి మేనేజర్ శ్రీనివాస్ నాయక్



విజయవాడ (ప్రజా అమరావతి): శ్రీ కృష్ణ ఆర్ట్స్  బ్యానర్ ఫై డాక్టర్ రావిపాటి వీరనారాయణ సమర్పణలో, అమి రినేని వెంకట్ ప్రసాద్, సాదు చలపతి, కన్నెగంటి రవి, అనిల్ మూకిరిలు  నిర్మాతలుగా సీనియర్ జర్నలిస్ట్, వరల్డ్ రికార్డు హోల్డర్ కనిపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న  శిశిరం చిత్రం ఆడియో సిడిని ఏపీ ఎఫ్ డి సి మేనేజర్ శ్రీనివాస్ నాయక్  ఆవిష్కరించారు. విజయవాడ ఎఫ్ డీ సి కార్యాలయంలో బుధవారం  సీడీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భగా  శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో సినీ నిర్మాణాలను ఎఫ్ డి సి ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రం లో ఏ ప్రదేశం లో నైనా ఉచితంగా షూటింగ్ నిమిత్తం లోకేషన్ల కు ఉచితం గా అనుమతులు ఇస్తుందన్నారు. చిత్ర నిర్మాణం పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ లో జరిగితే పది లక్షలు సబ్సిడీ అందించి చిత్ర నిర్మాణాలను సులభతరం చేస్తుందన్నారు. సింగిల్ విండో పద్ధతిలో బ్యానర్, టైటిల్, లోకేషన్ల అనుమతులు ఇస్తుందన్నారు. ఔత్సాహిక నిర్మాతలు, దర్శకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  శిశిరం చిత్ర టీం కు అభినందనలు తెలిపారు.

 దర్శకుడు రత్నాకర్, పాటల రచయిత  సురేంద్ర రొడ్డ లు మాట్లాడుతూ శిశిరం చిత్రం లోని పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ కావడం సంతోషకరమన్నారు.  పాటలకు  సంగీత దర్శకుడుశాండీ అద్భుతమైన సంగీతం అందించారన్నారు.తూములూరు భవ్య  శ్రావ్యంగా పాటలను ఆలపించారన్నారు. ఎఫ్ డీ సి అధికారిచల్ల శ్రీనివాసులు,

సహ నిర్మాత సాదు చలపతి, శిశిరం చిత్రం  పబ్లిసిటీ పార్ట్నర్,  విక్రాంత్ పబ్లికేషన్స్  అధినేత చక్రవర్తి, అసోసియేట్ డైరెక్టర్ ఆర్. రమణ, స్టిల్స్ శేఖర్, ప్రొడక్షన్ ఇంచార్జీ ఎం. శ్రీకాంత్, డాక్టర్ విశ్వనాథ్, భాస్కర్, చెన్నుపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments