విజయవాడ (ప్రజా అమరావతి);
*ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే కఠినమైన చర్యలు
*
*విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర*
ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే కఠినమైన చర్యలు తప్పవు అన్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా 12వ డివిజన్ అయ్యప్ప నగర్ పరిసర ప్రాంతాలని పర్యటించే క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ పర్యటనలో ట్రేడ్ లైసెన్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైసెన్స్ లేకపోవడం గమనించి వారిని వెంటనే లైసెన్స్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, లైసెన్స్ ఉంటేనే వ్యాపారం చేయాలని, సారిటరీ ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రేడ్ లైసెన్సులు తనిఖీ చేయాలని అన్నారు అంతేకాకుండా పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, సైడ్ డ్రైన్ లు తరచుగా శుభ్రం చేస్తూ ఉండాలని అన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని కమిషనర్ అన్నారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, ఇంచార్జి మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment