నందిగామ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు ముందుకు వచ్చి సహకారం అందించిన దాతలకు అభినందనలు..

 నందిగామ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు ముందుకు వచ్చి సహకారం అందించిన దాతలకు అభినందనలు..



ఏపీ ప్రభుత్వ విప్, శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య.


ఎన్టీఆర్ జిల్లా/నందిగామ టౌన్ : 18 డిసెంబర్  (ప్రజా అమరావతి);


నందిగామ పట్టణం కాకాని నగర్ నందు బుధవారం నాడు ఈనెల 20,21,22 వ తేదీలలో నందిగామ ప్రభుత్వ పాలిటెక్నిక్ మహిళల కళాశాలలో ఉభయ కృష్ణ జిల్లాల నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ మహిళల ఆటల పోటీలు జరగనున్న సందర్భంగా కళాశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు కళాశాల ప్రిన్సిపల్ రమేష్ గారికి గండేపల్లి సెంట్ ని ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ మనోజ్ కుమార్ గారు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారి ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో 50 వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ క్రీడలు విద్యార్థినుల మానసిక ఉత్సాహానికి చాలా దోహదదాయకమని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో మహిళలు అన్ని రంగాలలోనూ క్రీడలలోనూ ముందుంటున్నారని తెలియజేస్తూ ఇటువంటి ప్రోత్సాహాలకు దాతల సహకారం నిజంగా అభినందనీయమని ఈ క్రీడల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు ముందుకు విచ్చేసి 50 వేల రూపాయలను అందజేసిన సేంతిని గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు కాకాని వెంకటరత్నం కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వాసిరెడ్డి నాగేశ్వరరావు,కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Comments