*ఫిల్టర్ ప్లాంట్‌ను పరీశీలించిన జిల్లా కలెక్టర్
*
గద్వాల (ప్రజా అమరావతి): జిల్లా కేంద్రంలోని నది అగ్రహారంలో ఉన్న నీటి సరఫరా స్కీమ్ క్రింద చేపట్టిన ఫిల్టర్ ప్లాంట్‌ను జిల్లా కలెక్టర్ సంతోష్ సందర్శించారు.ఈ సందర్భంగా, అందులోని అన్ని విభాగాలను కలెక్టర్ పరిశీలించారు.
అమృత్ 2.0 పథకం కింద ప్రతిపాదిత కొత్త వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్,5 MLD సామర్థ్యంతో నిర్మించబడే ప్లాంట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంబారీ టౌన్‌షిప్ పనులను పరిశీలించి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం హామీ నిధుల కింద జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.
నల్లకుంటలో నిర్మాణంలో ఉన్న మల్టీపర్పస్ ఆడిటోరియం పనులను సందర్శించి,
ఆడిటోరియం నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
addComments
Post a Comment