సృజనాత్మక ఆలోచనలున్న యువతకు మీడియా & వినోద రంగంలో గొప్ప అవకాశాలు - పీఐబీ ఏడీజీ రాజిందర్ చౌదరి
విజయవాడ ఎస్‌పీఏలో యువ సంగమ్ కార్యక్రమం
పీఐబీ ఏడీజీ & ఎస్‌పీఏవీ అధ్యాపకులతో ఉత్తరప్రదేశ్ యువ సంగమ్ ప్రతినిధుల ముఖాముఖి కార్యక్రమాలు & కెరీర్, సంస్కృతి, ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్‌పై చర్చలు
విజయవాడ, డిసెంబర్ 22 (ప్రజా అమరావతి): మీడియా & వినోద రంగంలో ఉద్యోగాల కల్పన & వ్యవస్థాపక సామర్థ్యాలకు గొప్ప అవకాశాలు ఉన్నాయని పీఐబీ ఏడీజీ రాజిందర్ చౌదరి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ సంగమ్ ప్రతినిధులతో మాట్లాడిన చౌదరి, భారత ప్రభుత్వం "వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్-2025" (వేవ్స్-2025) నిర్వహిస్తోందని, ఇది సృజనాత్మక ఆలోచనలు కలిగిన యువతకు కొత్త ద్వారాలు తెరుస్తుందని చెప్పారు. భారత ప్రభుత్వ చొరవ 'ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్' (ఈబీఎస్‌బీ) కింద, విజయవాడలోని 'స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్'లో ఏర్పాటు చేసిన యువ సంగమ్‌లో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమం, దేశంలోని వివిధ రాష్ట్రాలకు యువతకు విజ్ఞానాన్వేషణ పర్యటన వంటింది.
ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు & నిపుణులతో కూడిన యువకులు యువ సంగమ్ బృందంలో ఉన్నారు. ఈబీఎస్‌బీలో, ఉత్తర ప్రదేశ్ జత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ వరకు న్యూదిల్లీలో జరగనున్న వేవ్స్-2025 గురించి యువ సంగమ్‌లో ఆయన ఒక ప్రదర్శన ఇచ్చారు.
2.60 ట్రిలియన్ డాలర్ల విలువైన వినోద రంగం మార్కెట్‌లో ఉద్యోగాలు & వ్యవస్థాపక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వేవ్స్ కీలక అడుగుగా మారుతుందని శ్రీ చౌదరి చెప్పారు. పరిశ్రమ-ఆధారిత వేవ్స్-2025లో భాగంగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న పోటీల్లో విద్యార్థులు, యువకులు పాల్గొనాలని సూచించారు. ఈ రంగంలోని అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విజయవాడ ఎస్‌పీఏ రిజిస్ట్రార్ & డీన్ (స్టుడెంట్ అఫైర్స్) ప్రొ. డా. అయోన్ కె తరఫ్దార్ మాట్లాడుతూ, విభిన్న సంస్కృతులపై అనుభవం ద్వారా అవగాహన కల్పించడం యువ సంగమ్ లక్ష్యమని చెప్పారు.
డా. వెంకట కృష్ణ కుమార్ సాధు, డీన్ (స్టుడెంట్ అఫైర్స్) & ప్రోగ్రామ్ కోఆర్డినేటర్; ప్రొ. ఎం భాను చిత్ర, డీన్ (రీసెర్చ్), ఎస్‌పీఏ విజయవాడ; శ్రీ ఆర్ రమేష్ చంద్ర, అసిస్టెంట్ డైరెక్టర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కూడా
యువ సంగమ్‌లో పాల్గొన్నారు.
యువ సంగమ్‌లో పాల్గొన్న యువతకు కొండపల్లి చెక్క బొమ్మలు, ధృవపత్రాలను అందించారు. వీళ్లు, 7 రోజుల యువ సంగమ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. వేవ్స్-2025 ఫోటో బూత్‌లో వారికి ఇష్టమైన హాస్య, గేమింగ్ & చలనచిత్ర పాత్రలతో ఫోటోలు దిగారు.
addComments
Post a Comment