*పొలంలో ధాన్యాన్ని పరిశీలించిన పౌరసరఫరాల శాఖ మంత్రి*
పార్వతీపురం, డిసెంబర్ 7 (ప్రజా అమరావతి): పార్వతీపురం మన్యం జిల్లాలోని పొలాల్లో ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. శనివారం జిల్లాలో పర్యటించిన మంత్రి పార్వతీపురం మండలం పెద బొండపల్లి పొలాల్లో వరి ధాన్యాన్ని పరిశీలించి, గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు పరికరాలను పరిశీలించారు. రైతులతో ముఖముఖి మాట్లాడుతూ మంచి దిగుబడి, ఆదాయాన్ని పొందడానికి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, కొత్త సంస్కరణలతో ముందుకు రావాలని సూచించారు. వరి కొనుగోలుపై ప్రభుత్వ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతులకు సబ్సిడీపై టార్పాలిన్లు అందించామన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలుసని, ఆర్థికంగా భారం ఉన్నప్పటికీ తనవంతు కృషి చేస్తోందన్నారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రికి మంచి అవగాహన ఉందని అన్నారు. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునేలా నదుల అనుసంధానంపై ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. భవిష్యత్తులో అనేక పనులు చేయనున్న ప్రభుత్వంపై రైతులు నమ్మకం ఉంచాలని కోరారు.
మంత్రి అడిగిన ప్రశ్నలకు రైతులు సమాధానమిస్తూ వరి కొనుగోలు విధానంపై హర్షం వ్యక్తం చేస్తూ 24 గంటల్లో డబ్బులు అందుతున్నాయన్నారు. గత సంవత్సరం వరకు, మేము డబ్బుల కోసం సంవత్సరం వరకు వేచి ఉండేవారమని చెప్పారు. తమ భూములకు శాశ్వత ఆధారమైన జంఝావతి ప్రాజెక్టును పూర్తి చేయాలని రైతులు మంత్రిని కోరారు.
పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర, జాయింట్ కలెక్టర్ శ్రీమతి ఎస్ఎస్ శోబిక, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్ట్ పాల్, అధికారులు, అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment