ఆ నౌకలోనివి పిడిఎస్ బియ్యమే.

 ___ ఆ నౌకలోనివి పిడిఎస్ బియ్యమే


___ తనిఖీలకు ఐదు కమిటీలు ఏర్పాటు

___ నౌక పోర్ట్ ఆధీనంలోనే ఉన్నది

___ కలెక్టర్ షాన్ మోహన్ 

కాకినాడ, డిసెంబర్ 3 (ప్రజా అమరావతి): కాకినాడ పోర్టులోని సముద్రంలో ఉన్న స్టెల్లా ఎల్ నౌకలో ఎగుమతి అవుతున్న బియ్యం పిడిఎస్ నకు చెందినవని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి నిర్ధారించారు. గత నెల 27వ తేదీన కాకినాడ యాంకరేజి పోర్టులో తనిఖీ చేసిన స్టెల్లా ఎల్ నౌకలో పిడిఎస్ బియ్యం గుర్తించిన నేపద్యంలో నౌకలో ఎగుమతి చేసిన మొత్తం బియ్యాన్ని సమగ్రంగా తనిఖీ చేసేందుకు ఐదు ప్రభుత్వ శాఖల అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేసామని జిల్లా కలక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కలెక్టరేట్లోని తన ఛాంబరులో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పిడిఎస్ బియ్యం అక్రమ తరలింపు, రీసైక్లింగ్ నిరోధానికి చేపట్టిన కార్యాచరణలను వివరించారు. 

  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత నెల 27న తాను కాకినాడ ఆర్డిఓతో కలిసి కాకినాడ యాంకరేజి పోర్టులో స్టెల్లా ఎల్ నౌకలో జరిపిన తనిఖీలో పిడిఎస్ బియ్యాన్ని గుర్తించామన్నారు. ఈ బియ్యం గతంలో సీజ్ చేసి బ్యాంకు గ్యారంటీపై రిలీజ్ చేసిన బియ్యమా లేక పిడిఎస్ నుండి తరలించిన బియ్యమా నిర్ధారణకు వెరిఫికేషన్ చేపట్టామని తెలిపారు. ఈ వెరిఫికేషన్ నిమిత్తం రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, పౌరసరఫరాలు, పోర్టు అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేసామన్నారు. ఈ కమిటీ  స్టెల్లా ఎల్ నౌకలో ఉన్న మొత్తం బియ్యాన్ని తనిఖీ చేసి, నమూనాలు, సంబంధిత డాక్యుమెంట్లను తీసుకుని విశ్లేషించి నివేదిక సమర్పిస్తుందని తెలిపారు.  షిప్పులోనికి బియ్యం ఏ ఎగుమతిదారు నుండి షిప్పులోకి వెళ్లింది, అతనికి ఏ మిల్లులు బియ్యం సప్లయి చేసాయి ఎగుమతిదారుడు, మిల్లులకు సంబంధించిన బిల్లులు, ఎగుమతిదారు నిల్వలు ఉంచిన గౌడౌన్ నుంచి షిప్పు వరకూ జరిపిన రవాణాకు సంబంధించిన ట్రక్ షీట్లు తనిఖీ కూలంకుషంగా చేస్తుందన్నారు. ఈ తనిఖీ ద్వారా షిప్పులో ఉన్నది పిడిఎస్ బియ్యామా పిడిఎస్ బియ్యమైతే బ్యాంకు గ్యారంటీ ఇచ్చినదా అనే అంశాలను నిర్థారించడం జరుగుతుందన్నారు. ఒక వేళ బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన బియ్యం అయితే ఎగుమతి చేయవచ్చా అనే అంశంపై న్యాయ సలహాలు తీసుకుంటుంన్నామన్నారు. ప్రస్తుతం స్టెల్లా ఎల్ నౌక పోర్ట్ కంట్రోల్లోనే ఉందని, కమిటీ నివేదిక ఆధారంగా ఈ అంశంలో తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు  కలెక్టర్ తెలిపారు. 

  డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలకు అనుగుణంగా ఇందులో భాగంగా  రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లయిస్, పోర్ట్, కస్టమ్ అధికారులకు బియ్యాన్ని ఏలా తనిఖీ చేయాలి, శాంపిల్ ఎలా తీయాలి, దానిని ఎలా పరీక్షించాలి, అక్రమాలు గుర్తిస్తే ఏవిధంగా కేసు నమోదు చేయాలనే అంశాలపై ప్రత్యేక అవగాహన, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక టీములు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రేపటి నుండి బియ్యం అక్రమ తరలింపు గురించి సమాచారం అందినపుడు ఈ టీములు తక్షణం స్పందించి తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. రేషన్ బియ్యం అక్రమాలను అరికట్టేందుకు చెక్ పోస్ట్ లను మరింత బలోపేతం చేస్తున్నామని, 24 గంటలు తనిఖీలు నిర్వహించేలా మూడు షిప్ట్లలో శిక్షణ కల్పించిన టీములను నియమిస్తున్నామని తెలియజేశారు. పోర్టుకు వచ్చే ప్రతి వాహనాన్ని ఈ టీములు తనిఖీ చేసి, పిడిఎస్ రైస్ తరలిస్తున్నట్లు గుర్తిస్తే వాహనాలను, లోడ్ను సీజ్ చేసి, వాహనం ఏ గొడౌన్ నుండి వచ్చిందో గుర్తించి, ఆ గొడౌన్లో ఇంకా అటువంటి బియ్యం ఉంటే దానికి కూడా సీజ్ చేస్తాయన్నారు. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకూ బయటి జిల్లాల నుండి కాకినాడ పోర్టుకు వచ్చే బియ్యాన్ని ఆయా జిల్లాల్లోనే తనిఖీ చేసేందుకు ప్రమాణిక విధివిధానాలను రాష్ట్ర స్థాయిలో రూపొందించి అమలు చేయనున్నారని తెలిపారు. బియ్యం అక్రమ రవాణా, తనిఖీల నిర్వహణకు సంబందించి తమ దృష్టికి వచ్చిన సమాచారాన్ని తెలియజేయాలని అందరి సహకారంతో రేషన్ బియ్యం అక్రమాల జాడ్యాన్ని సమర్థవంతంగా అరికడతామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు.

Comments