శిశిరం చిత్రం అతి త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల
తెనాలి (ప్రజా అమరావతి);
శ్రీ కృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై
అమిరినేని ప్రసాద్, సాదు చలపతి, కన్నెగంటి రవి, మూకిరి అనిల్ లు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తు, డాక్టర్ రావిపాటి వీరనారాయణ చిత్ర సమర్పకులుగా, వరల్డ్ రికార్డు హోల్డర్, సీనియర్ జర్నలిస్టు కనపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న శిశిరం చిత్రం లోని పాటలు భారత దేశం లోనే ప్రముఖ ఆడియో డిస్టిబ్యూటర్స్ అయిన ఆదిత్య మ్యూజిక్ ద్వారా అతి త్వరలో విడుదల కానున్నాయని దర్శకుడు రత్నాకర్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రం లో చైల్డ్ సూపర్ స్టార్ మాస్టర్ భాను, మాస్టర్ పుష్కర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో ప్రముఖ నిర్మాత, సినివేదిక అధ్యక్షుడు విజయ్ వర్మ,
బి. వెంకట్, వసంత యామిని, అయినాల మల్లేశ్వరరావు, కనపర్తి మధుకర్, అజయ్ ఇండియన్, గోము, మాస్టర్ రిత్విక్ సూరజ్, దిలీప్ సాయి, ప్రదీప్ సాయి, ఎం. జాశ్విక్ జ్ఞానానంద్ కృష్ణ, బి.అభిషేక్, చిరంజీవి ప్రీహాన్స్, చిరంజీవి స్రుణి సాయి తదితరులు నటిస్తున్నారన్నారు. చిత్రం లోని పాటలకు శాండీ అద్దంకి సంగీత దర్శకత్వం, సాహిత్యం సురేంద్ర రొడ్డ, గానం టి. భవ్య. డి.ఓ. పి మురళీ, ప్రొడక్షన్ ఇంచార్జీ ఎం. శ్రీకాంత్, సహ దర్శకునిగా రమణ, స్టిల్ ఫోటోగ్రఫీ డి. మధు, ఎస్.ఎస్. వి శేఖర్ లు పనిచేస్తున్నారు.
శిశిరం చిత్రం లోని పాటలను ప్రేక్షకులు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విని చిత్ర విజయానికి సహకరించాలని దర్శకుడు రత్నాకర్ కోరారు. చిత్ర ఆడియో పోస్టర్ ను ఈ నెల 18 వ తేదీన విజయవాడలోని ఎపి స్టేట్ టివి, స్టేజ్ అండ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ నాయక్ ఆవిష్కరించనున్నారని దర్శకుడు తెలిపారు.
addComments
Post a Comment