పార్ట్ టైమ్ న్యూస్ కరస్పాండెట్లు (Part Time Correspondent) గా పనిచేసేందుకు ఆస‌క్తి గల‌ స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు.


అమరావతి (ప్రజా అమరావతి);

 ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ప్రాంతీయ వార్తా విభాగానికి అమరావతి రాజధాని ప్రాంతం, శ్రీసత్యసాయి జిల్లాలో పార్ట్ టైమ్ న్యూస్ కరస్పాండెట్లు (Part Time Correspondent) గా పనిచేసేందుకు ఆస‌క్తి గల‌ స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి  శ్రీసాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. పార్ట్ టైమ్ కరస్పాండెంట్ అనేది కేవ‌లం పార్ట్ టైమ్ అసైన్‌మెంట్ మాత్ర‌మే అని, శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాద‌ని, పీఎఫ్, ఆరోగ్య ప‌థ‌కం, క్వార్ట‌ర్స్, పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉండవని స్ప‌ష్టం చేశారు.

 

జ‌ర్న‌లిజంలో డిగ్రీ లేదా పీజీ డిప్ల‌మా క‌లిగి రెండు సంవ‌త్స‌రాల పాత్రికేయ అనుభ‌వం ఉన్న 24 నుండి 50 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. అభ్య‌ర్థులు జిల్లా కేంద్రానికి 10 కిలోమీట‌ర్ల ప‌రిధిలో నివాసం ఉండాల‌ని, వారికి ఆకాశ‌వాణి నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా నెల‌వారీ జీతం చెల్లింపులు ఉంటాయ‌ని తెలిపారు. 


ఆస‌క్తి, అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు త‌మ‌ ద‌ర‌ఖాస్తుల‌ను 08.11.2024 లోగా “The Head of Office, Akashvani, Punnamathotha, M.G. Road, Vijayawada – 520010” చిరునామాకు పంపించాల‌ని కోరారు.  దరఖాస్తు కవరు పై భాగంలో “Application for RNU” అని తప్పనిసరిగా రాయాలని, మరిన్ని వివ‌రాల కోసం 9440674057 నెంబ‌ర్ ను సంప్రదించాల‌ని సూచించారు.

Comments