విజయవాడ (ప్రజా అమరావతి);
ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ ఎడిటర్ (Casual News Editor), క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేటర్ (Casual Newsreader cum Translator) గా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీసాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. క్యాజువల్ నియామకాలు శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావని, పీఎఫ్, ఆరోగ్య పథకం, క్వార్టర్స్, పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉండవని స్పష్టం చేశారు.
క్యాజువల్ న్యూస్ ఎడిటర్ (తెలుగు) నియామకానికి అభ్యర్థులకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత, జర్నలిజంలో డిగ్రీ/ పీజీ డిప్లొమా/పీజీ లేదా రిపోర్టింగ్/ఎడిటింగ్ లో 5 సంవత్సవరాల అనుభవం ఉండాలని స్పష్టం చేశారు. అలాగే తెలుగు, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యత, కంప్యూటర్ పై అవగాహన, ఆంగ్లం నుంచి తెలుగుకి అనువాదం చేయగల నైపుణ్యం, తెలుగులో టైపింగ్ నైపుణ్యం కలిగి వుండాలని తెలిపారు.
క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేటర్ (తెలుగు) నియామకానికి అభ్యర్థులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు, తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం, ఆంగ్లం నుంచి తెలుగులో తర్జుమా చేయగల నైపుణ్యం, మంచి స్వరం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అలాగే రేడియో, టీవీ జర్నలిజంలో అనుభవం ఉండాలని, తెలుగు టైపింగ్ తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు.
21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి, విజయవాడ ప్రాంతంలో నివసించే వారు అర్హులని అన్నారు. క్యాజువల్ విధానంలో నియమింపబడిన వారికి అసైన్ మెంట్ ప్రాతిపదికన విధుల కేటాయింపు ఉంటుందని, వారికి వార్తా విభాగం అవసరాలకు అనుగుణంగా నెలలో 1 నుంచి 6 వరకూ అసైన్‌మెంట్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.
ఆసక్తి, అర్హత కలిగిన జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు Rs. 354/-, ఎస్.సి, ఎస్.టి, బి.సి క్యాటగిరీ అభ్యర్థులు Rs.266/- దరఖాస్తు రుసుమును “Prasar Bharati, Akashvani, Vijayawada” పేరుతో బ్యాంక్ డ్రాఫ్ట్ ను జత చేసి 08.11.2024 లోగా “The Head of Office, Akashvani, Punnamathotha, M.G. Road, Vijayawada – 520010” చిరునామాకు పంపించాలని కోరారు. దరఖాస్తు కవరు పై భాగంలో “Application for RNU” అని తప్పనిసరిగా రాయాలని, వివరాల కోసం 9440674057 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.
addComments
Post a Comment