శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం


, విజయవాడ (ప్రజా అమరావతి):


  ఈరోజు కోకా పేట, హైదరాబాద్ కు చెందిన తుమ్మల శ్రీనివాస్ సంపత్  శ్రీ అమ్మవారి దేవస్థానం నందు జరుగు అన్నదానం నిమిత్తం తుమ్మల శ్రీనివాస్ సంపత్, శ్రీ దుర్గ గార్ల పేరున అన్నదానం జరుపుటకు గాను ఆలయ ఈవో కె ఎస్ రామరావు ని కలిసి రూ. 5,00,000/- లను చెక్కు రూపములో విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎమ్. రత్న రాజు ,  దేవాదాయ శాఖ మంత్రివర్యుల P.S వివేక్  ఉన్నారు.  


  అనంతరం వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులచే  వేదార్వచనం కల్పించగా ఈవో  అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.

Comments