*రేవతి ఎన్ క్లేవ్ బహుళ అంతస్తుల భవనానికి భూమి పూజ*
*భూమి పూజ లో పాల్గొన్న టిడిపి నాయకులు*
తాడేపల్లి (ప్రజా అమరావతి);
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, ఇప్పటం గ్రామంలో బుధవారం రేవతి ఎ న్ క్లేవ్ బహుళ అంతస్తుల భవనానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. అందరికీ అందుబాటులో ధరలలో రేవతి ఎన్ క్లేవ్ అపార్ట్మెంట్లు ఏపీ సి ఆర్ డి అప్రూవ్డ్ ప్లాన్ తో ఆధునిక, వసతులు సౌకర్యాలతో ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నామని ఎన్ క్లేవ్ అధినేత , టిడిపి తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా రేవతి ఎన్ క్లేవ్ బ్రోచర్ ను టిడిపి నాయకులు ఆవిష్కరించారు.
భూమి పూజ కార్యక్రమం లో స్థానిక టిడిపి నాయకులు, పద్మశాలి కార్పోరేషన్ అభివృద్ధి కమిటీ చైర్మన్ నందం అబద్దయ్య, టిడిపి గుంటూరు పార్లమెంట్ నియోజక వర్గ ఇన్చార్జి పోతినేని శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు కమిటీ సభ్యులు తమ్మిశెట్టి జానకి దేవి, టిడిపి రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి జవ్వాది కిరణ్ చంద్, టిడిపి నాయకులు ఆవుల రవికిరణ్, మాదాల రమేష్ బాబు, తోట సాంబయ్య, భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని బహుళ అంతస్తుల భవన నిర్మాణం అభివృద్ధి చెందాలని పడవల మహేష్ కు అభినందనలు తెలియజేశారు.
addComments
Post a Comment