*ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
గుంటూరు : నవంబర్ 17 (ప్రజా అమరావతి);
జర్నలిస్టుల అభివృద్ధి అభ్యున్నతి సంక్షేమమే ధ్యేయంగా జర్నలిస్టుల సమస్యల పై ప్రతినిత్యం పోరాడుతూ సమస్యల పరిష్కారంతోపాటు జర్నలిస్టుల అభివృద్ధికి కృషి చేస్తూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన జర్నలిస్ట్ సంఘం ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవం ఆదివారం స్థానిక గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జి ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరు ఐక్యతతో ముందుకు సాగాలని జర్నలిస్టుల యొక్క న్యాయపరమైన అంశాలను ప్రభుత్వం పరిష్కరించే విధంగా పోరాటం ద్వారా తమ యొక్క హక్కులను కాపాడుకోవచ్చునని దానికోసం ప్రతి ఒక్కరు ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. నేటి ఆధునిక సమాజంలో జర్నలిజం యొక్క విలువలు తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సంఘటితంగా జర్నలిజం విలువలను కాపాడుకునేందుకు జర్నలిస్టుల యొక్క రక్షణ వారి సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేసేందుకు ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా జర్నలిస్టుల యొక్క అభివృద్ధి అభ్యున్నతి కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిత్యం పనిచేస్తూ ఉంటుందని అన్నారు. ఫెడరేషన్ గుంటూరు జిల్లా నూతన అధ్యక్షులుగా కనపర్తి రత్నాకర్, గుంటూరు జిల్లా గౌరవాధ్యక్షులుగా అజయ్ ఇండియన్, గుంటూరు జిల్లా గౌరవాధ్యక్షులుగా ఎం. శ్రీకాంత్, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులుగా వేముల రాజేష్, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పట్నాల సాయి కుమార్, గుంటూరు జిల్లా కోశాధికారి కొండవీటి పుల్లారావు, గుంటూరు జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శిగా వరదల మహేష్, గుంటూరు జిల్లా కార్యదర్శలుగా పుట్ల పున్నయ్య, చింతా మణికుమార్,, అంబటి శ్యామ్ సాగర్,అచ్యుత సాంబశివరావు, గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా బుర్రా సుధీర్, ఎన్.జె శామ్యూల్, డి. కోటేశ్వరరావు, యు. కోటేశ్వరరావు లకు అభినందనలు తెలిపారు.
బాధ్యతలు స్వీకరించిన నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ
రానున్న రోజుల్లో జర్నలిస్టుల అభివృద్ధి అభ్యున్నతి లక్ష్యంగా ఐక్యతతో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పని చేస్తుందని తెలియజేశారు కార్యక్రమంలో జిల్లాలోని వివిధఫెడరేషన్
రాష్ట ఉపాధ్యక్షులు బి.ఎస్.ప్రసాద్ రావు, విశ్రాంత ఎపి ఆర్వో యు. షణ్ముఖేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టు ఎస్.ఎస్. జహీర్,
గుంటూరు జిల్లా ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment