*దేశాన్ని పాలించే నాయకులను అందించిన గడ్డ కరీంనగర్ జిల్లా: సీఎం రేవంత్ రెడ్డి
*
రాజన్న జిల్లా: నవంబర్ 20 (ప్రజా అమరావతి);
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి పర్యటించారు. దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
తొలుత హెలికాప్టర్లో వేములవాడకు చేరుకున్న సీఎం రేవంత్, వేములవాడ లో రాజన్నను దర్శించు కున్నారు. అనంతరం ఆలయాభివృద్ది పనులు, రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని వర్చు వల్‌గా ప్రారంభించారు.
రూ. 235 కోట్లతో 4 వేల 696 మిడ్ మానేరు రిజర్వా యర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల పనులకు భూమిపూజ చేశారు. రూ. 35 కోట్లతో చేపట్టే అన్నదాన సత్రం, రూ. 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ భవనం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు.
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా గల్ఫ్ దేశాల్లో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగా సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ...
ఆనాడు తలపెట్టిన పాదయాత్ర సందర్భంగా వేములవాడ ప్రజలకు మాటిచ్చాను కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతానని, అందుకే ఈరోజు మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం...
ఆనాడు కెసిఆర్ అమరవీరుల కుటుంబాలను, మహిళను, నిరుద్యోగులనే కాకుండా వేములవాడ రాజన్నను కూడా మోసం చేశాడు అన్నారు. పది సంవత్స రాలు పరిపాలించిన కేసీఆర్ వేములవాడలో ఏమి అభివృద్ధి చేశాడని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ జిల్లా అనే నెంబర్ వన్ కరీంనగర్ జిల్లా ప్రజలు దేశాన్ని పరిపాలించే నాయకులను తయారు చేసింది, అన్నారు.
మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు ఏరోజు నా దగ్గరికి స్వార్థం కోసం రాలేదు రాజన్న జిల్లా అభివృద్ధి కోసం నిధులు అడిగాడు జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరాడు. అంతేగాని ఏ మంత్రి పదవి అడగలేదని ఆది శ్రీనివాసును కొనియాడారు..
గల్ఫ్ లో మరణించిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లిస్తుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి,తెలియజేశారు..
addComments
Post a Comment