*జర్నలిస్ట్ ల అభివృద్ధి అభ్యున్నతికి కృషి:* గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెని క్రిస్టిన
గుంటూరు (ప్రజా అమరావతి): నవంబర్ 19 జర్నలిస్టుల అభివృద్ధి అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెని క్రిస్టిన తెలిపారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయo ఆమెను మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జర్నలిస్టుల అభివృద్ధి అభ్యున్నతి సంక్షేమమే ధ్యేయంగా జర్నలిస్టుల సమస్యల పై ప్రతినిత్యం పోరాడుతూ సమస్యల పరిష్కారంతోపాటు జర్నలిస్టుల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన జర్నలిస్ట్ సంఘం ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అని ఉమ్మడి చైర్ పర్సన్ అన్నారు. అదేవిధంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ గుంటూరు జిల్లా నూతన కమిటీకి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేశారు. జర్నలిస్టుల యొక్క అభివృద్ధి అభ్యున్నతికి కృషి చేస్తానని అదేవిధంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ గుంటూరు జిల్లా కమిటీ సభ్యులుపలు సమస్యలను క్రిస్టినా దృష్టికి తీసుకువెళ్లారు వీటిపై ఆమె సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఆదివారం ఏపీడబ్ల్యూజేఎఫ్ గుంటూరు జిల్లా నూతన కమిటీ ప్రమాణస్వీకారానికి జిల్లా పరిషత్ కార్యాలయం కేటాయించిన సందర్భంగా జిల్లా కమిటీ ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కనపర్తి రత్నాకర్, జిల్లా ఉపాధ్యక్షులుగా వేముల రాజేష్, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పట్నాల సాయి కుమార్, గుంటూరు జిల్లా కోశాధికారి కొండవీటి పుల్లారావు, గుంటూరు జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శిగా వరదల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment