విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు లాంటి వ్యక్తిని మోసం చేసిన చంద్రబాబుకి పేద ప్రజలను మోసం చేయటం ఎంత..
తాడేపల్లి (ప్రజా అమరావతి);
తాడేపల్లి పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం ఆదివారం ఉదయం మంగళగిరి లోని బైపాస్ రోడ్ నందు గల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్ర ముక్కు వేణుగోపాల్ స్వామి రెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించటం జరిగింది. *ఈ సమావేశంలో సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి (DVR), మాజీ తాడేపల్లి మండలం గౌరవ అధ్యక్షులు పాటిబండ్ల కృష్ణమూర్తి పాల్గొన్నారు.* ఈసమావేశంలో తాడేపల్లి పట్టణంలోని 23 వార్డుల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. *ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి నియోజకవర్గం సమన్వయకర్త దొంత రెడ్డి వేమారెడ్డి(DVR) మాట్లాడుతూ* భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు నుండి తాడేపల్లి లో కాంగ్రెస్ పార్టీ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తప్ప మరో జెండా ఎగరలేదు. అలాంటి తాడేపల్లిలో ఈరోజు మరో జెండా ఎగరటం కారణం కార్యకర్తలకి నాయకులు సమన్వయం లేకపోవడం వల్లనే ఇలా జరిగి ఉండొచ్చు. ఎవరు అధైర్యపడవద్దు .అందర్నీ కూడగట్టుకుని ముందుకు వెళ్దాం తాడేపల్లిలో మళ్లీ పాత రోజులు రావాలి మనం చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాం .కష్టపడి పని చేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది. చంద్రబాబు మాటలు విని ప్రజలందరూ మోసపోయారు చంద్రబాబు చెప్పిన మాటలతో మహిళలందరూ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారు. ఇప్పుడు ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు రాకపోవడంతో అందరూ నిరుత్సాహంలో ఉన్నారు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పి హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో అక్షరాత్ర శాతం ఎక్కువగా ఉంటే చంద్రబాబు చెప్పే మాటలకు మోసపోకుండా ఉంటారు పేదవాళ్లు నాకు అక్కర్లేదు ధనవంతులే నాకు కావాలని ఆలోచనతో ప్రభుత్వం నడుపుతున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కావాలని ఆలోచిస్తున్నారు కాని రైతులు, పేదలు గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ, చదువుకోలేని వారి కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఎంతో న్యాయం చేశారు. ఆయన బాటలోనే జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం నవరత్న పథకాలు ప్రవేశపెట్టి పేదవాళ్ల వారి కోసం నేనున్నాను అంటూ నిలిచాడు కానీ చంద్రబాబు చెప్పిన మాయమాటలకు పేద ప్రజలు మోసపోయి ఈరోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గొంతు ఎత్తి ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం గురించి ఎవరు మాట్లాడిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలందరూ ఆలోచించి సరైన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలి అని అన్నారు . *తాడేపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి సమావేశం ఉద్దేశించి మాట్లాడుతూ.* తాడేపల్లి పట్టణంలో ఇంతకన్నా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. చంద్రబాబు బుద్ధి చెప్పటం ఖాయం కూటమి ప్రభుత్వం గురించి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ సోషల్ మీడియా పై మరింత దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఎక్కడా లేని విధంగా మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలని వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే . ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత వారి గురించి పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గెలిచిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా ప్రజల గురించి ఆలోచించాలి కానీ ఇలా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో, మాజీ కౌన్సిలర్స్ , నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
addComments
Post a Comment