వైద్యరంగంలో వస్తున్న ఆధునిక చికిత్స విధానాలను ఎప్పటికప్పుడు వైద్యులు తెలుసుకోవాలి.

 "వైద్యరంగంలో వస్తున్న ఆధునిక చికిత్స విధానాలను ఎప్పటికప్పుడు వైద్యులు తెలుసుకోవాలి


"


డాక్టర్ ఎన్.వి. సుందరాచారి, ప్రిన్సిపల్, గుంటూరు వైద్య కళాశాల .

గుంటూరు (ప్రజా అమరావతి);

నేడు వైద్యరంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని ,ఆధునిక వ్యాధి నిర్ధారణ ,చికిత్స విధానాలను ఎప్పటికప్పుడు వైద్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి సుందరాచారి అన్నారు. శుక్రవారం ఉదయం గుంటూరు వైద్య కళాశాలలోని జింఖానా ఆడియోటోరియంలో ఐఎంఏ 66వ వార్షిక సదస్సు ప్రారంభోత్సవ సభలో డాక్టర్ ఎన్.వి సుందర చారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు .సభకు సదస్సు సైంటిఫిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ సిహెచ్ విశ్వేశ్వరరావు సారధ్య వహించారు .డాక్టర్ సుందరాచారి , జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించి ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఐఎంఏ గుంటూరు శాఖ 66వ వార్షికోత్సవ సదస్సు గుంటూరు ఐఎంఏనిర్వహించటం అభినందనీయం అన్నారు. వైద్యరంగంలో ఇప్పుడు పరిశోధనా అవకాశాలు బాగా పెరిగాయని ,యువ వైద్యులు వ్యాధుల నిర్ధారణ ,చికిత్స విధానాల పరిశోధనలలోభాగస్వాములు కావాలన్నారు .సమావేశంలో పాల్గొన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రమణ ఎస్ ఎస్ వి ప్రసంగిస్తూ వైద్యు లందరూ నేడు సీఎంఈ కార్యక్రమాలు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. అప్పుడే వైద్య రంగంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతారన్నారు. ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తించి ,చికిత్స చేయడం ద్వారా హాస్పటల్ అడ్మిషన్లను నిరోధించాలన్నారు .సభలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పర్యవేక్షకులు డాక్టర్ ఎం వర్నికుమార్ మాట్లాడుతూ వైద్యులకు సంవత్సరంలో 6 చొప్పున 5 సంవత్సరాలకు 30 క్రెడిట్ అవర్స్ లేనిదే రిజిస్ట్రేషన్ రెన్యువల్ జరగదు అన్నారు. వైద్యులందరూ సీఎం ఈ కార్యక్రమాలకు తప్పక హాజరు కాలని కోరారు. సదస్సులకు, సీఎం ఈ కార్యక్రమాలకు హాజరైనప్పుడే రోగులకు సరైన చికిత్స అందించగలుగుతా రన్నారు.ప్రారంభోత్సవ సభలో ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పి ఫణిదర్ , ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ జి నందకిషోర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ టి. సేవకుమార్ ,గుంటూరు ఐఎంఏ బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ వై సుబ్బారాయుడు కార్యదర్శి డాక్టర్ బి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.



Comments