సమాజం కోసం వార్తలు అందించిన ఉత్తమ సీనియర్ జర్నలిస్టులకు ఘన సన్మానం.
గుంటూరు,నవంబర్ 16 (ప్రజా అమరావతి);
సుదీర్ఘమైన పాత్రికేయవృత్తిలో ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించి పాత్రికేయ వృత్తికి న్యాయం చేకూర్చిన సీనియర్ జర్నలిస్టులను నవంబర్ 16 శనివారం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు ఎస్ హెచ ఓ హాల్ నందు ఘన సన్మానం నిర్వహించారు కార్యక్రమానికి గుంటూరు జిల్లా జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వాసి మల్ల రాజేష్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఫలాన్ని ఆశించకుండా సమాజ సేవకు అంకితమై సమాజంలోని మంచి చెడులను ప్రజలకు వివరిస్తూ నిత్యం వారిని చైతన్య పరుస్తూ పాత్రికేయ వృత్తిలో సీనియర్లైన పాత్రికేయులను తెలుగుజర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానించుకోవటం అభినందనీయమని పేర్కొన్నారు జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధికోసం ఏర్పాటు చేసిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తొలి కార్యక్రమంగా నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకొని సీనియర్ పాత్రికేయ మిత్రులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు బోడపాటి సుబ్బారావు మాట్లాడుతూ భవిష్యత్తులో జర్నలిస్టులకు వారి కుటుంబాలకు అండగా భరోసా ఇవ్వడం కోసం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కృషి చేస్తుందని పేర్కొన్నారు త్వరలో గుంటూరు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుందని ఆ కార్యక్రమానికి పలువురు పెద్దలు హాజరవుతారని తెలిపారు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కార్యదర్శి షేక్ లాల్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు రంగనాయకులు మాపై నమ్మకంతో పెట్టిన గురుతర బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామని అవినీతి లేని సమాజానికి అక్షర రూపంలో పోరాడుతూ కాలంతో నిత్యం పరిగెడుతూ తమ భావాలను పలువురికి పంచుతూ చాలీచాలని వేతన జీతాలతో
వేల గుండెల్లో వెలుగుల స్థానం కల్పించి
రాత్రింబవళ్లు రెండు కళ్ళతో పరీక్షిస్తూ
మూడో కంటితో వాస్తవాన్ని చూపించే జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని అన్నారు అనంతరం పాత్రికేయ వృత్తిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సీనియర్ పాత్రికేయులు వీరభద్రం కుమార్ రాజా సుభాని నాగేశ్వరరావు సాయికుమార్ లను తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వాసి మల్ల రాజేష్ కార్యదర్శి షేక్ లాల్ అహ్మద్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబశివరావు ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు కార్యవర్గ సభ్యులు భాస్కర్ లు ఘన సన్మానం నిర్వహించారు సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు ఉంటాయని సంఘం అభివృద్ధి కోసం తన వంతు పాత్ర నిర్వహిస్తామని హామీ ఇచ్చారు అనంతరం నూతనంగా ఏర్పడిన తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం కమిటీని ప్రముఖ పారిశ్రామికవేత్త హరి వెంకట సతీష్ కుమార్ ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో రాజేష్, ఖలీల్, ప్రకాష్, కాలేశా, మహేష్, శంకర్ పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.
addComments
Post a Comment