*గత ప్రభుత్వ అప్పులు, తప్పులే రాష్ట్రానికి శాపం
*
*అడ్డగోలు దోపిడీ కోసం వ్యవస్థలను సర్వనాశనం చేశారు*
*స్కాముల కోసమే స్కీములు అమలు చేశారు*
*ఇప్పటికి తేలింది రూ.9,74,556 కోట్ల అప్పులు...తవ్వితే ఇంకెంత ఉంటాయో?*
*1995 నాటి ప్రభుత్వంలో కూడా ఇంతటి దారుణ పరిస్థితులు లేవు*
*సమస్యలు అధిగమించి ఒక్కో ఇటుకా పేర్చుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం*
*రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని చెప్పడం లేదు*
*రాష్ట్ర ఆదాయం పెంచేందుకు గత ఐదేళ్లలో ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు*
*అసమర్ధపాలనలో ప్రజల తలసరి ఆదాయం తగ్గింది...తలసరి ఖర్చు పెరిగింది*
*2018-19 నాటికి 13.5 శాతం ఉన్న గ్రోత్ రేట్ 2023-24 నాటికి 10.6 శాతానికి తగ్గింది*
*వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం సహకారంతో వెలికితీశాం*
*సూపర్-6 హామీలతో పాటు అదనంగా మరిన్ని పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తాం*
*కన్నతల్లిపై అసభ్యకర పోస్టింగులు పెట్టించే వాళ్లు మనుషులా...పశువులా..?*
*తల్లి వ్యక్తిత్వాన్నే హననం చేయించినవారు నాయకులా?*
*సోషల్ మీడియా సైకోల కట్టడికి ప్రత్యేక చట్టం*
*-శాసన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు*
*గత ప్రభుత్వ అప్పులు, విధ్వంసంపై అసెంబ్లీలో సీఎం సుధీర్ఘ ప్రసంగం*
అమరావతి (ప్రజా అమరావతి):- ‘గత ప్రభుత్వ తప్పులు, అప్పులు, పాపాలు, నేరాలే రాష్ట్రానికి శాపంగా మారాయి. అసమర్థ పాలన, అభివృద్ధి నిరోధక నిర్ణయాలు, ప్రజా సపంద దోపిడీ, పన్నుల బాదుడు, స్కాముల కోసమే స్కీములు పెట్టి చరిత్రలో లేని విధంగా రాష్ట్రాన్ని దోచేశారు. ప్రజల ఆశలు నెరవేర్చాలంటే మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంది. రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని అనుకోవడం లేదు. ఒక్కో ఇటుకా పేర్చుతూ ముందుకెళ్తున్నాం. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్ర సహకారంతో వెలికితీశాం.’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర అప్పులు, గత ప్రభుత్వ తప్పులు, నేరాలు, విధ్వంసంపై సభలో సీఎం వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...
*ప్రజల నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెడదాం*
‘ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే..వారి కోసం పని చేయాల్సిన బాధ్యత పాలకులుగా మాపై ఉంది. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు పెను విప్లవంలా ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. ప్రజలు గెలిస్తే రాష్ట్రం నిలదొక్కుకుంటుంది...ప్రజలు గెలవాలంటే ఎన్డీయేను గెలిపించాలని ఎన్నికల ముందు ప్రజల్ని కోరాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని పిలుపునిస్తే ముందుకొచ్చి ఓట్లేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందు నుండీ చెప్పారు. బీజేపీ కూడా వచ్చి కలవడంతో మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల 93 శాతం స్ట్రైక్ రేట్ తో సీట్లు సాధించాం. ఇది ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకానికి తార్కాణం. నూటికి నూరు శాతం ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం. 1995లో సీఎం అవ్వకముందు యేడాది పాటు ఆర్థిక శాఖా మంత్రిగా చేశాను. ఆనాడు కూడా ఇప్పుడున్న పరిస్థితులు లేవు. నాడు కూడా ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయి. సవాల్ గా తీసుకుని పాలన కొత్తపుంతలు తొక్కించాం. 1995 నాటి పాలన ఒక మోడల్. కష్టాల నుండి బయటకు తీసుకురావడమే కాకుండా రాష్ట్రానికి గట్టి పునాది వేసి ముందుకెళ్లాం. 2014లో విభజన జరిగిన తీరు మనమంతా చూశాం. రాష్ట్రానికి ఆదాయం లేదు, కనీసం పెన్షన్లు...జీతాలు వస్తాయా అని భయపడిన రోజులు ఉన్నాయి. 2014లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. ప్రజల సహకరాంతో, అనుభవంతో సమర్ధవంతంగా పని చేశాం. 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉంటే అధికమించి మిగులు విద్యుత్ సాధించాం. ఐదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. విభజనతో రాజధాని లేని పరిస్థితి ఏర్పడింది. 33 వేల ఎకరాలను 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. 72 శాతం మేర పోలవరాన్ని పూర్తి చేశాం...టీడీపీ ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే 2021 నాటికే పూర్తయ్యేది. 13.5 శాతం గ్రోత్ రేట్ సాధించాం. పెట్టుబడులు, పథకాలు, పాలసీలతో దేశ దృష్టిని ఆకర్షించాం. కానీ 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి విధ్వంసం చేశారు. ఆ విధ్వంస పరిస్థితులు అర్థం చేసుకోవడానికే నాలుగైదు నెలల సమయం పట్టింది. కనీసం ఒక్క శాఖపైనా శ్వేతపత్రాలు విడుదల చేయకపోవడమే కాకుండా కాగ్ కు కూడా లెక్కలు ఇవ్వలేదు. ఆడిటింగ్ చేయించకుండా ఇష్టానుసారంగా చేశారు. రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన ష్టనం కంటే గత ఐదేళ్లలోనే ఎక్కువ జరిగింది. విధ్వంసం, అరాచకాలు, అసమర్థ, చీకటి పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కివెళ్లేలా చేశారు. రాష్ట్ర బ్రాండ్ ను కూడా దెబ్బతీశారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజల కోసం పని చేసి ప్రజల పక్షాన నిలబడ్డాం.
*దొరికిన కాడికి దోచేశారు*
గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, దోపిడీని వినూత్నంగా చేసింది. రాజకీయ నాయకుడు ఇలా కూడా దోపిడీ చేసి తప్పించకుంటారని కలలో కూడా అనుకోలేదు. దొరికినకాడికి దోచేశారు. తప్పుడు పనులకు వ్యవస్థలను వాడుకుని నాశనం చేశారు. ప్రజాధనాన్ని దుబారా చేశారు. రాజధాని నిర్మాణం ఆపేశారు. మేటీ నగరంగా అమరావతి రూపుదిద్దురకుంటుదని అందరూ అనుకున్నారు. లక్ష కోట్లు ఖర్చు అవుతందుని తప్పుడు ప్రచారం చేశారు. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు....రైతులు ఇచ్చిన భూముల్లో 10 వేల ఎకరాలు మిగులుతుంది. దాన్ని విక్రయిస్తే రాజధాని నిర్మాణం జరిగిపోతుందని చెప్తే వినిపించుకోలేదు. జీవనాడి పోలవరంను పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి కరవు రాదని పని చేశాం. కానీ డయాఫ్రం వాల్ ను దెబ్బతీశారు. ఏజన్సీ, అధికారులను మార్చి ప్రాజెక్టును గాలికొదిలేశారు. రెండేళ్ల పాటు ప్రాజెక్టును అసలు పట్టించుకోలేదు.
*విద్యుత్ రంగంలో రూ.1.29 లక్షల కోట్ల నష్టం*
ప్రభుత్వ టెర్రరిజంతో ఉద్యోగ, ఉపాధి అవకావాలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని పరిశ్రమలు తరలిపోయాయి. రూ.1.29 వేల కోట్లు విద్యుత్ రంగంలో నష్టం వచ్చింది. సోలార్, విండ్ తో చేసుకున్న ఒప్పందాల ప్రకారం విద్యుత్ తీసుకోలేదు...కోర్టు తీర్పుతో రూ.9 వేల కోట్లు అప్పనంగా ఇవ్వాల్సి వచ్చింది. రూ.7.91 పైసలు పెట్టి బయట మార్కెట్ లో విద్యుత్ కొన్నారు. తప్పుడు నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేశారు. 40 లక్షల మంది భవన నిర్మాన కార్మికులు ఆధారపడిన ఇసుకను దోచుకున్నారు. రూ.30 వేల కోట్లు ఇసుకలో దోచుకున్నారు. ఇక మద్యం పాలసీ అయితే ఇప్పటికీ అర్థం కావడం లేదు. మద్యం తయారు చేసే కంపెనీలను బెదిరించి బలవంతంగా లాక్కుని సొంత బ్రాండ్లు తయారు చేశారు. వాళ్లే తయారు చేయడం, షాపులకు పంపిణీ చేయడం, అమ్మకం కూడా వాళ్లే చేశారు. ఆన్ లైన్ నగదు విధానం లేకుండా చేశారు. తాడేపల్లి ప్యాలెస్ కు కలెక్షన్ సొమ్ము వచ్చేది. మొన్నటిదకా రాష్ట్రంలో సైకో బ్రాండ్స్ దొరికేవి...కానీ ఇప్పుడు ప్రపంచంలోని అన్ని బ్రాండ్లు లభిస్తున్నాయి. పన్నులు లెఫ్ట్ అండ్ రైట్ వాయించారు. ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతీశారు. శాంతి భద్రతలు ఇలా కూడా చేశారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా పోలీస్ వ్యవస్థను ఉపయోగించారు. ఆస్తులను ధ్వంసం చేశారు...తోటలు నరికేశారు..భూములు కబ్జా చేశారు. భూములను 22ఏ కింద మార్చి...వారి పేరుపై మార్చుకోగానే తొలగిస్తారు. కరోనా రాకుండా ఉండేందుకు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే...వేధించి పిచ్చివాన్ని చేసి నడిరోడ్డుపై పడేసి చనిపోయేలా చేశారు. కాపాడాలని ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయాం.
*ఐదేళ్లలో మూలధన వ్యయం సున్నా*
ఐదేళ్లలో మూలధన వ్యయం తగ్గించారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలు పడిపోయాయి. ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా గుంతల పూడ్చివేతకు ఖర్చు చేయలేదు. వ్యక్తి ఐపీ పెడితే అప్పులోళ్లు వచ్చినట్లు ఏపీ పరిస్థితి తయారైంది. ఆర్థిక ఉగ్రవాదం సృష్టించారు. పొలానికి అడవి నుండి పందులు వస్తాయి...తిన్నంత తిని పోతూ పోతూ నాశనం చేసి వెళ్తాయి. అదే విధంగా రాష్ట్ర పరిస్థితిని కూడా గత పాలకులు మార్చారు. అడవి పందులు విధ్వంసం చేస్తే మళ్లీ పంట వేసుకునే అవకాశం ఉంటుంది..కానీ వాళ్లు చేసిన విధ్వంసంతో ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రజలు నమ్మి ఓట్లేసినందుకు దుర్మార్గంగా వ్యవహరించారు. ఆదాయం సృష్టించడానికి ఒక్క పని కూడా చేపట్టలేదు. పెట్టబడులు పెట్టేవారిని తరిమేశారు...నమ్మకం కోల్పోయేలా చేశారు. ఎన్డీయే గెలవకపోతే ఉన్న రెండుమూడు ఎకరాల భూమి అమ్మకుని వెళ్లిపోయే పరిస్థితి ఉండేదని ప్రజలు భావించారు. ప్రపంచంలోని తెలుగువారంతా ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు వేశారు.
*సొంత పత్రికకు ప్రజాధనం తగలేశారు*
రూ.430 కోట్లతో రుషికొండపై ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఆ బిల్డింగులు చూసి నాకే కళ్లు తిరిగాయి. ప్రభుత్వ ధనంతో ప్యాలెస్ లు కడతారా.? సిగ్గూఎగ్గూ లేకుండా కుటుంబ సభ్యులకు కూడా ప్యాలెస్ లు కట్టుకున్నారు. రుషికొండపై 7 బ్లాకులు కట్టారు. పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీం కోర్టు మొట్టికాయలు చేసినా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టులను మభ్యపెట్టారు. కోట్లు కుమ్మరించి ప్యాలెస్ కట్టుకున్నారు కానీ దానిలోకి వెళ్లలేకపోయారు. రూ.750 కోట్లతో సర్వేరాళ్లపై బొమ్మలు వేసుకున్నారు. వాటిని తొలగించడానికి రూ.30 కోట్ల దాకా ఖర్చు అయింది. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేశారు...కోర్టు ఆదేశాలతో వాటిని తొలగించడానికి వేల కోట్లు తగలేశారు. రూ.400 కోట్లు సొంత పత్రిక సాక్షికి ప్రకటనల రూపంలో ఇచ్చుకున్నారు. ప్రజాధనంతో వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రికను కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇచ్చుకున్నారు.
*కన్నతల్లిపై అసభ్యకర పోస్టింగులు పెట్టించే వాళ్లు మనుషులా...పశువులా..?*
ఇక సోషల్ మీడియా సైకోలను తయారు చేశారు. కన్నతల్లిపైనా అసభ్యకర పోస్టింగులు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే ఏమనుకోవాలి.? కన్నతల్లి శీలాన్ని శంకించే పరిస్థితి ఉందంటే వాళ్లు మనుషులా...పశువులా..? తల్లి వ్యక్తిత్వాన్నే హననం చేసేవారికి మనం ఒక లెక్కా.? ఎన్డీయే కూటమిలోని నేతలు, కార్యకర్తలు ఎవరూ అసభ్య పోస్టులు పెట్టరు...ఒకవేళ పెడితే కఠినంగా శిక్షిస్తాం. ఆడబిడ్డలు గౌరవంగా బతికేలా చేస్తాం. రాబోయే రోజల్లో ఏ ఆడబిడ్డా అవమాన పడటానికి వీళ్లేదు. చట్టానికి పదును పెట్టి కఠినంగా వ్యవహరిస్తాం. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు. రాజకీయంలో అవినీతి చూసి ఉంటాం...కానీ అవినీతి, అక్రమాలకే రాజకీయాల్లోకి వచ్చిన వారిని చూస్తున్నాం. టీడీపీ స్థాపించి 45 ఏళ్లు అయింది...ఇప్పటికీ మాకు టీవీ, పేపరు లేవు. కానీ అధికారంతో అవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. రైతు బజార్లు, ఎమ్మార్వో కార్యాలయానికి తాకట్టు పెట్టారు. మద్య నిషేధం అని చెప్పి ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు 25 వేల కోట్లు. కేంద్ర నిధులు దారి మళ్లించారు. పేదల పథకాలకు గండికొట్టారు. 2019కి ముందు లోకేష్ 24 వేల కి.మీ సిమెంట్లు రోడ్లు వేయించారు...కానీ గత అయిదేళ్లు ఏం చేశారో తెలీదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.4,500 కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం చుట్టారు. జల్ జీవన్ మిషన్ గొప్ప కార్యక్రమం. ప్రతి ఇంటికి నీరివ్వడం ఈ పథకం లక్ష్యం. 45 శాతం మేర కేంద్రం నిధులు ఇస్తుంది. దాన్ని కూడా అస్తవ్యస్థం చేశారు. ప్రయోగాలతో విద్యా వ్యవస్థను నాశనం చేశారు. స్కూళ్లు విలీనం చేయడం వల్ల డ్రాప్ అవుట్ రేట్ పెరిగింది. ఇంగ్లీష్ మీడియం వాళ్లే ప్రవేశపెట్టినట్లు...అంతక ముందు లేనట్లు ప్రవర్తించారు. ఎవరైనా మాట్లాడితే పేదలకులుగా చిత్రీకరించారు. వైద్య, వ్యవసాయ, అన్ని రంగాలను చిన్నచూపు చూసి నాశనం చేశారు.
*తేలింది రూ.9,74,556 కోట్ల అప్పులు...తవ్వితే ఇంకెంత ఉంటాయో.*
అప్పులు ఎక్కడున్నాయని మాట్లాడుతున్నారు. ప్రభుత్వ అప్పులు రూ.4.35 లక్షల కోట్లు ఉన్నాయి. పబ్లిక్ అకౌంట్స్ లయబిలిటీస్ రూ.80,914 కోట్లు, కార్పొరేషన్ అప్పులు రూ.2,48,670 కోట్లు, సివిల్ సప్లై శాఖలో రూ.36 వేల కోట్లు, విద్యుత్ రంగంలో రూ.34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ రూ.1,13,244 కోట్లు, ఉద్యోగులకు రూ.21,980 కోట్లు, నాన్ కాంట్రిబ్యూషన్ సింకింగ్ ఫండ్ కింద రూ.1,191కోట్లు...ఇవన్నీ కలుపుకుంటే రూ.9,74,556 కోట్లు అప్పులు ఉన్నాయి. ఇది అబద్ధం అని ఎవరు వచ్చినా లెక్కలు చూపించి గుంజిళ్లు తీయిస్తా. జీవోలు ఆన్ లైన్ లో లేకుండా చేస్తే తిరిగి ఆన్ లైన్ విధానం ప్రవేశపెట్టాం. గడిచిన ప్రభుత్వం దాచి పెట్టిన చీకటి జోవోలను కూడా ఆన్ లైనో లో పెట్టాం. 2014-19 మధ్య 6 పైసలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేశాం...అది కూడా బోర్డుకే వెళ్లేవి. కానీ గత ప్రభుత్వం రూపాయికి పెంచి ప్రభుత్వమే తీసుకుంది. వాటర్ టారిఫ్ కిలో లీటర్ కు రూ.40ల నుండి రూ.120 పెంచారు. ఇసుక మేము ఉచితంగా ఇస్తే టన్ను రూ.470లకు అమ్ముకున్నారు. ఆర్ధిక లోటు రూ.35,440 కోట్ల నుండి రూ.59,995 కోట్లకు పెంచారు. జీఎస్డీపీ రేషియో 44 నుండి 55కు పెంచారు. తలసరి ఖర్చు 2019కి ముందు రూ.74,790 ఉంటే 2023-24 నాటికి రూ.1,44,336కు పెరిగింది. అప్పులు, ఖర్చులు పెరిగి ప్రజల ఆదాయం తగ్గింది. తలసరి ఆదాయం గ్రోత్ రేట్ 13.2 శాతం నుండి 9.5 శాతాకి తగ్గింది. ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ రేట్ 15.3 శాతం నుండి 6.8 శాతానికి తగ్గింది. తలసరి వినియోగం 9 శాతం నుండి 2 శాతానికి తగ్గింది. యూనిట్ స్టార్టెడ్ ప్రొడక్షన్ 288 యూనిట్ల నుండి 80 కి తగ్గిపోయింది. దేశంలోనే వ్యవసాయంలో 16.6 శాతం గ్రోత్ రేట్ ను మేము సాధిస్తే వారొచ్చాక 10.5 శాతానికి తగ్గిపోయింది. మొత్తంగా 13.5 గ్రోత్ రేట్ ఉంటే దాన్ని 10.6 శాతానికి దిగజార్చారు. 3 శాతం గ్రోత్ రేట్ తగ్గితే రూ.6.94 లక్షల కోట్ల కోట్ల ఆదాయం తగ్గిపోతుంది. ఇప్పటికి 13.5 శాతం గ్రోత్ రేట్ ఉంటే రూ.76,195 కోట్ల అదనపు ఆదాయం వచ్చేది. రూ.76 వేల కోట్లతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చు. జీఎస్డీపీ 2018-19 నాటికి తెలంగాణ కంటే మన రాష్ట్రానికి రూ.17 వేల కోట్లు అదనంగా ఏపీకి తెచ్చాం. 2023-24 నాటికి ఏపీ తెలంగాణ మధ్య రూ.62 వేల కోట్లు అధికంగా తెలంగాణ సాధించింది. అంటే ఏపీ ఆదాయం కంటే తెలంగాణ ఎక్కువ సాధించింది. అంటే ఇది గత పాలకులు అవినీతి, అసమర్థత కాక మరేమిటి.? తలసరి ఆదాయంలో ఏపీ, తెలంగాణ మధ్య 2018-19 నాటికి రూ.55 వేలు ఉంటే 2023-24 నాటికి రూ.1.14 లక్షల ఉంది. తలసరి ఆదాయం పెరగలేదు, వృద్ధి రేటు లేదు. బటన్ నొక్కితే ప్రజలకు ఏమైనా వచ్చిందా...అప్పులు పెరిగాయి.
*ఆస్తుల సృష్టి జరగలేదు...బటన్లు నొక్కేందుకు అప్పులు తెచ్చారు*
అమరావతి, పోలవరం, విద్యుత్ రంగం విధ్వంసం చేశారు. ఐదేళ్లు పెట్టుబడి దారుల్లో నమ్మకం పోయింది. ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఏమీ కల్పించలేదు. ఐదేళ్ల పాటు రాష్ట్రం విష వలయంలో చిక్కింది. ఆస్తుల సృష్టి లేదు...ఆదాయం పెరగలేదు. ఆదాయం తగ్గింపుతో పాటు పన్నులు పెంచారు. బటన్లు నొక్కేందుకు అప్పులు తెచ్చారు...ఆస్తులు తాకట్టు పెట్టారు. మేము అధికారంలోకి రాగానే 7 శ్వేత పత్రాలు విడుదల చేశాం. స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపకల్పన చేశాం. ప్రజలు 21 మంది ఎంపీలను గెలిపించడంతో ఢిల్లీలో పలుకుబడి పెరిగింది. కేంద్ర సహకారం లేకుంటే రాష్ట్రం ఏమయ్యేదో తెలిసేది కాదు. రాష్ట్రాన్ని వెంటిలేటర్ నుండి ఇప్పుడే వెలికి తీశాం. 150 రోజుల్లో ఎన్నో పథకాలు, నిర్ణయాలు, పాలసీలు తెచ్చాం. సంపద సృష్టించి, ఉపాధి మార్గాలు పెంచాలని ముందుకెళ్తున్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా 6 పాలసీలు తెచ్చాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకెళ్తున్నాం. సీఎంగా బాధ్యతలు చేప్టటిన వెంటనే 5 హామీల అమలపై సంతకం చేశాం. 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. రూ.4 వేలు సామాజిక పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ. ధనిక రాష్ట్రాలు కూడా ఇవ్వడం లేదు. అన్నాక్యాంటీన్లు కూడా నాశనం చేశారు. పేద వాడికి భోజనం పెట్టడాన్ని కూడా ఓర్చుకోలేకపోయారు. నూతన మద్యం పాలసీ, ఇసుక పాలసీ తెచ్చాం. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ పాలసీలను సమర్ధవంతంగా అమలయ్యేలా బాధ్యత తీసుకోవాలి. అందరం ప్రజల మనోభావాల ప్రకారం పని చేయాలి.
*నేరస్తుల రాజకీయ ముసుగు తొలగిస్తాం*
జీరో టాలరెన్స్ విదానంతో వెళ్తాం. రాజకీయ ముసుగులో నేరాలు చేయాలనుకునే వారికి ముసుగు తొలగిస్తాం. సభకు వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోవచ్చు...కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. త్వరలో టూరిజం పాలసీ కూడా తీసుకొస్తాం. అమరావతి, పోలవరాన్ని పట్టాలెక్కించాం. గోదావరి-కృష్ణా-పెన్నా నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరవు ఉండదు. సూపర్-6 లో ఇచ్చిన దీపం-2 పథకం అమలు చేశాం. 48 గంటల్లోనే సిలిండర్ కు డబ్బులు అందిస్తున్నాం. లబ్ధిదారులకు నేరుగా అందించే విధానాన్ని త్వరలో తీసుకొస్తాం.. 150 రోజుల్లో లక్షల కోట్ల పెట్టుబడులకు శ్రీకారం చుట్టాం. రూ.860 కోట్లతో రోడ్లపై గుంతలు పూడ్చుతున్నాం. గౌడలకు 10 శాతం మద్య షాపులు కేటాయించాం. దూపదీపనైవేద్యాలకు రూ.10 వేలకు పెంచాం. వేద విద్య అభ్యసించిన వారికి రూ.3 వేలు భృతి అందిస్తున్నాం. రైతులకు పెట్టిన 1670 కోట్ల బకాయిలు చెల్లించాం. పాడి రైతులకు 90 శాతం రాయితీతో షెడ్లు నిర్మిస్తున్నాం. కొప్పర్తి, ఓర్వకల్లు, నక్కపల్లి, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం. ఓర్వకల్లులో 300 ఎకరాలు డ్రోన్ హబ్ కు కేటాయించాం. రైల్వే జోన్ కు భూమి కేటాయించాం..త్వరలో ప్రధాని మోదీ భూమి పూజ చేస్తాం. డిసెంబరులో లక్ష ఇళ్లు గృహ ప్రవేశాలు నిర్వహిస్తాం. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి జాగా ఇస్తాం. సంసద సృష్టించి ఆదాయంపెంచి, మళ్లీ పేదల సాధికారతకు ఖర్చు చేస్తాం. సూపర్ 6 హామీలను పూర్తిగా నెరవేర్చడమే కాదు..అదనంగా మరిన్ని పథకాలు అమలు చేస్తాం.’ అని స్పష్టం చేశారు.
addComments
Post a Comment