*కాటన్ పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం తోడ్పాడు వుంటుంది.. కేంద్ర మంత్రి పెమ్మసాని
*
*పత్తి రైతులను కేంద్రమే ఆదుకోవాలి.. ప్రత్తిపాటి*
అమరావతి (ప్రజా అమరావతి);
చిలకలూరిపేట నియోజకవర్గంలో గోపాలవారిపాలెం గ్రామంలో వున్న టెక్సటైల్ పార్క్ ను శనివారం కేంద్ర సహాయ మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు, మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లులు సహా కాటన్ ఆధారిత పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయనీ, దేశంలో సగం మిల్లులు ఇప్పటికే మూతపడ్డాయని, మిగిలినవి కూడా నష్టాలను బాటలోనే నడుస్తున్నాయన్నారు. కేంద్రం కొంతమేర మద్దతు ధర పెంచినప్పటికీ పత్తి రైతులు కష్టాలు తీరడంలేదన్నారు. పత్తి మద్దతు ధర 7,500 చేసినప్పటికీ రైతులు సంతోషంగా లేదన్నారు. తెగుళ్లు సోకి, దిగుబడి తగ్గడంతో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అదే సందర్భంలో కాటన్ పరిశ్రమలు పరిస్థితి కూడా ఏమీ బాగా లేదని ప్రత్తిపాటి చెప్పారు. సంక్షోభంలో ఉన్న కాటన్ పరిశ్రమను, రైతులను కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని, ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తీసుకోవాలని ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. టెక్స్ టైల్ పార్క్ లో పరిశ్రమలు నడుపుతున్న వ్యాపారులతో మాట్లాడిన కేంద్ర మంత్రి, వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి పెమ్మసాని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టెక్స్ టైల్ పార్క్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment