ఇంటికో పారిశ్రామికవేత్త రావాలి.

 *మూలపేట పోర్టు ప్రాంతంలో రూ.10 వేల కోట్లతో పారిశ్రామికాభివృద్ధి

*ఇంటికో పారిశ్రామికవేత్త రావాలి


*టెక్కలి లేదా పలాసలో విమానాశ్రయం

*ఈదుపురం గ్రామంలో దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో వెల్లడించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు



శ్రీకాకుళం/ఈదుపురం,1 (ప్రజా అమరావతి): మూలపేట పోర్టు ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతంలో పది వేల కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈదుపురంలో శాంతమ్మ గృహానికి వెళ్లి గ్యాస్ స్టవ్ వెలిగించి టీ చేసి ఇచ్చినట్లు చెప్పారు.  టీ అందరూ త్రాగారన్నారు. అయ్యా అప్పుడు మీరు ఉన్నప్పుడు దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారని, మళ్లీ మీరే ఉచిత గ్యాస్ సిలిండర్ల ఇచ్చారన్నారు. గతంలో గ్యాస్ స్టవ్ లేని సమయంలో కట్టెలు తెచ్చి, ఆరబెట్టి, ఇలా ఎన్నో కస్టాలు పడేవారమని చెప్పినట్లు ఆయన తెలిపారు. నేడు ఫోన్ చేస్తే ఇంటికే గ్యాస్ వస్తుందన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామన్నారు. ప్రతీ ఇంటికి ఒక ఆర్థిక వేత్త తయారవ్వాలని పిలుపునిచ్చారు. ఆత్మ గౌరవంతో బ్రతకాలన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే మహిళలకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఇచ్చింది నందమూరి తారక రామారావని, ఐటి ఉద్యోగాలు చేస్తున్న పురుషులు,  మహిళలల్లో మహిళలలే అధిజీతం పొందుతున్నట్లు పేర్కొన్నారు. గతంలో డ్వాక్రా సంఘాలలో 10 మంది సభ్యులతో ప్రారంభించి పావలా వడ్డీ, రివాల్వింగ్ ఫండ్, తదితరమైనవి ఏర్పాటు చేయడమైనదని, డ్వాక్రా సంఘాల ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వెళ్లేవారని తెలిపారు. డ్వాక్రా సంఘాలకు పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. ఇంటికో మహిళా పారిశ్రామిక వేత్తే లక్ష్యమన్నారు. గతంలో బాలికా శిశు సంరక్షణ పథకం ప్రారంభించి 7,8,9,10 తరగతులు చదువుతున్న బాలికలకు ఉచితంగా సైకిల్ ఇచ్చాచామని, దీని వలన వారిలో ఆత్మ స్థైర్యం పెరుగుతుందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చేవన్నీ మహాళలు పేరునే ఇచ్చినట్లు చెప్పారు. ఆడ పిల్లలకు సమాజంలో గౌరవం ఉండాలని, దాని వలన కుటుంబానికి, ఆ గ్రామానికి మంచి పేరు వస్తుందని, ఫలితంగా కుటుంబం బాగుంటుందని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వలన ఈదుపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడం నా పూర్వ జన్మ సుక్రుతమన్నారు. గ్యాస్ చూసినపుడంతా చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తారన్నారు. తాను గ్రామం నుండి వచ్చిన వాడినేనని, నా తల్లి కట్టెలు పొయ్యి పైనే గతంలో వంట చేసేవారన్నారు. గతంలో ఒక ఎంఎల్ఎ కి సంవత్సరానికి 3 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెప్పారు. దేశంలో ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు మన రాష్ట్రంలోనే ఉన్నట్లు వెల్లడించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి డబ్బులు కట్టే విధానం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంత వరకు డబ్బులు కట్టి ఉచిత గ్యాస్ సిలిండర్లు తీసుకున్న 48 గంటల్లోగా డబ్బులు వచ్చేస్తాయని చెప్పారు. ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి 1671 మంది అర్హులు ఉన్నారని, ఇందుకు 42 లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో రూ.4.60 కోట్లు, జిల్లాలో 122 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వివరించారు. రూ.35 పెన్షన్ పెట్టింది ఎన్టీఆర్ అని, రూ.70లు చేసింది తమ ప్రభుత్వమని, రూ.2000/-లు, రూ.4 వేలు చేసిందీ తమ ప్రభుత్వమేనన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. దివ్వాంగులకు 3 వేలు నుండి 6 వేల రూపాయలు, కిడ్నీ బాధితులకు పది వేల రూపాయలు, కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మంచంపై ఉన్న వారికి 15 వేల రూపాయలు, ఇలా పలు వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ప్రజల కష్టాలు తెలుసుకున్న ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వమని చెప్పారు. ఎవరూ లేకుండా ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఆ బాధేంటే తెలుస్తోందని, జానకి అనే మహిళ ఒంటరిగా ఉంటుందని ఆమెకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించినట్లు చెప్పారు. ఆమెకు గృహం లేదని చెప్పగా తక్షణమే గృహ నిర్మించి ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. 

      శ్రీకాకుళం జిల్లాలో 90 శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి అయినదని, పెన్షన్లు 3 నెలల వరకు తీసుకో వచ్చని స్పష్టం చేశారు. ఇంటి వద్దే పెన్షన్ తీసుకోవాలని వెల్లడించారు. ఇంటికొచ్చి సియం పంపించారు అనీ చెప్పి సచివాలయం సిబ్బంది ఇవ్వాలన్నారు.  ఎవరైనా తప్పు చేస్తే సముదాయించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మనమే తప్పులు చేస్తే ఇంకొకరికి ఎలా చెప్పగలమని పేర్కొన్నారు. *కరకవలస గ్రామానికి చెందిన పేరాడ అమ్మన్న కేన్సర్ తో బాదపడుతుందని తన కుమారుడు ఫ్లకార్డును ప్రదర్శించగా సియం అది చూసి ఆగి విషయం తెలుసుకొని లక్షి ఏబై వేల రూపాయలు అక్కడికక్కడే మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అయ్యిందని (143 రోజులు) అయ్యిందన్నారు. 10.50 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పారు. ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చామని, మీ ఊరిలో ఇసుక మీరే తీసుకోవాలని, ఇసుక పై ఉన్న చార్జీలను తీసివేసినట్లు వివరించారు. మద్యం మాట్లాడుతూ బెల్ట్ షాపుల పెట్టరాదని, బెల్ట్ షాపు పెడితే బెల్ట్ తీస్తామన్నారు.  ఎంఆర్పీ రేట్ల కంటే అధికంగా అమ్మకాలు జరిపితే అధిక అపరాధ రుసుం వసూలు చేస్తామన్నారు. రెండవ సారి దొరికితే లైసెన్సు రద్దు చేస్తామన్నారు. విశాఖను ఆర్థిక రాజధాని చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ను రక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మెగా డిఎస్సీ 16734 పోష్టులను త్వరలోనే భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రతీ కుటుంబంలో ఒకరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, ల్యాండ్ టైటిల్ రద్దు చేయడమైనదని, చెత్త 84 లక్షల టన్నులు ఉందని, దీనిని తీయడానికి వెయ్యి కోట్ల రూపాయలు అవుతుందన్నారు. స్వర్ణ కారులకు ప్రత్యేక కార్పోరేషన్, గీత కార్మిక కార్మికులు, చేతి వృత్తులు, కుల వృత్తులను ప్రోత్సహిస్తామన్నారు. 820 కోట్ల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్లకు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని విజయనగరంలో నేడు ప్రారంభిస్తామన్నారు. 5500 డ్రోన్లు తో షో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓర్వకల్లు వద్ద డ్రోన్లు ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తామన్నారు. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం, టెక్కలి లేదా పలాసలో విమానయానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు. పాత గృహాల బిల్లులు క్లియర్ చేస్తున్నట్లు చెప్పారు. అర్హులందరికి ఇళ్ల స్థలాలు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామన్నారు. *ఈదుపురం గ్రామంలో 95 మంది కుటుంబాలకు పక్కా గృహాలు లేవని, గ్రామంలో ఉన్న 85 సెంట్లలో కట్టించమని కలెక్టర్ ను ఆదేశించారు. అర్హత గల లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తామని, తాగునీరు, ఐదు ప్రతీ ఇంటికి పైపు లైన్ల ద్వారా జిల్లా అంతటా సరఫరా చేస్తామని, ఇరిగేషన్ సమస్యలకు 30 కోట్లు  మంజూరు చేశారు. బెంతు ఒరియాల సమస్య పై సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తామన్నారు. తక్షణమే స్థిర నివాసం సర్టిఫికెట్లు జారీ కి చర్యలు చేపడతామన్నారు. ఈదుపురం ఎప్పుడూ గుర్తు ఉంటుందని చెప్పారు. 


ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు

నవంబర్ 1 అంటే అందరికీ రాష్ట్ర అవతరణ గుర్తుకువస్తుంది.

మేం మొన్న క్యాబినెట్ లో దీనిపై చర్చించాం. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తుపట్టుకోవాల్సిన అవసరం ఉంది

ఆయన ప్రాణ త్యాగంతో రాష్ట్రం ఏర్పాటు అయ్యింది.

ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేసింది నేను అని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా.

1952 అక్టోబర్ 19 ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆ పోరాటంలో డిశంబర్ 15వ తేదీన ఆయన ప్రాణాలు విడిచారు.

దాదాపు 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు.

ఆయన మృతితో ఉద్యమం పుడితే తరువాత అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ప్రకటించారు. 

1956లో ఆంధ్ర రాష్ట్రం , తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేశారు. 

2014లో జూన్ 2 ఆంధ్ర ప్రదేశ్ విడిపోయింది. ఇవన్నీ మొన్న క్యాబినెట్ లో చర్చించాం.

ఒక్కో రోజున ఒక్కో పరిణామం జరిగింది.

అయితే పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణం చేసిన రోజును ప్రత్యేక రోజుగా గుర్తించి నిర్వహించేందుకు మేం నిర్ణయం తీసుకున్నాం.

పొట్టి శ్రీరాములు చనిపోయిన డిశంబర్ 15 తేదీ చరిత్రలో ముఖ్యమైన రోజు. ఆయన ప్రాణ త్యాగం చేసిన రోజును, ఆయన త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఆయనను గౌరవించుకుంటాం.

ఎపి విషయంలో చరిత్రలో అనేక మార్పులు జరిగాయి. అయితే చరిత్ర గుర్తుపెట్టుకుంటూనే చరిత్ర సృష్టించిన త్యాగధనులను గౌరవిస్తాం. 

ఈ విషయంలో ఎప్పుడూ ముందు ఉంటాం.

  ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి, రాష్ట్ర సూక్ష్మ, మద్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, పౌర సరఫరాల శాఖ ఎండి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఇచ్ఛాపురం శాసన సభ్యులు బెందాళం అశోక్, గౌతు శిరీష, కూన రవి కుమార్, నడికుదిటి ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, నిమ్మక జయకృష్ణ, మాజీ శాసన సభ్యులు కలమట వెంకటరమణ, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు చౌదరి ధనలక్ష్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, పాలకొండ సబ్ కలెక్టర్ యస్.వి.యశ్వంత్ రెడ్డి, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Comments