జర్నలిస్టు పిల్లలకు ప్రవేటు స్కూల్స్ లో 50% ఫీజు రాయితీ కల్పించాలి.

 *జర్నలిస్టు పిల్లలకు ప్రవేటు స్కూల్స్ లో 50% ఫీజు రాయితీ కల్పించాలి.




 *గుంటూరు జిల్లా కలెక్టర్ కు ఏపీడబ్ల్యూజేఎఫ్  వినతి.* 




గుంటూరు : అక్టోబర్ 15 (ప్రజా అమరావతి);

ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్ లో  50% ఫీజు రాయితీ కల్పించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఐఏఎస్ నీ కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని అందిస్తూ సమాజ అభివృద్ధి ని కాంక్షిస్తూ గౌరవప్రదమైన పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ ప్రభుత్వ గుర్తింపు కలిగి ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రిడేషన్ కార్డు కలిగి వివిధ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల లో పనిచేస్తూ  చాలిచాలని జీతాలతో ఆర్థికంగా వెనుకబడి సమాజ శ్రేయస్సుకై ముందుకు సాగుతున్న నేపథ్యంలో జర్నలిస్టు పిల్లల భవిష్యత్తు నిమిత్తం వారి యొక్క చదువు కొరకు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు కట్టి విద్యను అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత టిడిపి ప్రభుత్వంలో పాత్రికేయుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పిస్తూ జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా అన్ని ప్రైవేట్ పాఠశాలలకు ఆదేశాలు అందించి అన్ని ప్రైవేటు పాఠశాలలో పాత్రికేయ జర్నలిస్టుల పిల్లలకు 50% డిస్కౌంట్ అందించడం జరిగింది. అయితే గత వైసిపి ప్రభుత్వంలో దీనిని అమలు చేయకపోవడం వల్ల అనేకమంది జర్నలిస్టు మిత్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొని అప్పులు బాధలతో ఇబ్బంది పడుతున్న పడిన సందర్భాలు అనేకం ఈ నేపథ్యంలో నూతన కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టు పిల్లల చదువు నిమిత్తం అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ అందించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా అన్ని ప్రైవేట్ పాఠశాలలకు ఆదేశాలు అందించి జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం కృషి చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కి విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ కన్వీనర్ కనపర్తి రత్నాకర్, జిల్లా కమిటీ సభ్యులు పట్నాల సాయి కుమార్, అజయ్ ఇండియన్, శామ్యూల్, వేముల రాజేష్, కొండవీటి పుల్లారావు, మహేష్ వరదల, సుధీర్, సయ్యద్ కరిముల్ల, యం.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Comments