ఎన్ఎండి ఫరూక్ కి 25,000 రూపాయల చెక్కును అందజేసిన జాబిల్లి చిన్న పిల్లల హాస్పిటల్ డాక్టర్ పెసల అశోక్ కుమార్.

 * ఎన్ఎండి ఫరూక్ కి 25,000 రూపాయల చెక్కును అందజేసిన జాబిల్లి చిన్న పిల్లల హాస్పిటల్ డాక్టర్ పెసల అశోక్ కుమార్*



నంద్యాల  (ప్రజా అమరావతి );ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి పిలుపుమేరకు నంద్యాల జాబిల్లి చిన్న పిల్లల హాస్పిటల్ డాక్టర్ పెసల అశోక్ కుమార్ ఆధ్వర్యంలో 25,000 రూపాయల చెక్కును విజయవాడ వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి అందజేశారు ... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వరదలు రావడం చాలా బాధాకరమైన విషయమని ,  చాలామంది ప్రజలు నిరుపేదలుగా మిగిలారని వారికోసం మా వంతు సహాయార్థం ఈ 25,000 అమౌంట్ ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేస్తున్నామని తెలియజేశారు అనంతరం ఎన్ఎండి ఫరూక్ వారిని అభినందించడం జరిగింది. అందరూ ఇలా ముందుకొచ్చి తమ వంతు సహాయ సహకారాలు వరద బాధితులకు అందించాలని పిలుపునివ్వడం జరిగింది . అనంతరం మంత్రి ఫరూక్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది


ఈ కార్యక్రమంలో 12 వ వార్డు కౌన్సిలర్ కండె శ్యామ్ సుందర్ లాల్, నంద్యాల జిల్లా వాసవి సేవా దళ్ అధ్యక్షుడు బింగుమళ్ళ శ్యామ్ సుందర్ గుప్త, డాక్టర్ జఫ్రుల్లా తదితరులు పాల్గొన్నారు.

Comments