తిరుమల లడ్డు వివాదం.. సీఎం చంద్రబాబు పై సుప్రీంకోర్టు ఆగ్రహం.

 *తిరుమల లడ్డు వివాదం.. సీఎం చంద్రబాబు పై సుప్రీంకోర్టు ఆగ్రహం*


• చంద్రబాబు తన వ్యాఖ్యలతో కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచారు


• నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం ఉందా?


• నెయ్యి కల్తీపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా?


• లడ్డూ కల్తీ జరిగిందని చెప్పడానికి శాంపిల్ ల్యాబ్కు పంపించారా?


• లడ్డూను ముందుగానే పరీక్షలకు ఎందుకు పంపలేదు


• సెప్టెంబర్ 18వ తేదీ నాటి సీఎం ప్రకటనకు ఆధారాలు ఉన్నాయా?


• కల్తీ నెయ్యిని లడ్డూ తయారీ వాడకంలో వాడినట్లు ప్రాథమిక ఆధారాల్లేవ్


• అలాంటప్పుడు నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యాలు చూపించండి


• జులైలో రిపోర్ట్ వస్తే.. సెప్టెంబర్లో చెప్పారెందుకు?


• సిట్ ఎందుకు వేశారు? ఈ విచారణ సరిపోతుందా??


• కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి


• అక్టోబర్ 3వ తేదీకి తదుపరి విచారణ వాయిదా


న్యూఢిల్లీ (ప్రజా అమరావతి): 


తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా? అంటూ సూటిగా ప్రశ్నించింది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.


*చంద్రబాబు వైఖరిపై సుప్రీం కోర్టు సీరియస్*


ల్యాబ్ మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవో చెప్పారు కదా?. ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది కదా? అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు. మీరు మీడియాకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా. జులైలో రిపోర్ట్ వస్తే.. సెప్టెంబర్లో చెప్పారెందుకు?. సిట్ ఎందుకు వేశారు?. ఇది దర్యాప్తునకు సరిపోతుందా? అని సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతాను అడిగింది ధర్మాసనం.


ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. మీ వ్యాఖ్యలతో వాళ్లను గాయపరిచారు అంటూ సీఎం చంద్రబాబు బాబుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా? ధర్మాసనం ప్రశ్నించింది.


*'నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం ఉందా?*


-ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు?


-ఎన్డీడీడీబీ మాత్రమే ఎందుకు?


-సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు?


-కల్తీ జరిగినట్టు ఆరోపించిన లడ్డూలను పరీక్షించారా..? 


-లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షకు పంపలేదు?

 

-కల్తీ జరగనప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు?"


ధర్మాసనం ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ప్రభుత్వం తరపు న్యాయవాది సిదార్థ్ లూథ్రా నీళ్లు నమిలారు. ఆ నాలుగు ట్యాంకులు వాడలేదని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఇరువైపులా వాదనలను రికార్డ్ చేసిన అనంతరం.. తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి(గురువారం) వాయిదా వేసింది.


*అంతకు ముందు..*


సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అందుబాటులో లేకపోవడంతో విచారణ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. లడ్డూ అంశంపై ఏపీ సీఎం, టీటీడీ ఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని.. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కోరారు.


"లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి పరీక్షకు నిర్దిష్ట విధానాలు ఉన్నాయి. కల్తీ జరిగిన వంద శాతం నెయ్యి వాడలేదని స్వయంగా ఈవో చెప్పారు. ఇష్టారీతిన మాట్లాడడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి. రాజకీయ కుట్రతో లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్నారు. దేవాలయ వ్యవహారాలు పూర్తిగా ఈవో, బోర్డునే నిర్వహిస్తారు. ఈవో ను ప్రస్తుత ప్రభుత్వమే నియమించింది" అని సుబ్రహ్మణ్యస్వామి వివరించారు. తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. కాగా, తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియ్య స్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు.

సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్థించారు. ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని విన్నవించారు. ఈ కేసులో సుబ్రమణియన్స్వామి స్వయంగా వాదనలు వినిపించారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకెళ్లారు. తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎందుకైంది, ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా? అనేది కూడా తేల్చాలని ఆయన తన పిటిషన్లో ప్రస్తావించారు.

Comments