రాష్ట్రంలో అసలు పాలన జరుగుతుందా ?

 

అమరావతి (ప్రజా అమరావతి);

    రాష్ట్రంలో అసలు పాలన జరుగుతుందా ?


మీ దృష్టి అంతా ఎక్కడుంది ? బాబు శాంతి హోమాలు , పవన్ ప్రాయశ్చిత్త దీక్షలు, జగన్ ప్రక్షాళన పూజలు, హిందూమతం అంతానికి కుట్ర అని బీజేపీ.. అందరూ  కలిసి లడ్డూకి మత రాజకీయాలు పులిమారు. లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని,జంతువుల ఆయిల్ కలిపారని, NDDB ఇచ్చిన రిపోర్ట్ సైతం పెట్టుకొని, చర్యలు తీసుకోవాల్సింది పోయి.. 

మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడమే అజెండాగా పెట్టుకున్నారు. "జగన్ సర్కార్ లడ్డూలో జంతువుల కొవ్వు కలిపితే...కూటమి సర్కార్ లడ్డూలో మత రాజకీయాలు కలిపింది ". క్రైస్తవుల చర్చిలో, ముస్లింల మజీద్ లో ఇలా జరిగితే ఊరుకుంటారా అంటే మతాలను రెచ్చగొడుతున్నట్లే కదా అర్థం. మత ఘర్షణలు జరగాలని హిడెన్ అజెండా పెట్టుకున్నట్లే కదా అర్థం. ప్రశాంతమైన ఏపీలో మత కల్లోలాలు సృష్టించాలని చూస్తున్నట్లే కదా అర్థం. 120 కోట్ల మంది భారతీయులకు మంచి జరగాలని మొక్కుకున్న మోడీ గారు..ఇదే తిరుమలలో వివాదం జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదు ? NDDB రిపోర్ట్ కనిపించలేదా ? CBI విచారణ చేయించడానికి మనసు రావడం లేదా ? హిందూమతం మీద కుట్ర జరిగితే CBI దర్యాప్తులో ఆ విషయం తేలేది కదా ? కుట్ర నిజమే అయితే అది దేశ ద్రోహం అవుతుంది కదా ? లడ్డూ విషయంలో మతోన్మాద చర్యలు కాదు. సవాళ్లు, ప్రతి సవాళ్లు అంతకన్నా కాదు. దీక్షలు,ప్రమాణాలు అసలే కాదు. మాకు నిజం కావాలి. చేప చిన్నదైనా..పెద్దదైనా శిక్ష మాత్రం కఠినంగా ఉండాలి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఇవ్వాళ లేఖ రాశాం. లడ్డూ వివాదాన్ని సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేయించాలని కోరాం. లేదా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాం.

Comments