విజయనగరం, సెప్టెంబర్ 24 (ప్రజా అమరావతి);:
మెంటాడ మండలం *జక్కువ గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో జోడెద్దులుతో దుక్కుదున్నిన మంత్రి సంధ్యారాణి .
*
*ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పంటపొలాలపై రసాయనాలు పిచికారీ చేసే డ్రోన్ ను ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి .*
*తిరుపతి లడ్డును అపవిత్రం చేసిన దోషులను శిక్షించాలి మంత్రి సంధ్యారాణి .*
*ప్రపంచమంతా కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల తిరుపతిని గత జగన్ ప్రభుత్వం అపవిత్రం చేసింది మంత్రి సంధ్యారాణి .*
*గత ప్రభుత్వంలో దోచుకో - పంచుకో - దాచుకో పాలన మాత్రమే సాగింది: మంత్రి .*
*4 సార్లు ముఖ్యమంత్రిగా 9 సార్లు డీఎస్సీ ద్వారా దాదాపు 2లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది: మంత్రి సంధ్యారాణి .*
*అభివృద్ధికి రెక్కలు తొడిగి, మొదటి 100 రోజుల్లోనే "ఇది మంచి ప్రభుత్వం" అని ప్రజల చేత అనిపించుకున్న కూటమి ప్రభుత్వం మంత్రి * .
*100 రోజులు పరిపాలనలో 1000 శాతం మైలురాయి బాబు పాలన విజయవంతంగా ముందుకు సాగింది.*
సంక్షోభంలోనూ సంక్షేమం అందించడం అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం జాక్కువ గ్రామంలో *ఇది మంచి ప్రభుత్వం"* ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి . మేళతాళాలు, నృత్యాలు, నుదితిన తిలకం దిద్ది, పూలవర్షంలో స్వాగతం పలికిన గ్రామస్తులు. అనంతరం ఇంటింటికి వెళ్లి వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ, ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొన్న మంత్రి గారు. అనంతరం ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ "ఇది మంచి ప్రభుత్వం మంచి మనసున్న ప్రభుత్వం"అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, అనేక సంస్కరణలు చేపట్టి ఇది మంచి మనసున్న ప్రభుత్వం అని ప్రజల చేత మెప్పు పొందిందని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఎన్నికల ముందు
నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రన్న,16,437ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ విడుదల చేసారు,అవ్వాతాతలకు పింఛన్ రూ.4000, దివ్యాంగులకు రూ.6000 ఇస్తున్నారు. లక్షల మందికి ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్. నిరుద్యోగ యువత భవిష్యత్తుపై వెలుగు సంతకం మెగా డీఎస్సీ. ఉచిత ఇసుక విధానం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా కల్పించారని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు.మెంటాడ మండలంలోని గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి 6 కోట్ల నిధులు సీఎం చంద్రబాబునాయుడు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని 3 నెలల్లోనే రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని తెలియచేసారు.
గడచిన ఐదేళ్ళ నుండి తిరుమల వెళ్ళిన భక్తులంతా అక్కడ జరుగుతున్న వ్యవహారాలపై అసంతృప్తిని వ్యక్తం చేయడం, పవిత్రత విషయంలో అపచారం జరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేయడం చూసాం కానీ పరమ పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదం లడ్డూ విషయంలో కూడా జగన్ ప్రభుత్వం 532 కోట్ల రూపాయిలు కైంకర్యం చేయడం తాజాగా వెలుగులోకి రావడం విస్మయం గొలుపుతుంది అని మంత్రి తెలిపారు.
addComments
Post a Comment