నూతన అబ్కారీ పాలసీ అమలు సిద్దం కావాలి
ప్రోషిబిషన్ అండ్ ఎక్సైజ్ కమీషనర్ నిషాంత్ కుమార్
ఐఎంఎల్ డిపోలు, రిటైల్ అవుట్ లెట్ల బాధ్యులతో దృశ్య శ్రవణ విధాన సమీక్ష
ప్రతి షాపులోనూ తగినంత మేర నిల్వలు, సమయపాలన తప్పని సరి
అమరావతి (ప్రజా అమరావతి);
అతి త్వరలో రానున్న నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా అబ్కారీ శాఖ సంసిద్దంగా ఉండాలని ఆ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, యంత్రాంగాన్ని సిద్దం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం కమీషనరేట్ నుండి సంచాలకులు ఐఎంఎల్ డిపోలు, రిటైల్ అవుట్ లెట్ల బాధ్యులతో దృశ్య శ్రవణ విధాన సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతమున్న దేశీయ తయారీ విదేశీ మద్యం డిపోలు, రిటైల్ అవుట్‌లెట్ ల పనితీరును ఈ సందర్భంగా మదింపు చేసారు. సమీక్షలో భాగంగా డిపోలు, ప్రభుత్వ రిటైల్ అవుట్‌లెట్‌లలో నిల్వలను ఎప్పటి కప్పుడు అంచనా వేయాలని నిషాంత్ కుమార్ సూచించారు. ప్రభుత్వానికి నష్టం వచ్చే విధంగా షాపులను నిర్దేశించిన సమయానికంటే ముందుగా మూసివేయటాన్ని అంగీకరించబోమని, తప్సని సరిగా సమయ పాలన పాటించాలని స్ఫష్టం చేసారు. ప్రతి షాపులోనూ తగినంత మేర నిల్వలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్‌లు తమ పరిధిలోని స్టేషన్ లను సందర్శించాలని ఆదేసించారు. పెండింగ్‌లో ఉన్న కేసులు, ప్రస్తుతం విచారణలో ఉన్న కేసులను పరిశీలించి కార్యాలయానికి నివేదించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సబార్డినేట్ కార్యాలయాల్లో త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక తనిఖీలు నిర్వహించాలన్నారు. దిగువ స్థాయు సిబ్బందికి సంబంధించి అవసరమైన బదిలీలను నిర్వహించాలని నియామక అధికారులకు నిషాంత్ కుమార్ ఆదేశాలు జారీచేసారు.
పాలసీ మార్పుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ రిటైల్ అవుట్‌లెట్‌లు ప్రైవేట్ నిర్వహణకు మారుతున్న పరిస్దితులలో రిటైల్ అవుట్‌లెట్‌ల వద్ద ఆస్తుల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, పిఓఎస్ మెషీన్‌లు, నగదు భద్రతా బీరువాలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర పరికరాలకు సంబంధించి జాబితాలు సిద్దం చేయాలని అయా ప్రాంతాల స్టేషన్ హౌస్ ఆపీసర్లు ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ సమస్యలను అధికమించటానికి అక్కడి ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని, సమస్యాత్మకంగా గుర్తించబడిన ప్రాంతాలలో అవసరమైన ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిప్యూటీ కమిషనర్‌లు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్లు అయా ప్రాంతాల నుండి సమీక్షలో పాల్గొన్నారు.
addComments
Post a Comment