దసరా ఏర్పాట్లపై ప్రిన్సిపల్ సెక్రటరీ క్షేత్ర స్థాయిలో సమీక్ష
:
కృష్ణమ్మ హారతుల ట్రయల్ రన్ పరిశీలన :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ (ప్రజా అమరావతి);:
రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమీషనర్ శ్రీ ఎస్. సత్యనారాయణ, ఐఏఎస్ , ఈరోజు సాయంత్రం ఆలయ ఈవో కె ఎస్ రామరావు , దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ GVR శేఖర్ , ఆర్జీవీ ఎన్ వి ఎస్ మూర్తి , మరియు ఆలయ ఇంజినీరింగ్ అధికారులతో కలసి దేవస్థానం నందు అత్యంత వైభవముగా నిర్వహించు దసరా మహోత్సవములు - 2024 ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో సమీక్షించారు.
ఈ సందర్బంగా దుర్గా ఘాట్ చేరుకొని, పవిత్ర కృష్ణ నదీమ తల్లికి వీరు శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించిన అనంతరం కృష్ణమ్మకు నవహారతుల ట్రయల్ రన్ ను వీక్షించారు.
మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ సీతమ్మవారి పాదాలు వద్ద కేశఖండన శాల, స్నాన ఘాట్లు, షవర్లు, ఘాట్ రోడ్ నందు జరుగుచున్న పనులు, వినాయక స్వామి వారి గుడి నుండి క్యూ లైన్లు, షామియానా పనుల స్టేటస్, ఇంజినీరింగ్ పనుల మైల్ స్టోన్స్, కౌంటర్ల ఏర్పాటు, వృద్దులు, దివ్యాంగులకు సదుపాయములు, ఉభయదాతలకు వాహనములు మరియు ఇతర ఏర్పాట్లు, లైటింగ్ ఏర్పాట్లు పనుల స్టేటస్, శివాలయం మెట్ల మార్గం ఎగ్జిట్ మార్గం, అన్నదానం, సెక్యూరిటీ తదితర విషయములు, గత సంవత్సరం లో ఎదురైన ఇబ్బందులు, అధిగమించుటకు తీసుకున్న చర్యలు మరియు తడితర అంశముల గురించి చర్చించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసి, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రభుత్వం నకు మంచి పేరు వచ్చే లాగా, ఏర్పాటులలో ఎటువంటి అలసత్వం లేకుండా సకాలంలో పూర్తి చేసి భక్తులకు మంచిగా, త్వరిత గతిన అమ్మవారి దర్శనం అయ్యేలాగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, కార్యనిర్వాహక ఇంజినీర్లు కె వి ఎస్ కోటేశ్వరరావు, వైకుంఠ రావు, లింగం రమ, డిఈఈ, ఏఈఈ లు, ఏఈఓ లు, పర్యవేక్షకులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment