ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్.
అమరావతి (ప్రజా అమరావతి);
* రెవెన్యూ శాఖామాత్యులు శ్రీ అనగాని సత్య ప్రసాద్ ని కలిసి దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ సమస్యలు వివరించిన ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ - సానుకూలంగా స్పందించిన రెవెన్యూ శాఖామాత్యులు*
* రెవెన్యూ శాఖలో సరిపడా సిబ్బంది, నిధులు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పనిచేసే వాతావరణం కల్పించాలని కోరిన రాష్ట్ర రెవెన్యూ సంఘం*
* ఉద్యోగులకు కనీస శిక్షణ, ఎప్పటికప్పుడు మారుతున్న నూతన నిబంధనలు, చట్టాలు, ఆన్లైన్ సేవలు పై నిరంతరం కనీస శిక్షణ ద్వారా అవగాహన కలిపిస్తే రెవెన్యూ శాఖలో మెరుగైన ఫలితాలు వస్తాయి...
* గత ప్రభుత్వం ఏసీబీ చేత కార్యాలయాల ఆకస్మిక తనిఖీలు పేరుతో ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది...కామన్ డిసిప్లినరి కేసులు వెంటనే ఉప సంహరించాలి ...
ఈ రోజు (23.09.2024) న రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖామాత్యులు శ్రీ అనగాని సత్య ప్రసాద్ గార్ని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన నేడు కలిసి,* రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులు 24/7 పనిచేస్తూ ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలు నుండి ప్రకృతి విపత్తులలో ప్రజలకు అండగా నిలబడే వరకూ ప్రతీ పనిలోనూ *అంకిత భావంతో అహర్నిశలు శ్రమించి సాధారణ పరిపాలన శాఖ విధులు నిర్వహిస్తున్నారని, రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు నుండి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు రెవిన్యూ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ, దీర్ఘకాలికంగా పరిష్కారం కాని ప్రధాన సమస్యలను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏ.పి.జే.ఏ.సి అమరావతి చైర్మన్ బొప్పరాజు గారి ఆధ్వర్యంలో సంఘం ముఖ్య నాయకులు అందరూ ఈ క్రింది విషయాల పై చర్చించడం జరిగింది.*
*సిబ్బంది;*
గత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజన చేసి నూతనముగా ఏర్పడిన జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు పాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సగం సిబ్బందిని వర్క్ టు రూల్ పై కేటాయించడం వలన ఇటు పాత జిల్లా మరియు కొత్త జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లలో ఎక్కడా పూర్తి స్థాయిలో సరిపడా సిబ్బంది లేక తీవ్ర పని ఒత్తిడికి గురి చేయడమే కాకుండా, సరిపడా నిధులు, కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకుండానే గత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. గత ప్రభుత్వం హయంలోనే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) సదరు ఇబ్బందులను గుర్తించి, గతంలో అంటే 13 జిల్లాలు ఉన్నప్పుడు ఒక్కొక్క కార్యాలయంలో 155 మంది వివిధ కేడర్ లో సిబ్బంది పనిచేస్తుంటే, కనీసం అందులో సగం 88 మందిని నియమించమని కోరినా నేటికీ ఫలితం లేకుండా పోయింది.
కనుక ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే గుర్తించి, అన్ని 26 - జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో
సి.సి.ఎల్.ఏ మరియు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రతిపాదనలు మేరకు
" *యూనిఫాం కేడర్ స్ట్రెంథ్* " మంజూరు చేయాలని తద్వారా
పరిపాలన సజావుగా సాగి ఉత్తమ ఫలితాలను పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
* సిబ్బందికి శిక్షణ:*
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కీలక శాఖ అయిన రెవిన్యూ శాఖలో పనిచేసే గ్రామ రెవిన్యూ అధికారి స్థాయి నుండి తహసీల్దారు స్థాయి వరకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందకు, ఎప్పటికప్పుడు మారుతున్న చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ప్రాధాన్య విషయాలపై మరీ ముఖ్యంగా సంబంధిత సాఫ్టువెర్ పై శిక్షణ చాలా అవసరమని, దానివలన
క్షేత్ర స్థాయిలో రెవిన్యూ సిబ్బంది సాంకేతిక మరియు సాధారణ సమస్యలను వేగంగా ఎదుర్కోవడముతో పాటుగా, అవగాహన పెంచుకుని కోర్టు వ్యాజ్యముల సంబంధించి కౌంటర్లు తయారు, దాఖలు చేయడం, కోర్టు ఉత్తర్వులు సకాలంలో అమలు చేయడం తదితర అంశాలు తెలుసుకోవడం, అలాగే ఎప్పటికప్పుడు మారుతున్న చట్టాలు తదితర అంశముల పై సరైన అవగాహన పెంచుకోవడం జరుగుతుంది.
గ్రామ రెవిన్యూ సహాయకుడి స్థాయి నుండి తహసిల్దారు స్థాయి వరకూ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం షెడ్యూల్ ప్రకారం శిక్షణా తరగతులను నిర్వహించుట ద్వారా సిబ్బందిలో త్వరితగతిన నైపుణ్యతను పెంచి తద్వారా సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలా చేయవచ్చు.
కావున, ప్రభుత్వము వెంటనే జోక్యము చేసుకుని సిబ్బందికి సాంకేతిక మరియు సాధారణ సమస్యల పట్ల సరియైన శిక్షణ, కొత్తగా సర్వీస్ లోకి చేరిన వారికి కనీసం 45 రోజులపాటు శిక్షణ, అందుకు అనుగుణంగా తగినన్ని నిధులు మంజూరుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
*సరిపడా నిధులు:*
అసలే విపరీతమైన పని భారముతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రెవిన్యూ శాఖకు , జిల్లాలలో సరిపడా నిధుల కొరత పెనుసవాలు గా మారింది. కనీస నిధులు అందక రెవెన్యూ ఉద్యోగులు ప్రధానంగా క్రింది స్థాయి గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
ఒక్కొక్క తహశీల్దార్ కార్యాలయానికి కార్యాలయ ఖర్చులు (OOE) కు నెలకు పద్దెనిమిది (18/-) రూపాయలు,
కన్సుమబుల్స్-స్టేషనరీ ఎక్సపెన్సెస్ ) కు నెలకు (411/-) రూపాయలు కేటాయింపులు విడ్డూరం.
(గతములో మీ సేవా లు నిర్వహణలో ఉన్న సమయములో జారీ కాబడిన ప్రతీ ఒక్క ధృవీకరణ పత్రమునకు తహసీల్దారు కార్యాలయ స్టేషనరీ ఖర్చుల నిమిత్తము 7 రూపాయలు కేటాయించబడేవి. ఆ నిధులతో కంప్యూటర్లు , ప్రింటర్లు కొనుగులు/ రిపేర్లు , స్టేషనరీ కోగోలుకు వినియోగించుకునేవారు. కానీ గ్రామ / వార్డు సచివాలయములు ఏర్పాటు కాబడిన తరువాత ప్రతీ ఒక్క సేవకు సంబంధించి సచివాలయములలో సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తున్నప్పటికీ గతములో వలే తహసీల్దారు కార్యాలయ స్టేషనరీ ఖర్చులకు ఒక్క రూపాయి కూడా కేటాయిచుటలేదు.)
కోర్టు కంటెంప్ట్ కేసులు మరియు కౌంటర్ దాఖలు కు సంబంధించి సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడం..
నెలకు అద్దె వాహనాల క్రింద రూ. 35, 000/- చెల్లించాల్సి ఉండగా, కేవలం నెలకు రూII 6500 నుండి రూ.15000/- మాత్రమే చెల్లిస్తున్న నేపథ్యంలో, తాసిల్దార్ స్థాయి రెవెన్యూ ఉద్యోగులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలియజేశారు.
పై పరిస్థితులు దృష్ట్యా, వెంటనే ప్రభుత్వం కల్పించుకొని పైన తెలిపిన ముఖ్యమైన అంశాలలో ప్రభుత్వం సరిపడా నిధులను మంజూరు చేయుట ద్వారా ఉద్యోగుల పై పడుతున్న ఆర్థిక ఒత్తిడులను తగ్గించాలని కోరారు.
*గత ప్రభుత్వ హయంలో ఏసీబీ ద్వారా తహశీల్దార్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీలు:*
గత ప్రభుత్వ పాలనలో తహశీల్దారులను వ్యక్తిగతంగానూ మరియు వారి కార్యాలయాలలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు పేరుతో రెవెన్యూ ఉద్యోగులను వేధింపులకు గురిచేసింది. ఎక్కడైతే అవినీతి జరుగుతుందో లేక అవినీతికి పాల్పడి అక్రమ ఆస్తులు సంపాదిస్తారో వారిని శిక్షించాలి తప్ప అనవసరంగా నిజాయితీగా పనిచేసే రెవెన్యూ ఉద్యోగులపై ఆకస్మిక తినిఖీల పేరున భయబ్రాంతు లకు గురి చేయడం/ అవమానించడం తగదని తెలిపారు.
దశాబ్దాలుగా రెవిన్యూ శాఖ ఉన్నతాదికారులైన రెవిన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా రెవిన్యూ అధికారి, సంయుక్త కలెక్టరు, జిల్లా కలెక్టర్ గార్లు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మిక తనికీలు చేస్తారని, అంతే గాని ఏ.సి.బీ అధికారుల తో ఆకస్మిక తనిఖీలు చేసి, చిన్న చిన్న కారణాలకు (అటెండెన్స్, డిస్పాచ్, రిజిస్టర్డ్ పోస్ట్ రిజిస్టర్లు సరిగా మెయింటెయిన్ చేయడం లేదని, అర్జీలు సకాలంలో పరిష్కరించకుండా పెండింగ్ లో ఉంచారని, అక్కడక్కడ పాస్ పుస్తకాలు ఉన్నాయని....) చూపుతూ ఆయా కార్యాలయ ఉద్యోగులందరిపై *"కామన్ డిసిప్లినరీ కేసులు"* నమోదు చేసి, వారి జీవిత కాలంలో వారికి పదోన్నతులు గానీ, జీతాలు, పెన్షన్లు గానీ సకాలంలో రానందున తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అని చెప్పారు.
కనుక గత ప్రభుత్వ హయంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలలోని తహశీల్దార్ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీలు చేసి చిన్న చిన్న కారణాలు చూపుతూ పెట్టిన *"కామన్ డిసిప్లినరీ కేసులు" తక్షణమే ఉపసంహరించుకోవాలని* , ఎవరైనా ఉద్దేశ్య పూర్వకంగా తప్పులు చేసి ఉంటే వారిపై ఆయా జిల్లా కలెక్టర్ ద్వారా తగు చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
కావున, తహసీల్దారు కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో ప్రభుత్వం *కనీస సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పన, కనీస నిధులు, తగిన శిక్షణ* కల్పించి, పైన తెలిపిన కార్యాలయాల్లో *"పనిచేసే సానుకూల వాతావరణాన్ని"* కల్పిస్తే, ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్దేశించే లక్ష్యాలను చేరుకోవడంలో రెవెన్యూ ఉద్యోగులు అహర్నిశలు శ్రమించి లక్ష్యాలను చేరుకుంటారు. పౌరులకు పారదర్శకంగా సేవలు అందించి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకొస్తామన్నారు.
రెవెన్యూ శాఖామాత్యులు స్పందన:
ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన సమర్పించిన (పదకొండు మెమొరాండంలు) ప్రతి అంశాన్ని చాలా సానుకూలంగా ఆలకించిన రెవెన్యూ శాఖామాత్యులు అన్ని అంశాలపై సానుకూలంగా స్పందిస్తూ... కలెక్టర్ కార్యాలయాల్లో సిబ్బంది మంజూరు, రెవిన్యూ ఉద్యోగులకు తగిన శిక్షణ, గత ప్రభుత్వం అన్యాయంగా అనేక రెవెన్యూ ఉద్యోగులపై ఏసీబీ ఆకస్మిక తనిఖీలు ద్వారా నమోదు చేసిన కామన్ డిసిప్లీనరీ కేసులు విషయం తదితర అర్ధికేతర అంశాలపై వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని, ఆర్థిక అంశాలపై ముఖ్యమంత్రి తో, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
addComments
Post a Comment