బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల మధ్య ఉండి బాధ్యతగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.

 

కొల్లిపర (ప్రజా అమరావతి);

    బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల మధ్య ఉండి బాధ్యతగా సహాయ సహకారాలు అందిస్తున్నార



ని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు.

        కొల్లి పర మండలం అన్నవరపు లంకలో బుధవారం హార్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో వరద బాధితులకు వంట సామాగ్రి దోమతెరలు రగ్గులు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గత పది రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్లో  ఉండి ప్రతినిత్యం ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను అందిస్తున్నారని చెప్పారు నష్టపోయిన వారిని ఆదుకోవడమే ఆయన ధ్యేయంగా పనిచేస్తున్నారని చెప్పారు హార్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ పంపిణీ కార్యక్రమం చాలా బాగుందని ప్రశంసించారు.

        జడ్పీ చైర్మన్ హెని క్రిస్టిన మాట్లాడుతూ బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకోలేకపోయినా తమకున్న దాంట్లో బాధితులను ఆదుకోవాలనే ఆలోచనతో  ఈ పంపిణీ  చేపట్టామని చెప్పారు. 

        ఎప్పుడూ ప్రకృతి విపత్తు లు సంభవించిన తమ సంస్థ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. 

        తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వరద బాధితుల కోసం నిర్విరామంగా పనిచేస్తున్నారని ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు వంట నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు పంట నష్టం వేసే అధికారుల వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.         

       ఈ సందర్భంగా దోమ తెరలు రగ్గులు వంట సామాగ్రిని పంపిణీ చేశారు కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, సుద్ధ పల్లి నాగరాజు, పరుచూరి రమ్య తదితరులు పాల్గొన్నారు

Comments