పౌల్ట్రీ రైతుల సమస్యలను పరిష్కరించండి వినతి పత్రం అందయ్యడం జరిగింది.



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


 *పౌల్ట్రీ రైతుల సమస్యలను పరిష్కరించండి వినతి పత్రం అందయ్యడం జరిగింది* 



2 లక్షల టన్ను ల మొక్క జొన్న


దిగుమతి కి పౌల్ట్రీ రైతులు కోసం సుంకం రద్దు కు హామీ  ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.


-  ఎంపీ పురందేశ్వరి 


 పౌల్ట్రీ రైతులు ఎదుర్కొటున్న సమస్య లను సానుకూల దృక్పథంలో పరిష్కరించాలని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ కి ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కోరారు.



 ఈమేరకు  పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులను వెంటబెట్టుకుని  ఢిల్లీలోని  పార్లమెంట్ భవన్ లో   కేంద్ర ఆర్ధిక మంత్రిని సోమవారం  కలుసుకుని వినతిపత్రం సమర్పించారు.   పౌల్ట్రీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, తగిన  పరిస్కారం చేయాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. ఎంపి వెంట ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు కోమట్లపల్లి  వెంకట సుబ్బారావు,  గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం, గోడితి గంగాధర్, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.




 రాజమహేంద్రవరం ఎం పి శ్రీ మతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి నాయకత్వంలో పౌల్ట్రీ రైతులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సమస్యలు తో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్లు కోళ్ళ ను  3 వేల మంది రైతులు పెంపకం సాగిస్తున్నారన్నారు. పరోక్షంగా 10 లక్షల మంది కి జీవనాధారం లభిస్తున్నట్లు తెలియ చేశారు.ఆక్వా రంగం తర్వాత పౌల్ట్రీ రంగం అతి పెద్ద రంగమని శ్రీ మతి దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర ఆర్ధిక మంత్రి కి వివరించారు.



పౌల్ట్రీ రంగంలో ఉన్న రైతాంగానికి కోళ్ళ మేత నిమిత్తం రెండు లక్షల టన్నుల మొక్క జొన్న విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు దిగుమతి సుంకం రద్దు చేయాలని పౌల్ట్రీ రైతులు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కి విన్నవించారు.


ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా సుంకం రద్దుకు స్పందించి హామీ ఇవ్వడంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు పౌల్ట్రీ రైతులు  కృతజ్ఞతలు తెలిపారు.






Comments