ఓటుహక్కు ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమం...



 *ఓటుహక్కు ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమం...* 



 *అలరించిన ముగ్గుల పోటీ...* 


 *అందరిని ఆకట్టుకున్న దీపాలంకరణ తో ఓటేద్ధాం...రండీ. కదిలి రండి...* 


 *ముగ్గుల పోటీలను తిలకించిన ఎన్నికల సాధారణ, పోలీస్ పరిశీలకులు, జిల్లా కలెక్టర్...* 


ఏలూరు, మే,11 (ప్రజా అమరావతి):ఏలూరు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్వీప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏలూరు సెయింట్ థెరిస్తా మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్నికల ప్రాముఖ్యతపై ముగ్గుల పోటీ నిర్వహించారు.  ఈ సందర్బంగా పలువురు మహిళలు ముగ్గుల ద్వారా ప్రజలకు ఓటుహక్కు ప్రాముఖ్యతపై అవగాహన కలిగించే విధంగా వేసిన ముగ్గులు అందరిలో ఓటుహక్కు ప్రాధన్యత ఆలోచింప చేశాయి. ఈముగ్గుల పోటీలను ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. కృష్ణకాంత్ పాఠక్, ఎస్.ఎ. రామన్, పోలీస్ పరిశీలకులు టి. శ్రీధర్, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఎంతో ఆసక్తిగా తిలకించారు.  ఆయా ముగ్గుల ద్వారా ఓటు ప్రాధాన్యతను తెలియజేసే పలు అంశాలను చదివి ఈ పోటీలో పాల్గొన్న మహిళలను వారు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెల్ఫీస్టాండ్ వద్ద ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. కృష్ణకాంత్ పాఠక్ తాము ఓటుహక్కు వినియోగించుకున్నాని సెల్ఫీదిగారు.  అనంతరం అందరిని ఆకట్టుకున్న ఆరు అడుగల మోడల్ ఈవిఎం వద్ద  ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. కృష్ణకాంత్ పాఠక్, ఎస్.ఎ. రామన్, పోలీస్ పరిశీలకులు టి. శ్రీధర్, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఫొటో దిగారు.  జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా స్వీప్ కింద కార్యక్రమాల కింద నిర్వహించిన ఫొటో గ్యాలరీని వారు తిలకించారు,


 *దీపాలంకరణ తో ఓటేద్ధాం...రండీ. కదిలి రండి...* సెయింట్ థెరిస్సా కళాశాల సమావేశ మందిరంలో ఓటేద్ధాం.. రండి. కదిలి రండి... పేరిట ఏర్పాటు చేసిన దీపాలంకరణ అందరిని విశేషంగా ఆకట్టుకుంది. మద్యలో ఈనెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు అంతా తమ ఓటు వినియోగించుకోవాలని జిల్లా యంత్రాంగం కోరుతూ ముగ్గులతో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఆహ్వాన పత్రిక చూపరులను ఆకర్షించింది.  అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అందరితో ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మనదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిస్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని నిర్భయంగా ఓటు వేస్తామని ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. కృష్ణకాంత్ పాఠక్, ఎస్.ఎ. రామన్, పోలీస్ పరిశీలకులు టి. శ్రీధర్, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ప్రతిజ్ఞ నిర్వహించారు.  

కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు,  స్వీప్ నోడల్ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్, కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ మెర్సీ, డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు, ఐసిడిఎస్ పిడి కె. పద్మావతి, బి.సి. సంక్షేమాధికారి ఆర్.వి. నాగరాణి,  ఉద్యానశాఖ డిడి రామ్మోహన్, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి ఎన్ఎస్ కృపావరం, మెప్మా పిడి ఇమ్మానియేల్, డిసిపివో సూర్యచక్రవేణి తదితరులు పాల్గొన్నారు. 


Comments