నాBCలంటూBCలను జగన్ అవమానిస్తున్నారు.

 నాBCలంటూBCలను జగన్ అవమానిస్తున్నారు



         పెమ్మసాని చంద్రశేఖర్  TDP(MP)అభ్యర్థి


 తెనాలి (ప్రజా అమరావతి);

నా BCలు నావాళ్ళంటూ చెప్పే జగన్  అసలెపుడైనా వారిలో ఎవరినైనా తన ఎదురు కూర్చీలో కూర్చోపెట్టుకున్నాడా? అసలు మంత్రులు MLA మంత్రి ఉపముఖ్యమంత్రులకే దర్శనభాగ్యం లభించక లబోదిబో అంటుంటే BCలపై ఏం గౌరవం ఉంటుందని పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. గురువారం  తెనాలి కొత్తపేటలోని రాథాకృష్ణ కల్యాణమండపంలో  తెనాలి నియోజకవర్గ ఆత్మీయసమావేశంలో ఆయన మాట్లాడుతూ  పేరుకు 56కార్పోరేషన్లు  ఏర్పాటు చేశానంటూ ప్రగల్భాలే కాని వాటికి నిథుల కేటాయింపేలేదని అన్నారు. 


 ఇక్కడ రజకులు  ఉన్నత విద్య అభ్యసించినవారికి జగన్ ప్రభుత్వం సరైన  ఉపాథిలేదని జగన్ అకృత్య విథానాలతో పెట్టుబడి దారులు ముందుకు రావటంలేదని  దానికి ప్రత్యామ్నాయంగా కూటమి ని ఎన్నుకోవాల్సన అవరసరం రాష్ట్రప్రజలకుందని అన్నారు. 


రజకవృత్తి అంటే తనకు గౌరవమని మనిషిని అందంగా తీర్చిదిద్దటంలో వారిDry Cleaning ప్రశంశిస్తున్నానని ఇక్కడి  ఆ డ్రై క్లీనింగ్ ఆయంత్రాలు లోపభూయిష్టంగా ఉన్నాయని దీనిలో నైపుణ్యం ఉన్న వారు తనతో అమెరికా వస్తే నాణ్యమైన DryClaning  తో ఇక్కడ మరింతగా రాణిస్తారన్నారు,


MLA అభ్యర్థి మనోహర్ మాట్లాడుతూ రజకులు ఐక్యంగా ఉంటే దేన్నెైనా సాథించవచ్చని గత 5సం॥లుగా రజకులు పలు కష్టాలు అనుభవించారని వారందరిని సాథారణ జనజీవన స్రవంతిలో తీసికొని రావలంటే కూటమిగెలుపు అవసరం ఉందన్నారు. కమ్యూనిటి హాల్  నిర్మిస్తామన్నారు.


ఈ కార్యక్రమంలో  MLC దువ్వాడ రామారావు,  మునిపల్లె దుర్గా ప్రసాద్,  చాట్రగడ్డ ఆంజనేయులు,  దుర్గ,  తవ్వా నాగప్రసాద్, పలువురజకసంఘ నేతలు పాల్గొన్నారు.



Comments