జగన్ వల్లే జీవనాడి పోలవరం విధ్వంసం.



*జగన్ వల్లే జీవనాడి పోలవరం విధ్వంసం


*


*జగన్ వి శవ రాజకీయాలు..మావి సేవా రాజకీయాలు*


*వృద్దులు చనిపోయారంటే అది ముమ్మాటికి జగన్ రెడ్డి పాపమే*


*దళితుల పథకాలు రద్దు చేసి పేదల మనిషినంటాడు*


*ప్రజల జీవన ప్రమాణాలు మార్చేలా కూటమి మేనిఫెస్టో*


*అప్పులు చేసి, పన్నులు వేసి కాదు..సంపద సృష్టించి సంక్షేమం ఇస్తాం*


*-గోపాలపురం ప్రజాగళం సభలో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు*


గోపాలపురం (ప్రజా అమరావతి):- మేము సైతం యుద్దానికి సిద్దం అంటున్న ప్రతీ ఒక్కరికీ వందనాలు. రాష్ట్రంలో ప్రజాగళం గర్జిస్తోంది. ప్రజాగళంలో ఇది 19 వ మీటింగ్. ఎండలను సైతం లెక్కచేయకుండా మీరు ఎంతో అభిమానం చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో జోరు ఇంకా పెంచాలి. ఫ్యాన్ ను తుక్కు తుక్కు చేయాలి. దాన్ని చెత్తకుండీలో పడేయాలి. రాష్ట్రంలో దొంగలు, హంతకులు, బంధిపోట్లు పడ్డారు. వారి నాయకుడే జగన్ రెడ్డి. అందుకే మీరు సైకో జగన్ రెడ్డి అని అంటున్నారు. గతంలో పనిచేసినా ఏ ముఖ్యమంత్రిని ఆ ఆ పేరుతో పిలవలేదు. రాష్ట్రం పట్ల మీకు బాధ్యత ఉంది. మే13 న వెంకటరాజు, పురందేశ్వరీల గెలుపు కోసం రెండు  బటన్లు నొక్కండి. మీ భవిష్యత్తుకు భరోసా నాది. 

*జగన్ వల్లే జీవనాడి పోలవరం విధ్వంసం*

జగన్ రెడ్డి నంగనాచిలా మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కో మీటింగ్ కు 1500 బస్సులు పెడుతున్నారు. మద్యం పోసి ప్రజలను మీటింగులకు తరలిస్తున్నారు. వైసీపీ వారు పేదలకు పింఛన్ ఇవ్వమని బెదరిస్తున్నారు. పెన్షన్ ఏమన్నా వీళ్ల తాత సొత్తా. న్యాయానికి న్యాయం, ధర్మానికి ధర్మం, దెబ్బకు దెబ్బ తీయడానికి సిద్దంగా ఉన్నాం. ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. గోపాలపురంలో గట్టిగా కేకవేస్తే పోలవరం కు వినపడుతుంది. పోలవరం ప్రాజెక్టు ఏపీకి వరం. దేశంలోనే ఇది అతిపెద్ద ప్రాజెక్టు. పోలవరానికి 50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రమాదంలో పడితే ఉభయగోదావరి జిల్లాలు చాలా ప్రమాదంలో పడుతాయి. ఇది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్టు. పోలవరం ద్వారా 2 వేల టీఎంసీ నీళ్లు వాడుకుంటే రాష్ట్రంలో కరువు ఉండదు. రాష్ట్ర విభజన చేసినప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబందించిన 7 ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాను. దూరదృష్టితో పనిచేసి పార్లమెంటు సమావేశాలకు ముందే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ 7 మండలాలను రాష్ట్రంలో కలపడానికి కృషి చేసిన వ్యక్తిని నేను. ఆ 7 మండలాలు రాష్ట్రంలో కలపకుంటే నేడు పోలవరమే లేదు. ఆంధ్రప్రదేశ్ కలను సాకారం చేసిన వ్యక్తిని నేను. 28 సార్లు ప్రాజెక్టును సందర్శించాను. 82 సార్లు వర్చువల్  సమావేశాలు జరిపాను, 414 రోజుల్లో డయాప్రం వాల్ నిర్మాంచాం, 72 శాతం పనులు పూర్తి చేశాం. రూ.11,600 కోట్లు ఖర్చు చేసిన ఘనత తెలుగుదేశంది. అటువంటి ప్రాజెక్టును జగన్ రెడ్డి నాశనం చేశాడు. జగన్ రెడ్డి పోలవరాన్ని 2021 కి పూర్తి చేస్తానని చెప్పాడు. నేడు ఎప్పుడు పూర్తి చేస్తాడో చెప్పలేని దుస్థితి.  డయాఫ్రం వాల్ కొట్టుకుపోయేలా చేశాడు. కాఫర్ డ్యాంను నాశనం చేశాడు. గైడ్‌బండ్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. సైకో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా తాకట్టు పెడుతాడే మీరు ఆలోచించాలి. రాజకీయ కక్షతో ఆకాశంపై ఉమ్మివేసే ప్రయత్నిస్తే ఆ ఉమ్మి జగన్ మోహన్ రెడ్డి ముఖంపైనే పడుతుంది. అదే జరిగింది నేడు. పోలవరాన్ని గోదావరిలో ముంచిన జగన్ రెడ్డికి ఓటు అడిగే హక్కుందా అని అడుగుతున్నా? 

*దళిత యువకులు తరిమి కొట్టాల్సింది జగన్ రెడ్డిని, పాతిపెట్టాల్సింది వైకాపాని:*

గోపాలపురం ఒక ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ ఎస్సీలకు జగన్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. మాట్లాడితే నా ఎస్సీలు అనే జగన్ రెడ్డి ఆ ఎస్సీలనే గొంతు కొస్తున్నాడు. జగన్ రెడ్డి దుర్మార్గుడు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు సబ్‌ప్లాన్ ను అమలు చేయాలి. జగన్ రెడ్డి సబ్ ప్లాన్ నిధులలో ఒక్క రూపాయి ఎస్సీల కోసం ఖర్చు చేయలేదు. వాటిని దారిమళ్లించాడు. నేను 27 సంక్షేమ పథకాలు  ఎస్సీల కోసం తీసుకొస్తే వాటిని రద్దు చేశాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ఎస్సీల కోసం రూ.28 వేల కోట్లు ఖర్చు చేశాం. జగన్ రెడ్డికి దమ్ముంటే ఎస్సీల కోసం ఎంత ఖర్చు చేశాడో చెప్పాలి. దళితులు ఆత్మగౌరవంతో బ్రతకాలని  నేను దళితులకు ఒక్కో ఎకరం రూ.6 లక్షలు పెట్టి భూమి కొని పంపిణీ చేశా. జగన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క ఎకరమైన కొని పంచాడా అని అడుతున్నా. కులాంతర వివాహాలకు ఆర్దిక సహాయం చేశా. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు ద్వారా దళిత పిల్లలను చదివిస్తే బ్రహ్మాండంగా ఎదుగుతారని ఆ పథకాన్ని చిత్తశుద్దితో అమలు చేశాం. వాటిని జగన్ రెడ్డి రద్దు చేశాడు. అంబేడ్కర్ విదేశీ విద్య ద్వారా సామాన్య దళిత కుటుంబాల్లోని పిల్లలను ప్రపంచంలోనే అత్యున్నతమైన విశ్వవిద్యాలయాల్లో చదివించాలని ఒక్కొక్కరి రూ.15 లక్షలు ఆర్ధిక సహాయం చేశాం. ఆ పథకం ఉపయోగించుకుని కొన్ని వేలమంది దళిత పిల్లలు ఉన్నత విద్యా అభ్యసించారు. అటువంటి పథకాన్ని ఎందుకు తొలగించావు సైకో జగన్ రెడ్డి అని అడుగుతున్నా. అంబేడ్కర్ విదేశీ విద్య పేరు తొలగించి జగన్ రెడ్డి పేరు పెట్టుకున్న అహంభావి ఈ సైకో జగన్ రెడ్డి. నువ్వేమన్నా డా. అంబేడ్కర్ కంటే గొప్పవాడివా జగన్ రెడ్డి? ఇటువంటి పెత్తందారుడికి దళితులు ఓట్లు వేస్తారా అని అడుతున్నా. కేంద్రం ఎస్సీల సంక్షేమం కోసం ఇచ్చే సబ్సిడీ పథకాలన్నీ రద్దు చేశాడు. రాష్ట్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ను నాశనం చేశాడు. ఎస్సీ పిల్లలు కార్ డ్రైవర్లుగా మిగిలిపోకూడదని వారు ఆ కార్లకు ఓనర్లు కావాలని ఇన్నోవా కార్లు కొనిచ్చాను. జగన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క ఇన్నోవా కారు కొని ఇవ్వలేదు. ఎస్సీలకు ప్రత్యేకంగా ఒక్క కార్యక్రంమ కూడా అమలు చేయని దుర్మార్గుడు జగన్ రెడ్డి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు. జగన్ రెడ్డి దేశంలోనే అతిపెద్ద పెత్తందారుడు. ఆయన ముందు ఎవరు నోరెత్తకూడదు. ప్రశ్నించకూడదు. నాలుగున్నరేళ్లలో దళితులపై 6 వేల కేసులు పెట్టాడు. ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిన పెద్దమనిషి జగన్ రెడ్డి. 188 మంది దళితులను దారుణంగా హత్య చేశారు. దళిత డ్రైవర్ సుబ్రమణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేశాడు. ఎస్సీ కుర్రవాడిని చంపిన ఎమ్మెల్సీని ప్రక్కన పెట్టుకుని ఏం మాట్లాడుతావ్ జగన్ రెడ్డి. నిన్న పోలవరంలో అంబేడ్కర్ విగ్రహానికి దండ వేయడానికి వెళ్లిన అనంతబాబును ఎస్సీ యువకులు తరిమి, తరిమి కొట్టారు. తరిమి కొట్టాల్సింది జగన్ రెడ్డిని, పాతిపెట్టాల్సింది వైసీపీని. జగన్ రెడ్డి పాతిపెట్టినా దయ్యమైన మరలా రాకుండా కాంక్రీటు వేసి, సీసం వేసి పాతిపెట్టాలని నా తమ్ముళ్లు అంటున్నారు. విశాఖపట్నంలో డా. సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ను పిచ్చివాడిని చేసే చంపేశారు. సీతానగరంలో ఇసుక దోపిడీని ప్రశ్నంచిన దళిత యువకుడు వరప్రసాద్ కు శిరోముండం చేసి అవమానించారు. నా ఎస్సీలు అంటూ అనేనిత్యం జపం చేసే జగన్ రెడ్డి దళిత యువకుడి శిరోముండనాన్నిఏ రోజైనా ఖండించాడా? వెంకటరాజు బాగా చదువుకున్న అభ్యర్ధి. కంప్యూటర్ విద్య అభ్యసించిన వ్యక్తి. ఒక సాధారణ కుటుంబంలోపుట్టి నేడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయనకు మీ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నా.

*శవరాజకీయ పేటెంటుదారుడు జగన్ రెడ్డి:*

జగన్ రెడ్డికి శవ రాజకీయాలు చేయడం బాగా అలవాటు. ఆయన శవాలను చూస్తే నవ్వుతాడు. శవాన్ని చూస్తే అందరూ బాధపడుతారు. జగన్ రెడ్డి తండ్రి చనిపోతే మేం అందరం బాధపడ్డాం. నేను ఆయన తండ్రి పార్ధివ దేహం వద్దకు వెళ్లాను. కానీ, జగన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి అయిపోడానికి సంతకాలు తీసుకుంటూ బాగా బిజీగా ఉన్నాడు. కానీ, ఆయన ప్రయత్నం ఫలించలేదు. జగన్ రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రిగా పనికిరాడని ఆయనను తిరస్కరించిన సంగతి మీకు గుర్తుచేస్తున్నా. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాన్ని తన తండ్రిని చంపించాడని ఆ కంపెనీ రిటైల్ షాపులపై దాడులు చేయించాడు జగన్ రెడ్డి. కానీ, అదే ముఖేష్ అంబానీ సిఫారసు చేసిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఇచ్చాడు. ఇలాంటి నాయకుడిని మీరు సమర్ధిస్తారా? తండ్రిని చంపాడని చెప్పి రాజకీయ అవసరాల కోసం సీటు ఇస్తే..ఏది వాస్తవం చెప్పు జగన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నా. 2014 లో మరలా శవ రాజకీయం చేసి అధికారంలోకి రావాలని చూశాడు. జగన్ రెడ్డికి అనుభవం లేదని, పనికిమాలిన వాడని మీరందరు నాకు ఓట్లేసి గెలిపించారు. 2019 లో బాబాయిని హత్య చేయించి నాటకాలకు తెరతీశాడు. హు కిల్డ్ బాబాయి? వివేకా విషయంలో ముందు గుండెపోటు అన్నాడు. తర్వాత గుండెపోటులో రక్తమొచ్చిందన్నారు. గొడ్డలివేటు అని తెలిసి నాటకాన్ని మార్చేశాడు. నారాసుర రక్త చరిత్ర అని తన పత్రిక సాక్షిలో రాశారు. చెల్లిని మోసం చేశాడు. ప్రస్తుతం ఆ చెల్లెలిపైనే కేసులు పెట్టాడు. చిన్నానను చంపిన దోషిని పక్కన పెట్టుకొని ఉన్నాడు. అవినాష్ రెడ్డే ప్రధాన ముద్దాయని. సీబీఐ కేసు కూడా పెట్టింది.  జగన్ అవినాష్ రెడ్డిని కాపాడాడు. అవినాష్ రెడ్డిపై జగన్ కు అంత ప్రేమ ఎందుకు? హత్యలు చేసిన వ్యక్తిని కాపాడటం నేరం. రాబోయే రోజుల్లో వైసీపీ సింబల్ గా గొడ్డలి గుర్తు పెట్టుకోవాలి. ఫ్యాన్ పని అయిపోయింది. అది తిరిగే పరిస్థితుల్లో లేదు. కాబట్టి రేపటి నుంచి ప్రచారానికి గొడ్డలి తెస్తాడు. ఎలక్షన్ కమిషన్ వైసీపీకి గొడ్డలి గుర్తు ఇస్తే సరిపోతుంది. పీడ విరగడౌతుంది. గొడ్డలివేటు వేసినవారు మీకు కావాలా?, బాబాయిని చంపినవారు మీకు కావాలా? 

*వృద్దులు ఇబ్బందులు పడకుండా పెన్షన్లు సక్రమంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత నీది కాదా జగన్ రెడ్డి?*

*32 మంది వృద్దులను చంపిన హంతకుడు జగన్ రెడ్డే*

32 మంది పెన్షన్ దారులు చనిపోయారని దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ కు బుద్ది, జ్ఞానం లేదు. ప్రభుత్వం జగన్ దే. ముఖ్యమంత్రి జగనే. కాబట్టి ఎలాంటి అవకతవకలు లేకుండా పెన్షన్లు పంచవచ్చు. వాలంటీర్లు ఉండాలి. ప్రజలకు సేవ చేయండి. వాలంటీర్లకు ఇచ్చేది ప్రభుత్వ ధనం. పేదల కట్టే పన్నుల ద్వారా నెలకు రూ.5 వేలు వాలంటీర్లకు ఇస్తున్నారు. సంవత్సరానికి రూ.60 వేలు ఇస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తే ఎవరూ ఏమీ అనరు. వైసీపీకి ఊడిగం చేస్తే ఒప్పుకోనని చాలాసార్లు చెప్పాను. ఎలక్షన్ కమిషన్ కూడా వారిని డ్యూటీకి పక్కన పెట్టారు. అందులో తప్పేమీ లేదు. ఇంకో పక్క లక్షా 30 వేల మంది సచివాలయ ఉద్యోగస్థులున్నారు. నేనే ముఖ్యమంత్రిని అయివుంటే మొదటి రోజే మీ అందరికి ఇంటి వద్దనే పెన్షన్లు అందేలా చేసేవాడిని. అది నా సమర్థత.  ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. 3 వ తేది పెన్షన్ ఇస్తానని 28వ తేదినే ప్రకటించారు. దీని అర్థం వృద్ధులను చంపేయడానికి ముందుగానే పథకం వేశాడు. శవ రాజకీయాలకు తెరతీసిన వ్యక్తి జగన్. 32 మంది చనిపోయారంటున్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. జగనే చంపాడు. పోలీసులు జగన్ పై కేసులు పెట్టి లోపల వేయాలి. గతంలో నేను 2 వందల రూపాయల పెన్షన్ ను 2 వేలు చేశాను. మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని ఆరోజు చెప్పాను. పిల్లలు బాగా చూసుకోకపోయినా నేను రెండు వేలు ఇచ్చి  పిల్లలు బాగా చూసేలా చేస్తానని చెప్పి అమలు చేసిన వ్యక్తిని నేను. అన్నా క్యాంటిన్ కు వెళ్లి మూడు పూటలా భోంచేసేవారు. మందులు కూడా ఫ్రీగా వచ్చేవాడిని. భోజనానికి మందులకు వెయ్యి రూపాయలు పోయినా, మిగిలిన వెయ్యి రూపాయలు మనవళ్లకు, మనవరాళ్లకు చాక్ లెట్ ఇప్పిస్తే వారు గారాబంగా చూసుకునేవారు. ఈ హక్కు నేనే కల్పించాను.  జగన్ అలాంటి ముసలివారిని చంపి శవరాజకీయాలు చేస్తున్నాడు. ఇలాంటి శవ రాజకీయాలను ప్రజలు ఆమోదించరు. ఇలాంటి నీచ రాజకీయాలు చేయొద్దని జగన్ కు చెబుతున్నాను. రాష్ట్రాన్ని వల్లకాడు చేయొద్దు. రాష్ట్రాన్ని  స్మశానంలా మార్చొద్దు. ఇది మంచి పద్ధతి కాదు. 

వైసీపీ డీఎన్.ఏలో శవ రాజకీయాలున్నాయి. తెలుగుదేశం డీఎన్ఏలో సేవా రాజకీయాలున్నాయి. శవ రాజకీయానికి, సేవా రాజకీయానికి గల తేడాను ప్రజలు తెలుసుకోవాలి. మనుషులను చంపి సానుభూతి పొందాలని వేరే వారిపై నెట్టడం జగన్ కు అలవాటు. వారే చంపేస్తారు, వారే శవానికి దండేస్తారు. ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారు. అంతా సినిమా ఫక్కీలో చేస్తారు. వైసీపీ నాయకులు పాత విలన్ నాగభూషణాన్ని మించిపోతున్నారు. ఇక మీదట మీ ఆటలు సాగనివ్వం. నాపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించి చేయండి. 32 మంది చనిపోయారంటే ముద్దాయి నెంబర్ వన్ ముఖ్యమంత్రి, ఆ తరువాత అధికారులు. పెన్షన్లు నేనొస్తే రూ.4 వేలు ఇస్తాననడంతో వైసీపీ నాయకులకు ప్యాంట్లు తడసిపోయాయి. ఆ దెబ్బకు నిన్న మధ్యాహ్నమే డబ్బులు రిలీజ్ చేశారు. ఈరోజు 86 శాతం పెన్షన్లు డిస్టిబ్యూట్ చేశారు. ఇదే బుద్ధి, జ్ఞానం మొదటనే ఉండి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు. ఇది వైసీపీ చేసిన నేరం. 

*రూ.10 ఇచ్చి రూ.90 దోచేస్తున్న దుర్మార్గుడు జగన్ రెడ్డి*

వైసీపీ పాలనలో ఎవరూ బాగాలేరు. ఆడబిడ్డలు అస్సలు సుఖంగా లేరు. ఖర్చులు బాగా పెరిగాయి. ఆదాయం తగ్గింది. ఏ పరిపాలన అయినా సరే మీ ఆదాయాన్ని పెంచి ఖర్చులు తగ్గించే పరిపాలన సుపరిపాలన అవుతుంది. తెలుగుదేశం పార్టీ గతంలో సుపరిపాలనను అందించింది. పది రూపాయలు మీకిచ్చి వంద రూపాయలు దోచేసిన వ్యక్తి జగన్. నేనున్నప్పుడు కరెంటు చార్జీ రూ.200 ఉండేది. ఇప్పుడు వెయ్యి రూపాయలైంది. ఇంకా ఎక్కువ వాడితే రెండు వేలు వస్తుంది. ఎనిమిది వందలు ఎక్స్ట్రా. ఏడాదికి రూ.10 వేలకు మించి పేదవాడి నుంచి కరెంటు రూపంలో దోచుకుంటున్నారు. 

నేనున్నప్పుడు క్వార్టర్ మద్యం బాటిల్ ఎంత? రూ.60 మాత్రమే. ఇప్పుడు రూ.200. రూ.140 నష్టపోతున్నారు. అది కూడా నాసిరకం. క్విక్ ఎక్కదు. రెండో క్వార్టర్ వేసుకుంటారు. జేబు ఖాళీ అయిపోతుంది. రూ.280 రూపాయలు ఔట్. దీంతో పాటు మీకు అనారోగ్యం, కిడ్నీ ఫెయిల్, సగం ఆరోగ్యం పాడవుతుంది. మిగతా డబ్బులు ఆసుపత్రులకు పెట్టాల్సి వస్తోంది. ఇంట్లో ఆడబిడ్డలు అనాధలుగా మారుతున్నారు. జగన్ లాంటి దుర్మార్గుడి దురాచలనకి జాతి బలైపోయింది. 20 రోజులు తాగితే 6 వేలు నష్టం. డబ్బులన్నీ మద్యానికే పోతే ఇంట్లో తిండి ఏం తింటారు? ఆడవారు సంపాదించింది వారిని కొట్టి డబ్బులు లాక్కెళ్లి ఆ డబ్బులతో మద్యం సేవిస్తున్నారు. ఏ షాపులో కూడా ఆన్ లైన్ పేమెంట్స్ లేవు. చిన్న చిన్న షాపులు, తోపుడు బండ్లల్లో, టీ కొట్లల్లో కూడా ఆన్ లైన్ పేమెంట్స్ ఉన్నాయి. మాట్లాడితే బటన్ నొక్కుతాననే జగన్ మందుల షాపుల్లో ఆన్ లైన్  బటన్ పెట్టలేదు. ఇది చిదంబర రహస్యం. తాడేపల్లికి ఈ డబ్బులు పోవాలి. అందుకే ఆన్ లైన్ పేమెంట్లు లేవు. నిలువు దోపిడి చేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే జైల్లో పెడతారు. ఆర్టీసీ రేట్లు పెంచారు. పన్నులు పెంచారు. చెత్తమీద పన్నులు వేశారు. గోదావరి నది పక్కనే ఉన్నప్పటికి ఇసుక దొరకడం లేదు. మద్యం పాపిష్టి డబ్బులు ఎన్నికల్లో వాడడానికి సిద్దం చేశారు. అమ్ముడుబోవడానికి మేం సిద్దంగా లేము. మిమ్మల్ని మొత్తం దోచేశాడు. ఇండస్ట్రీలు వస్తే ఉద్యోగాలొస్తాయి. ఉద్యోగాలొస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే గవర్నమెంటుకు ఆదాయం పెరుగుతుంది. అప్పులు తెచ్చి బటన్ నొక్కితే ఎలా? ట్యాంకులోని నీళ్లను కింద వదిలేస్తే ట్యాంక్ ఎలా నిండుతుంది? అలాగే సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది. 4 వ తేది వచ్చినా పెన్షన్ ఇవ్వలేదు, జీతాలు ఇవ్వలేదు. అప్పుల అప్పారావు మళ్లీ అప్పు తెచ్చి మీకందరికి పప్పు కూడు పెడతాడు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతాను. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచుతాను. విభజన సమయంలో మన ఆదాయం తెలంగాణ కంటే 35 శాతం తక్కువగా ఉండింది. అక్కడ నుంచి జర్నీ ప్రారంబించాను. తెలంగాణ కంటే మిన్నగా పరిపాలన చేసే శక్తి మనకుందని ఆశీర్వదించమని మీకు అడిగాను. 2019కి 30 నుంచి 20 శాతానికి వ్యత్యాసం తగ్గించాను. పెద్ద మొనగాడిలాగ జగన్ వచ్చాడు. పెద్దగా పీకుతానన్నాడు. ఏం పీకాడు? 27 శాతం నుంచి 45 శాతానికి వ్యత్యాసం పెంచాడు. వ్యత్యాసం 18 శాతం పెంచాడు.పోలవరం ప్రారంభించాను. అమరావతికి నాంది పలికాను.  పరిశ్రమలు తీసుకొచ్చాను. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు ప్రాధాన్యతనిచ్చాను. సమర్థతకు పెద్దపీట వేశాను. మహిళలకు 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాడు. ఇవ్వలేదు. ఆసరా పేరుతో టోకరా పెట్టాడు. మద్యపాన నిషేదం చేశాకే ఓట్లు అడుగుతానని మేనిఫెస్టోలో పేర్కొన్నాడు. కాని మద్యపాన నిషేదం చేయలేదు. జగన్ కు ఓట్లు అడిగే హక్కు లేదు. నవ రత్నాలను నవ మోసాలు చేశాడు. 

రైతుకు రూ.12,500 ఇస్తానని ఇవ్వలేదు. రూ.7,500 మాత్రమే ఇచ్చాడు. ఇందులో సెంట్రల్ రూ.6 వేలు ఇచ్చింది. నేను ఒకేసారి రూ.50 వేలు రుణమాఫీ చేశాను. లక్షా 50 వేలు అందరు రైతులకు మాఫీ చేశాను. చివరి నాలుగైదు విడతలు ఇస్తావుంటే జగన్ అడ్డు తగిలాడు. ఎరువులు ఇవ్వడంలేదు, ఇరిగేషన్ లేదు. అభివృద్ధి చేస్తా. సంక్షేమానికి 15 శాతం మాత్రమే జగన్ పెట్టాడు. జగన్ బీమా, పండుగ కానుకలు ఇచ్చాను. ఇలా చెప్పుకుంటు పోతే చాలావుంది. పేదలకు పంచిన పార్టీ టీడీపీ. సూపర్ సిక్స్ ఒక్కొక్కరికి 15 వందలు, ముగ్గురున్నా, నలుగురున్నా ఇస్తాను. నాది నిజమైన ప్రేమ.. జగన్ ది నకిలీ ప్రేమ.  ఆడబిడ్డలు దీన్ని అర్థం చేసుకోవాలి. అందుకే భయపడి గిజ గిజ లాడుతున్నాడు. 

*నాది విజన్..జగన్ ది పాయిజన్:*

విజన్ ఉండే వ్యక్తిని నేనైతే జగన్ ది పాయిజన్.  దూర దృష్టి ఉండే పార్టీ టీడీపీ. జగన్ మొత్తం దోచేసుకుని ప్రజల పట్ల విషం కక్కుతావు. నన్ను పశుపతి అన్నాడు. శివుడు ఏ విధంగా విషాన్ని కంఠంలో పెట్టుకొని అమృతం కోసం పోయినట్లు నేను మంచి కోసం ముందుకు వెళ్తా. ఎక్కడా రాజీ పడకుండా బుల్లెట్ లా దూసుకుపోతున్నాను. నువ్వు ఏసీ బస్సుల్లో తిరుగుతున్నావు, నేను రోడ్లపై తిరుగుతున్నాను. నీవు జనాల్ని తోలుతున్నావు. నేను స్వచ్ఛందంగా వచ్చే జనాలతో మాట్లాడుతున్నాను. జగన్ నీ నాటకాలు ఇక సాగవు. తల్లికి వందనం లో మోసం చేశాడు. కోతల రాయుడు జగన్. ఒక బిడ్డ ఉంటే రూ.15వేలు, ఇద్దరుంటే 30వేలు,  ముగ్గురు ఉంటే 45 వేలు, నలుగురు పిల్లలుంటే 60 వేలు ఇచ్చే బాధ్యత నాది. నేను పేదల మనిషిని.  జగన్ రెడ్డి దేశంలోనే అత్యంత ధనవంతుడైన సి.ఎం. ఆయన పెద్ద పెత్తందారుడు.

*నేను ఈ రాష్ట్రానికి బెస్ట్ డ్రైవర్ ను. మీకు ఎటువంటి అనుమానం వద్దు*

పెరిగిన ధరలు తగ్గిస్తాం. ఆడబిడ్డలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇంటికి పంపిస్తా.   మరలా కుటుంబాల్లో దీపం వెలిగిస్తా. నా తల్లి కట్టెలపొయ్యిపై వంటచేసి బయటకు వస్తే ఆమె కళ్లలో నీళ్లు చూసి చలించిపోయా. అందుకే అక్కలు, చెల్లెళ్లు నా తల్లిపడ్డ అవస్తలు పడకూడదని దేశంలోనే మొట్టమొదటి సారిగా ఆడబిడ్డలకు వంట గ్యాస్ అందించా. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. నేను ఈ రాష్ట్రానికి బెస్ట్ డ్రైవర్ ను. మీకు ఎటువంటి అనుమానం వద్దు. ఆడబిడ్డలు బస్సులు ఎక్కి సూపర్ సిక్స్ చంద్రన్న ఇచ్చి వరం అని గట్టిగా చెప్పండి. మీరెవ్వరూ అడ్డుపడలేరని గట్టిగా చెప్పండి. 

*రాష్ట్రం నుంచి గంజాయి పోవాలంటే చంద్రబాబు రావాలి:*

జాబు రావాలంటే బాబు రావాలి. గంజాయి కావాలంటే జగన్ రావాలి. గంజాయి పోవాలంటే మరలా చంద్రబాబు రావాలి. అది నా బ్రాండు. జే బ్రాండు మద్యం, గంజాయి, మాధకద్రవ్యాలు జగన్ రెడ్డి బ్రాండు. రాష్ట్రంలో యువతను నాశనం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. యువత ఒకసారి గంజాయి మత్తులో పడితే మరలా వెనక్కు రాలేరు. జాగ్రత్తగా ఉండాలి. 

*నేడు రాష్ట్రంలో పని చేస్తున్న టీచర్లలో 75 శాతం మంది నేనిచ్చిన డీఎస్సీల ద్వారా నియామకం పొందినవారే:*

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 40 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మెగా డీఎస్సీ ఇస్తాం. 14 ఏళ్లలో 8 డీఎస్సీలు ఇచ్చాను. జగన్ రెడ్డి ఒక్క డీఎస్సీ ఇవ్వలేదు.  నేడు రాష్ట్రంలో పని చేస్తున్న టీచర్లలో 75 శాతం మంది నేనిచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ల ద్వారా నియమించపబడినవారే. నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగుల భృతి ఇచ్చిన సంగతి జగన్ రెడ్డికి తెలిసినా తెలియనట్లు నాటకాలాడుతాడు. పుట్టుకతో అబ్దాలు నేర్చుకున్న వ్యక్తి జగన్ రెడ్డి. ఆయన కడుపునిండా అబద్దాల పుట్టే. ఆ పుట్ట ఎప్పుడో ఒకసారి పగులుతుంది. రూ.2 వేలు ఫింఛన్ జగన్ రెడ్డి ఇచ్చానని చెబుతున్నాడు. జగన్ రెడ్డి ఎవరికో పుట్టిన బిడ్డను నాబిడ్డ అని చెప్పుకునే రకం. జగన్ రెడ్డి ఒక పనిదొంగ. నా వయస్సు గురించి మాట్లాడే జగన్ రెడ్డి నాలా ఎండల్లో తిరిగితే మరుసటి రోజే ఇంటెన్సివ్ కేర్ లో ఉంటాడు. అనవసరంగా చాలెంజ్ లు చేయవద్దు జగన్ రెడ్డి. నన్ను పెట్టిలో పెట్టి లాక్ చేస్తానని చెబుతున్నాడు. నన్ను లాక్ చేస్తే..జగన్ రెడ్డి పెట్టి, పొట్టా రెండు పగిలిపోతాయి. యువత మేలుకోవాలి. రోడ్లపైకి వచ్చి సైకిల్ ఎక్కాలి. పసుపు జెండాలు పట్టుకుని, గ్లాసులు చేతిలో పెట్టుకుని, కమలాన్ని మద్యలో పెట్టుకుని సైకిల్ జోరు పెంచాలి. కూటమి అభ్యర్ధులందరినీ గెలిపించే బాధ్యత మీదే. 175 అసెంబ్లీలను 25 పార్లమెంట్లను గెలిపించే బాధ్యత ప్రతీ నాయకుడిది, కార్యకర్తలదని నేను తెలియజేస్తున్నా.

అన్నదాతకు ఏడాదికి రూ.25 వేలు ఇస్తానని హామీ ఇస్తున్నా. కౌలు రైతులకు, రైతు కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటాం. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. జగన్ రెడ్డిలా ధాన్యం బస్తాలకు బొక్కలు లేకుండా వారికి న్యాయమైన కొలత కొలిపించే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుంది. ధాన్యం కొనుగోళ్లలోను జగన్ రెడ్డికి కమీషన్ల కక్కుర్తి. 

రూ.4 వేలు ఫించన్ ఇంటి వద్దకే తెచ్చి ఇస్తాం. 50 ఏళ్లు నిండిన ప్రతీ బీసీలకు రూ.4 వేలు ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణంలోని పేదలకు కూడా న్యాయం చేసేలా ఒక డిక్లరేషన్ తీసుకొస్తాం. అందరికీ న్యాయం చేస్తాం. 

*గోపాలపురంలో చెత్త కొవ్వూరులో బంగారం అవుతుందా*

గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే బదిలీపై కొవ్వూరుకు వెళ్లాడు. ప్రశాంతమైన గోపాలపురంలో ఆయన హత్య రాజకీయాల్లో ప్రోత్సహించాడు. నల్లజెర్ల, ద్వారకాతిరుమలలో అక్రమంగా మట్టి, ఇసుక తరలించాడు. చెరువుల్లో మట్టి త్రవ్వి అమ్ముకున్నాడు. సెంటు పట్టాలలో రూ.10 కోట్లు కొట్టేశాడు. ఆయన అక్రమాలు, అరాచకాలను మాఫీ చేయడానికి జగన్ రెడ్డి ఎమ్మెల్యేల ట్రాన్స్ ఫర్లు అంట కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాడు. గోపాలపురంలో చెత్త కొవ్వూరులో బంగారం అవుతుందా తమ్ముళ్లు? హోం మంత్రిగా ఉండే మహిళ అక్కడ గెలవలేదా? జగన్ రెడ్డి మీ చెవుల్లో పూలు పెట్టడానికే ఎమ్మెల్యేల బదిలీలు చేస్తున్నాడు. ఇప్పుడు మీరే తలా ఒక పువ్వు తీసుకెళ్లి జగన్ రెడ్డి చెవులో పెట్టాలి.

ఎర్రచెందనం స్మగ్లర్ భాస్కర్ రెడ్డి. ఆయన కొడుక్కు ఎమ్మెల్యే..ఆయనకు ప్రమోషన్ లో ఒంగోలు ఎంపీ. పెద్దిరెడ్డి రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తి. కొడుకు, తమ్ముడు, ఆయనకు ఇలా ముగ్గురికి మూడు సీట్లు..దళితులకు మాత్రం అలా కుదరదు. ఏంటి ఈ అన్యాయం అని మీరు ప్రశ్నించాలి. దళితులంటే చులకన..జగన్ రెడ్డి మనుషులకు మాత్రం రాష్ట్రాన్ని దోచుకోవడానికి టికెట్లు ఇస్తాడు. 

*రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే ఈ పొత్తు:*

నాకు ఆవేశం ఉంది. కోపం ఉంది. తెలుగు జాతిని కాపాడుకోవాలనే తపన ఉంది. మరలా ఈ జాతిని గాడిన పెట్టి ప్రపంచంలోనే నెం. 1 జాతిగా చేయాలనేది నా లక్ష్యం. పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనేది నా సంకల్పం. ఈ నా సంకల్పానికి నాతో నడిచేందుకు మీరు సిద్దమా? మేం పెట్టుకున్న పొత్తు రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు వస్తే రాష్ట్రాన్ని బాగుచేయడం సులువు అవుతుంది. అందుకే ఈ పొత్తు. అందరూ ఈ పొత్తను అర్ధం చేసుకుని కూటమిని గెలిపించాలని అభ్యర్ధిస్తున్నాను. అర్ధంచేసుకుని ఆశీర్వదించాలని కోరుతున్నా. ఒక్క ఛాన్స్ తో మోసపోయి ఐదేళ్లు మోసంపోయాం. అబద్దాలు, మోసాలు చేసే జగన్ రెడ్డి మనకు వద్దు. వాస్తవాలు తెలుసుకుని..నేను చెప్పే విషయాలపై చర్చ చేయండి. కుటుంబాల్లో భార్యాభర్తలు చర్చించండి. రచ్చబండ వద్ద, బస్సుల్లో ఎక్కడుంటే అక్కడ చర్చచేయండి. నేను చెప్పే విషయాల్లో వాస్తవాలైతే నాతో కలిసిరండి. తెలుగుజాతిని కాపాడుకుందాం. 

*బాపిరాజు పార్టీకి ఎంతో సేవ చేసిన నాయకుడు:*

బాపిరాజు గురించి మీకు చెప్పాలి. బాపిరాజు పార్టీకి ఎంతో సేవ చేశారు. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యేగా పెట్టాం. జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాం. రేపు ఆయనతో మాట్లాడుతా..వెంకటరాజు గెలుపుకోసం అందరూ కలిసిపనిచేయాలని కోరుతున్నా. వెంకరాజు సైతం అందరినీ కలుపుకుని వెళ్లాలని కోరుతున్నాం. జెండాలు మూడు..అజెండా ఒక్కటే. ఆశయం ఒక్కటే" అని చంద్రబాబు నాయుడు అన్నారు.

Comments