టిబి రోగులకు పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయి
జాయింట్ డైరెక్టర్ - టిబి, డాక్టర్ టి. రమేష్ అమరావతి (ప్రజా అమరావతి );
రాష్ట్రం లో అన్ని జిల్లాల్లోనూ టిబి రోగులకు సరిపడా మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని టిబి జాయింట్ డైరెక్టర్ Dr. టి. రమేష్ తెలిపారు. టిబి మందులను బయట నుండి టిబి రోగులు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లోనూ మందులను అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లా స్థాయిల్లో టిబిమందులు కొనుగోలు చేసెందుకు కూడా అనుమతి ఇవ్వటం జరిగింది.
సాధారణ మొండి రోగుల మందుల కొనుగోలు కోసం రూ.49,00,000/- మొత్తాన్ని మంజూరు చేసి, జిల్లా సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాకు విడుదల చేసాము. అన్ని జిల్లాల్లో మందుల నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయి. సెంట్రల్ టిబి డివిజన్ సరఫరాను పునరుద్ధరించే వరకు టిబి మందులను అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాము. సాధారణ మొండి రోగుల కోసం Tab.DSTB-CP(A) మరియు Tab.DSTB-IP(A) మొదలైన వాటి కోసం స్థానికంగా కొనుగోలు చేయడానికి అన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు మరియు జిల్లా టిబి అధికారులకు సూచనలు జారీ చేసాము.
సాధారణ మొండి మందులు జిల్లా మందుల స్టోర్ లలో (DDS) అందుబాటులో ఉన్నాయి. టిబి మందులను నిరంతరం సరఫరా చేస్తున్నాము. అలాగే అన్ని జిల్లాల్లో స్టాక్స్ పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము.
జిల్లాల వారీగా TB ఔషధాల స్టాక్ పొజిషన్ వివరాలు
క్రమ సంఖ్య.
జిల్లా పేరు
20. 04. 2024 నాటికి జిల్లాల్లో 3 FDC టాబ్లెట్లు అందుబాటులో ఉన్న సంఖ్య
1
అల్లూరి సీతారామరాజు
16,380
2
అనకాపల్లి
1,428
3
అనంతపురం
1,818
4
అన్నమయ్య
6,776
5
బాపట్ల
13,496
6
చిత్తూరు
18,284
7
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ
4,932
8
తూర్పు గోదావరి
74,640
9
ఏలూరు
24,388
10
గుంటూరు
10,808
11
కాకినాడ
3,108
12
కృష్ణా
15,600
13
కర్నూలు
43,596
14
నంద్యాల
25,088
15
ఎన్టీఆర్
35,496
16
పల్నాడు
10,360
17
పార్వతీపురం మన్యం
16,884
18
ప్రకాశం
19,050
19
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
38,100
20
శ్రీ సత్యసాయి
13,328
21
శ్రీకాకుళం
25,928
22
తిరుపతి
25,872
23
విశాఖపట్నం
672
24
విజయనగరం
45,304
25
పశ్చిమ గోదావరి
17,400
26
వైఎస్ఆర్ కడప
17,400
మొత్తం
5,26,166
addComments
Post a Comment