*పేరులేని అజ్ఞాత రాజకీయ హోర్డింగ్‌లపై కొరడా ఝళ్లించిన ఈసీఐ*
*గుర్తించదగిన & జవాబుదారీతనాన్ని నిర్ధారించేందుకు పబ్లిషర్ల & ప్రింటర్ల వివరాలను బహిర్గతం చేయాలని ఆదేశం*
*ప్రచురణకర్తల గుర్తింపును బహిర్గతం చేయడం ప్రచార ఫైనాన్సింగ్ అక్కౌంటింగ్ ను నియంత్రిస్తుంది*
*ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 127A నిబంధనలకు అధికారులు ఖచ్చితంగా కట్టుబడాలి*
అమరావతి, ఏప్రిల్ 10 (ప్రజా అమరావతి): ఎన్నికల సంబంధిత మెటీరియల్‌పై హోర్డింగులతో సహా ప్రింటర్ మరియు పబ్లిషర్‌ల స్పష్టమైన గుర్తింపును తప్పనిసరి చేస్తూ, ప్రచార కమ్యూనికేషన్‌లలో జవాబుదారీతనం మరియు పారదర్శకతను నిర్ధారించాలని భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలు/యూటీలను ఆదేశిస్తూ బలమైన సందేశాన్ని నేడు పంపింది. మున్సిఫల్ అధికారుల నియంత్రణలో ఉన్న హోర్డింగ్ స్థలాల్లో గుర్తింపు లేకుండా హోర్డింగ్‌లు ఉన్నాయని కమిషన్‌కు ఫిర్యాదులు అందడంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు శ్రీ జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధులతో కూడిన కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు/యూటీలకు లేఖ యొక్క లింక్ను పంపింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 127A, ప్రింటర్ మరియు ప్రచురణకర్త పేరు మరియు చిరునామాను ప్రముఖంగా ప్రదర్శించకుండా ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ప్లకార్డులు లేదా బ్యానర్‌లను ముద్రించడం లేదా ప్రచురించడాన్ని నిస్సందేహంగా నిషేధిస్తుంది. ప్రచురణకర్తల గుర్తింపును బహిర్గతం చేయడం అనే ఈ అంశం ప్రచారానికి అయ్యే వ్యయాన్ని నియంత్రించడానికి మరియు కంటెంట్ అనేది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లేదా చట్టబద్ధమైన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించినట్లయితే బాధ్యతను నిర్ణయించడానికి ఎంతో కీలకంగా పనిచేస్తుంది.
డబ్బు, కండబలంతో పాటు తప్పుడు సమాచారం అనే సమస్యను ఎన్నికల నిర్వహణ సవాళ్లలో ఒకటిగా ప్రస్తావించడాన్ని గుర్తుచేసుకోవచ్చు అని ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఆదేశంతో, రాజకీయ ప్రకటనల కోసం బహిరంగ ప్రకటనల స్థలాన్ని అద్దెకు ఇచ్చే పట్టణ స్థానిక సంస్థల ప్రింటర్లు, ప్రచురణకర్తలు, లైసెన్సులు పొందినవారు / కాంట్రాక్టర్లపై జవాబుదారీతనాన్ని కమిషన్ ఇప్పుడు ఉంచిందన్నారు. వార్తా పత్రికల్లో రాజకీయ ప్రకటనలు ప్రచురించే సంపాదకుల జాగ్రత్త కోసం ECI ఇటీవలి అడ్వైజరీ వీడియో ప్రెస్ నోట్ తే. 02.04.2024 కి ఇది కొనసాగింపుగా ఉంది.
MCD యొక్క అవుట్‌డోర్ మీడియాలో రాజకీయ ప్రకటనలపై మున్సిఫల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) తే. 03.04.2024 దీ నాడు లైసెన్సీలు మరియు కాంట్రాక్టర్లందరికీ జారీ చేసిన సూచనలను కూడా వాటాదారుల అందరి దృష్టికి తీసుకురాబడింది. పార్టీ/అభ్యర్థి ప్రచారం కోసం రాజకీయ ప్రకటనలను అనుమతించేటప్పుడు, పార్టీ లేదా అభ్యర్థికి వ్యతిరేకంగా ఇచ్చే ఎలాంటి రాజకీయ ప్రకటనలను అయినా ఈ సూచనలు నిషేధిస్తాయి. అధికారంలో ఉన్న పార్టీ/ప్రభుత్వం యొక్క ప్రకటనలకు సంబంధించి ఖజానా ఖర్చుతో విడుదల చేసే ఏదైనా రాజకీయ ప్రకటనను కూడా నిషేధించబడింది. ప్రకటనను ఆమోదించడానికి బాధ్యత వహించే నియమించబడిన అధికారం యొక్క ధృవీకరణ/ఆమోదం పొందిన తర్వాత మాత్రమే అన్ని రాజకీయ ప్రకటనలు ప్రదర్శించబడాలి.
addComments
Post a Comment